IND vs ENG 2nd Test Score Live: లార్డ్స్‌లో దుమ్మురేపుతున్న భారత్ బ్యాట్స్‌మెన్... రాహుల్, రోహిత్ జంట కొత్త రికార్డు
టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. గాయంతో రెండో టెస్టుకు దూరమైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
LIVE
Background
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్‌కు దిగింది. డాన్ లారెన్స్, జాక్ క్రాలీ, స్టువర్ట్ బ్రాడ్ స్థానాల్లో మొయిన్ అలీ, హమీద్, మార్క్‌వుడ్ ఇంగ్లాండ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. వర్షం కారణంగా టాస్ వేయడం కాస్త ఆలస్యమైన సంగతి తెలిసిందే.
భారత జట్టు: రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, బుమ్రా, మహమ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ జట్టు: రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ, హసీబ్ హమీద్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, శామ్ కరన్, ఒల్లీ రాబిన్సన్, మార్క్‌వుడ్, జేమ్స్ అండర్సన్
ENG vs IND Match Details
England vs India, 2nd Test
India Tour of England, 2021
Date – August 12 – 16 August 2021
Time: 03:30 PM IST
Venue: Lords, London
IND vs ENG : లార్డ్స్‌లో తొలిరోజు భారత్ పైచేయి... సెంచరీ చేసిన రాహుల్... 69ఏళ్ల రికార్డు బ్రేక్
లార్డ్స్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు భారత్ పైచేయి సాధించింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ మంచి ఓపెనింగ్ ఇచ్చారు. ఇద్దరూ రికార్డులు తిరగరాసి లార్డ్స్ లో పరుగుల మోత మోగించారు. ఈ ఓపెనింగ్ జోడీ 69ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 126 పరుగుల భాగస్వామ్యంతో వంద పరుగులపైగా పార్టనర్‌షిప్ నెలకొల్పిన జోడీగా చరిత్ర తిరగరాశారు. 1952లో జరిగిన మ్యాచ్‌లో అప్పటి ఓపెనింగ్ జోడీ వినోద్ మన్కడ్-పంకజ్ రాయ్ కలిసి లార్డ్స్ గ్రౌండ్‌లో నెలకొల్పిన 106పరుగులే ఇప్పటికి అత్యధిక ఓపెనింగ్ పార్టనర్ షిప్. ఇప్పుడు దాన్ని రాహుల్, రోహిత్ జంట బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్‌లో ధాటిగా ఆడిన రోహిత్ శర్మ 83పరుగులు చేసి ఔటయ్యారు. 145 బంతుల్లో 11ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు.
రోహిత్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన చటేశ్వర్ పుజారా ఈసారి కూడా విఫలమయ్యాడు. నిలదొక్కున్నట్టే కనిపించినా 23 బంతుల్ల 9పరుగులు చేసి ఆండర్సన్ బౌలింగ్‌లోనే బెయిర్‌స్టాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్ కోహ్లీ.. రాహుల్‌కు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ టెస్టుల్లో తన ఐదో సెంచరీ చేసుకున్నాడు. కోహ్లీ అర్థసెంచరీ చేసేటట్టు కనిపించాడు కానీ... 42పరుగుల వద్ద రాబిన్సన్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రహానే నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ప్రస్తుతం 9౦ ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 276పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 127పరుగులతో, రహానే 1పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ రెండు వికెట్లు తీసుకుంటే.. రాబిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.
22 ఓవర్లకు 57 పరుగులు
లంచ్ విరామం అనంతరం వర్షం తగ్గడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. 22 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ ఏమీ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 40, కేఎల్ రాహుల్ 11 క్రీజులో ఉన్నారు.
లార్డ్స్‌లో ఓపెనర్ల రికార్డు
లార్డ్స్ గ్రౌండ్స్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(35), కేఎల్ రాహుల్ (10) కొత్త రికార్డు నెలకొల్పారు. వీరిద్దరూ తొలి సెషన్‌లో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 2008లో ఇదే మైదానంలో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్ట్రాస్, అలిస్టర్ కుక్ తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించిన తర్వాత రోహిత్, రాహుల్ సాధించిన ఈ 46 పరుగులే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం.
లంచ్ విరామానికి టీమిండియా 46/0
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ తొలి రోజు లంచ్ విరామానికి భారత్ వికెట్ ఏమీ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 35, కేఎల్ రాహుల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా లంచ్ విరామం ముందుగానే వచ్చింది. టాస్ వేయడానికి ముందు కూడా వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
That's Lunch on Day 1⃣ of the second #ENGvIND Test at Lord's! @ImRo45 (3⃣5⃣*) & @klrahul11 (1⃣0⃣*) take #TeamIndia to 4⃣6⃣/0⃣.
— BCCI (@BCCI) August 12, 2021
Scorecard 👉 https://t.co/KGM2YELLde pic.twitter.com/hFOG2VfQJt
రోహిత్ 35, కేఎల్ రాహుల్ 10
వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత్ 46 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ 35, కేఎల్ రాహుల్ 10 పరుగులతో ఉన్నారు.