అన్వేషించండి

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు

DC Vs GT, IPL 2024: గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది.

Delhi Capitals won by 3 runs: గుజరాత్‌(GT)తో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(DC) విజయం సాధించింది. గుజరాత్‌ విజయానికి చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాల్సి ఉండగా కేవలం 14 పరుగులు మాత్రమే వచ్చాయి. తొలి అయిదు బంతుల్లో పదమూడు పరుగులు రాగా చివరి బంతికి అయిదు పరుగులు అవసరమయ్యాయి. కానీ ఒకే పరుగు రావడంతో గుజరాత్‌ నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రషీద్‌ ఖాన్‌ పోరాడినా గుజరాత్‌కు విజయాన్ని అందించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. గుజరాత్‌ 220 పరుగులకే పరిమితమైంది.

మెరిసిన పంత్‌, అక్షర్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని గుజరాత్‌ బౌలర్లు కట్టడి చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చారు. పృథ్వీ షా-మెక్‌ గుర్క్‌ తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించారు. పృథ్వీ షా ఏడు బంతుల్లో 2 ఫోర్లతో పదకొండు పరుగులు చేసి అవుటవ్వగా... మెక్‌గుర్క్‌ 14 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 23 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ వీరిద్దరూ  వెంటవెంటనే అవుట్‌ కావడంతో ఢిల్లీ స్కోరు మందగించింది. 35 పరుగుల వద్ద పృథ్వీ షా అవుటవ్వగా... 36 పరుగుల వద్ద మెక్‌ గుర్క్‌ కూడా అవుటయ్యాడు. వీరిద్దరూ వెంటవెంటనే అవుటైన తర్వాత అక్షర్‌ పటేల్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. షాయ్‌ హోప్‌ అలా వచ్చి ఇలా వెళ్లిపోయినా అక్షర్‌ మాత్రం పట్టు వదల్లేదు. గుజరాత్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న అక్షర్...43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. రిషబ్‌ పంత్‌తో కలిసి అక్షర్‌ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అక్షర్‌ వెనుదిరిగిన తర్వాత పంత్‌ జోరు అందుకున్నాడు. స్టబ్స్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన పంత్‌ క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత పాత పంత్‌ను గుర్తు చేశాడు. పంత్‌ 43 బంతుల్లో అయిదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో స్టబ్స్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం ఏడే బంతులు ఎదుర్కొన్న స్టబ్స్‌...3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.

గుజరాత్‌ పోరాడినా
225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ పెవిలియన్‌ చేరాడు. కానీ వృద్ధిమాన్‌సాహా, సాయి సుదర్శన్‌ గుజరాత్‌ను విజయం వైపు నడిపించారు. వీరిద్దరూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంతో భారీ స్కోరును ఛేదించే దిశగా గుజరాత్‌ పయనించింది. వృద్ధిమాన్‌ సాహా 25 బంతుల్లో 39 పరుగులు చేసి అవుటవ్వగా...సాయి సుదర్శన్‌ 39 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్‌ తేలిగ్గానే లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కానీ వీరు వెంటవెంటనే అవుటయ్యారు. తర్వాత ఒమ్రాజాయ్‌ ఒకటి, షారూఖ్‌ ఖాన్‌ ఎనిమిది, తెవాటియా నాలుగు పరుగులకే వెనుదిరగడంతో గుజరాత్ కష్టాల్లో పడింది. కానీ డేవిడ్‌ మిల్లర్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 23 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. చివర్లో రషీద్‌ఖాన్‌ కూడా 21 పరుగులతో పోరాడాడు. చివరి ఓవర్‌లో 19 పరుగులు కావాల్సి ఉండగా కేవలం 14 పరుగులు మాత్రమే వచ్చాయి. తొలి అయిదు బంతుల్లో పదమూడు పరుగులు రాగా చివరి బంతికి అయిదు పరుగులు అవసరమయ్యాయి. కానీ ఒకే పరుగు రావడంతో గుజరాత్‌ నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రషీద్‌ ఖాన్‌ పోరాడినా గుజరాత్‌కు విజయాన్ని అందించలేకపోయాడు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget