IND vs SL: శ్రీలంకపై టీమిండియా అరుదైన ఘనత - ఒక్కటీ ఓడిపోకుండా!
శ్రీలంకతో జరిగిన రెండో వన్డే విజయంతో టీమిండియా అరుదైన ఘనతను సాధించింది.
IND vs SL 2nd ODI: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. భారత్ విజయంలో కేఎల్ రాహుల్ అద్భుత అర్ధ సెంచరీ కీలక పాత్ర పోషించింది. ఆరు ఫోర్ల సాయంతో 64 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా వన్డే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. ఈ విజయంతో టీమిండియా తన పేరిట ఓ ప్రత్యేక రికార్డును నెలకొల్పింది.
ఈ రెండు జట్ల మధ్య భారత గడ్డపై ఇప్పటివరకు మొత్తం 26 సిరీస్‌లు జరిగాయి. వీటిలో శ్రీలంక ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. 26 సిరీస్‌లకు గాను 22 సిరీస్‌లను టీమిండియా గెలుచుకోగా, మిగిలిన నాలుగు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.
స్వదేశంలో శ్రీలంకపై ఒక్క సిరీస్ కూడా ఓడిపోని రికార్డును టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ జనవరి 15వ తేదీన తిరువనంతపురంలో జరగనుంది. అంతకుముందు గౌహతి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రెండో మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి
ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ మూడు, మహ్మద్ సిరాజ్ మూడు, ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఆదిలోనే తడబడినట్లు కనిపించింది. భారత జట్టు 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడంతో పాటు తన స్థిరమైన ఇన్నింగ్స్‌తో తడబడిన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
View this post on Instagram
View this post on Instagram