SRH vs PBKS Live Updates: 20 ఓవర్లకు హైదరాబాద్ స్కోరు 120-7, ఐదు పరుగులతో పంజాబ్ గెలుపు
IPL 2021, Sunrisers Hyderabad vs Punjab Kings: పంజాబ్ సన్‌రైజర్స్‌పై ఐదు పరుగుల తేడాతో ఓడించింది.
LIVE
Background
ఐపీఎల్‌లో నేడు రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. షార్జాలో ఈ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్ ఏడో స్థానంలోనూ, హైదరాబాద్‌లోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే హైదరాబాద్ అధికారికంగా ఇంటిబాట పట్టినట్లే.
పంజాబ్ తన గత చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ, సన్‌రైజర్స్ మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గత మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌పై 12 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో కూడా ఓడిపోవడం పంజాబ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేదే. సన్‌రైజర్స్ కూడా ఢిల్లీ చేతిలో ఓడిపోయి ఒత్తిడిలో ఉంది.
పంజాబ్‌లో ఓపెనర్లు తప్ప ఎవరూ రాణించడం లేదు. పంజాబ్ గెలవాలంటే కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, గేల్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడంతో పాటు, మహమ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిల్ రషీద్ బౌలింగ్ గట్టిగా వేయాల్సిందే.
సన్‌రైజర్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. గత మ్యాచ్‌లో వార్నర్, విలియమ్సన్ సహా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది. బెంచ్ మీదున్న ఇంగ్లండ్ ఓపెనర్ రాయ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం దొరుకుతుందేమో చూడాలి. సన్‌రైజర్స్ మిడిలార్డర్ టచ్‌లో లేదు కాబట్టి.. టాప్ ఆర్డర్‌లో డేవిడ్ వార్నర్, సాహా, కేన్ విలియమ్సన్ రాణించాల్సిందే. బౌలర్లలో భువనేశ్వర్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ ఎలాగో మెరుపులు మెరిపిస్తున్నారు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు జరగ్గా 12 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలవగా, పంజాబ్ కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది.
20 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 120-7, ఐదు పరుగులతో పంజాబ్ విజయం
నాథన్ ఎల్లిస్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లలో హైదరాబాద్ ఏడు వికెట్లు నష్టపోయి 120 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో పంజాబ్ ఐదు పరుగులతో విజయం సాధించింది.
భువనేశ్వర్ 3(4)
జేసన్ హోల్డర్ 47(29)
నాథన్ ఎల్లిస్ 4-0-32-0
19 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 109-7
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 109-7గా ఉంది. లక్ష్యం 6 బంతుల్లో 17 పరుగులు.
భువనేశ్వర్ 3(3)
జేసన్ హోల్డర్ 38(24)
అర్ష్‌దీప్ సింగ్ 4-0-22-1
రషీద్ ఖాన్ అవుట్
అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రషీద్ తనకే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
రషీద్ ఖాన్ (సి అండ్ బి) అర్ష్‌దీప్ సింగ్ (3: 4 బంతుల్లో)
18 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 105-6
మహ్మద్ షమీ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 105-6గా ఉంది. లక్ష్యం 12 బంతుల్లో 21 పరుగులు.
రషీద్ ఖాన్ 3(3)
జేసన్ హోల్డర్ 37(22)
మహ్మద్ షమీ 4-1-14-2
17 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 96-6
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 96-6గా ఉంది. లక్ష్యం 18 బంతుల్లో 30 పరుగులు.
రషీద్ ఖాన్ 1(1)
జేసన్ హోల్డర్ 30(18)
అర్ష్‌దీప్ సింగ్ 3-0-18-0