అన్వేషించండి

IPL 2024: ఆకట్టుకున్న సమీర్‌ రిజ్వీ, రషీద్‌ఖాన్‌పైనే ఆధిపత్యం

CSK vs GT IPL 2024: చెన్నై సూప‌ర్ కింగ్స్ యువ ఆట‌గాడు స‌మీర్ రిజ్వీ త‌న ఐపీఎల్ కెరీర్‌ను ఘ‌నంగా ఆరంభించాడు. ఐపీఎల్‌లో తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచి తన రాకను ఘనంగా చాటుకున్నాడు.

Sameer Rizvi s explosive batting goes viral: చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) యువ ఆట‌గాడు స‌మీర్ రిజ్వీ(Sameer Rizvi )త‌న ఐపీఎల్ కెరీర్‌ను ఘ‌నంగా ఆరంభించాడు. ఐపీఎల్‌లో తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా పరిగణిస్తున్న రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచాడు. అనంతరం మరో భారీ సిక్స్‌ కొట్టాడు. మొత్తం 6 బంతుల్లో 14 పరుగులు చేసి, ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మోహిత్ శర్మ చేతిలో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రిజ్వీ.. 2 సిక్స్‌ల సాయంతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌ చరిత్రలో కెరీర్‌లో తొలి బంతినే సిక్సర్‌ బాదిన తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. తొలి మ్యాచ్‌లోనే క్రికెట్‌ ప్రపంచాన్ని ఆకట్టుకున్న సమీర్‌ రిజ్వీని ఓ వివాదం చుట్టుముట్టింది.


టీ20లో ధనాధన్‌ బ్యాటింగ్‌
సమీర్‌ రిజ్వీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఉత్తర్‌ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2020లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్‌తో రిజ్వీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీ20 క్రికెట్‌లో కేవలం 9 ఇన్నింగ్స్‌లలో రిజ్వీ 49.16 సగటుతో 295 పరుగులు చేశాడు. గతేడాది జరిగిన యూపీ టీ20 లీగ్‌లో కన్పూర్‌ సూపర్‌ స్టార్స్‌ తరపున ఆడిన రిజ్వీ.. 455 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కూడా రిజ్వీ అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా 18 సిక్స్‌లు రిజ్వీ కొట్టాడు. ఈ క్రమంలో తన పేరును ఐపీఎల్‌ వేలంలో రిజిస్టర్‌ చేయించుకున్నాడు. అయితే ఐపీఎల్‌-2024 మినీవేలంతో అతడి దశ తిరిగిపోయింది. రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన సమీర్‌ రిజ్వీని రూ.8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్ సొంతం చేసుకుంది.

చెన్నై వరుసగా రెండో విజయం
ఐపీఎల్‌ 17వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శివమ్ దూబె అర్థ సెంచరీతో చెలరేగగా రచీన్‌ రవీంద్ర, రుతురాజ్‌ గైక్వాడ్‌ చెరో 46 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్, స్పెన్సర్‌ జాన్సన్‌, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేధనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి ఓటమి పాలైంది.ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సాయి సుదర్శన్‌ 37, సాహా 21, మిల్లర్‌ 21 పరుగులు చేశారు. మిగతావారు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపర్‌ చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ తలో రెండు వికెట్లు తీయగా, డారిల్ మిచెల్, పతిరన ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

టాప్ హెడ్ లైన్స్

Axar Patel Captaincy: కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు
కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు
Mustafizur IPL Return: ఐపీఎల్ మినీ వేలంలోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్, రేసులో ముస్తాఫిజుర్  సహా ఏడుగురు స్టార్లు
ఐపీఎల్ మినీ వేలంలోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్, రేసులో ముస్తాఫిజుర్  సహా ఏడుగురు స్టార్లు
SRH Owner Kavya -Anirudh Wedding: గ్రీస్ లో ఒక్కటైన SRH ఓన‌ర్ కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్..  సోషల్ మీడియా వేదికగా గ్రీటింగ్స్ తెలిపిన ఫ్రాంచైజీ
గ్రీస్ లో ఒక్కటైన SRH ఓన‌ర్ కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్..  సోషల్ మీడియా వేదికగా గ్రీటింగ్స్ తెలిపిన ఫ్రాంచైజీ
Devajit Saikia Clarification: ఐపీఎల్‌లో కొత్త జట్ల రాకపై తేల్చి చెప్పిన బీసీసీఐ.. 12 జట్లకి పెంపుపై సైకియా సంచలన ప్రకటన
ఐపీఎల్‌లో కొత్త జట్ల రాకపై తేల్చి చెప్పిన బీసీసీఐ.. 12 జట్లకి పెంపుపై సైకియా సంచలన ప్రకటన

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget