X

Neeraj Chopra Wins Gold: నీరజ్ చోప్రాకు స్వర్ణం... వందేళ్ల భారత నిరీక్షణకు తెర... అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్‌

జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా భారత్‌కు అథ్లెటిక్స్‌లో మొదటి పతకాన్ని అందించాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ఏకంగా స్వర్ణ పతకాన్నే అందించాడు.

FOLLOW US: 

కోట్లాది మంది భారతీయుల కల నెరవేరిన వేళ. అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం భారత్ 100ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడింది. జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా భారత్‌కు అథ్లెటిక్స్‌లో మొదటి పతకాన్ని అందించాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ఏకంగా స్వర్ణ పతకాన్నే అందించాడు. స్వతంత్ర భారతదేశంలో.. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్‌ బింద్రా తర్వాత పసిడి పతకం అందుకున్న వీరుడిగా నిలిచాడు. 23 ఏళ్ల నీరజ్‌ జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో రెండో ప్రయత్నంలో అతడు ఈటెను ఏకంగా 87.58మీటర్లు విసిరి పతకం ఖాయం చేసుకున్నాడు. 

తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఈటెను 87.03మీటర్లు విసిరాడు. క్వాలిఫికేషన్‌లో 86.59మీ. కంటే ఇది అధికం. రెండో ప్రయత్నంలో... మొదటి దాన్ని అధిగమించాడు. ఏకంగా 87.58మీటర్లు జావెలిన్‌ను విసిరి ప్రత్యర్థులకు అందనంత దూరంలోకి వెళ్లిపోయాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ 76.79మీటర్లు విసిరాడు. ఆ తర్వాత కాస్త ఒత్తిడికి గురైన నీరజ్ నాలుగు, ఐదు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో 84.24మీటర్లు విసిరాడు.  నీరజ్‌ తర్వాత చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకూబ్‌(86.67 మీటర్లు)కు రజతం దక్కగా అదే దేశానికి చెందిన మరో అథ్లెట్‌ విటెడ్జ్‌ స్లావ్‌(85.44 మీటర్లు)కు కాంస్యం సొంతమైంది. టోక్యో ఒలింపిక్స్‌కి ముందు నీరజ్ చోప్రా అత్యుత్తమం 88.07మీటర్లు.  

శుభాకాంక్షల వెల్లువ

జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామాజిక మాధ్యమాల శుభాకాంక్షలు తెలిపారు. 

ఈటె విసిరితే పతకమే

ఏ పోటీలకు వెళ్లినా... నీరజ్ చోప్రా ఈటె విసిరాడు అంటే పతకం ఖాయమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్‌ ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లోనూ అగ్ర స్థానంలో నిలిచాడు. దీంతోనే అతడు పతకం సాధిస్తాడని భారతీయులు భావించారు. 2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్‌ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్‌ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.

హర్యానాకు చెందిన నీరజ్‌ చోప్రా పానిపట్‌ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్‌ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్‌ చిన్న వయసులోనే ఇండియన్‌ ఆర్మీకి సెలక్ట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్‌ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్‌ గేమ్స్‌లో జావెలిన్‌ త్రో  ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్‌ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.

అభినవ్ బింద్రా తర్వాత నీరజ్ చోప్రానే

అప్పుడెప్పుడో భారత షూటర్ అభినవ్ బింద్రా వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకం అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బింద్రా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించాడు. 

Also Read: Bajrang Punia Wins Bronze: బజ్‌రంగ్ పునియా కాంస్య పట్టు... కాంస్య పోరులో ప్రత్యర్థి చిత్తు... భారత్ ఖాతాలో ఆరో పతకం

Tokyo Olympics 2020: పతకంపై ఆశలు రేపి... నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న గోల్ఫర్ అదితి అశోక్

Tags: India Tokyo Olympics 2020 Tokyo 2020 Neeraj Chopra Neeraj Chopra Match Javelin Throw Gold Medal India Gold Medal

సంబంధిత కథనాలు

IPL 2022: ఈ సారి ఐపీఎల్‌ వేదిక దుబాయ్‌ నై.. దక్షిణాఫ్రికాకు సై! మరి భారత్‌ సంగతేంటి?

IPL 2022: ఈ సారి ఐపీఎల్‌ వేదిక దుబాయ్‌ నై.. దక్షిణాఫ్రికాకు సై! మరి భారత్‌ సంగతేంటి?

Sourav Ganguly vs Virat Kohli: కోహ్లీకి దాదా షోకాజ్‌ నోటీసులు.. మరో వివాదం.. నిజమెంత?

Sourav Ganguly vs Virat Kohli: కోహ్లీకి దాదా షోకాజ్‌ నోటీసులు.. మరో వివాదం.. నిజమెంత?

IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

Ind vs SA, Innings Highlights: అయిపాయే.. రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ కూడా!

Ind vs SA, Innings Highlights: అయిపాయే.. రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ కూడా!

Ind vs SA, 1st Innings Highlights: రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

Ind vs SA, 1st Innings Highlights: రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

New Covid Omicron Variant BA.2 : ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

New Covid Omicron Variant BA.2 :  ఉఫ్.. ఒమిక్రానూ పిల్లల్ని పుట్టించేస్తోంది.. బ్రిటన్, డెన్మార్క్‌ను గడగడలాడిస్తున్న కొత్త వేరియంట్ BA.2 !

Naga Shaurya: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..

Naga Shaurya: సరికొత్త టైటిల్ తో యంగ్ హీరో.. బ్రాహ్మణ గెటప్ లో ఫస్ట్ లుక్..

Telangana News: బండి సంజయ్‌ అరెస్టుపై సీఎస్‌, డీజీపీకి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

Telangana News: బండి సంజయ్‌ అరెస్టుపై సీఎస్‌, డీజీపీకి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

Mahesh Babu: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?

Mahesh Babu: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?