By: ABP Desam | Published : 21 Jul 2021 03:33 PM (IST)|Updated : 21 Jul 2021 03:33 PM (IST)
Mickey Arthur
కొలంబో: శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్, లంక కెప్టెన్ దాసున్ షనకల మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రస్తుతం వైరల్‌గా మారింది. మొదట టీమిండియా ఓటమి దిశగా సాగుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో సంతోషంగా కనిపించిన ఆర్థర్.. క్రమంగా చాహర్ నిలుద్కొకుకోవడం.. ఆ తర్వాత భువీతో కలిసి ఇన్నింగ్స్ నడిపించడం ఆర్థర్‌కు సహనం కోల్పోయేలా చేశాయి. ఈ సందర్భంగా అతను డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు.
— cric fun (@cric12222) July 20, 2021
ఇక మ్యాచ్ చివర్లో లంక ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యలోంనే మికీ ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చి కెప్టెన్ షనకతో ఏదో చర్చించాడు. ఆర్థర్ ఏవో సైగలు చేస్తుంటే షనక కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇరువరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో వెలుగు చూసింది. ఈ వీడియోపై అభిమానులు ఎవరికి తోచింది వారు కామెంట్ చేశారు. '' మ్యాచ్ జరుగుతుంటే కోచ్ మైదానంలోకి అడుగుపెట్టడం రూల్స్‌కు విరుద్ధం.. టీమిండియా ఆటతీరును డిస్టర్బ్ చేయాలనే ఆర్థర్ ఇలా ప్లాన్‌తోనే షనకతో గొడవపడినట్లు నటించాడంటూ'' ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కామెంట్లు పెడుతున్నారు.
Mickey arthur be like : to ye he tumhari team bsdk #INDvSL #SLvsIND pic.twitter.com/AFiCPpXzLI
— Manan Dave (@davemanan247) July 20, 2021
మరో వైపు టీమిండియా కోచ్ ద్రవిడ్ మాత్రం ఎంతో సహనంతో, తన టెన్షన్‌ను చిరునవ్వుతో వ్యక్తపరుస్తూ కనిపించాడు. డగౌట్లో ఆటగాళ్లకు సలహాలు ఇస్తూ, ఎప్పుడూ వారితో ఏదో చర్చిస్తూనే కనిపించాడు. ఇదంతా చూసిన అభిమానులు మన కోచ్‌కి, శ్రీలంక కోచ్‌కి ఎంత తేడానో అంటూ వైరలవుతోన్న ఫొటోలు, వీడియోలకు కామెంట్లు పెడుతున్నారు.
Rahul Dravid come out to the dugout and give advice to Rahul Chahar to pass Deepak Chahar. #INDvSL pic.twitter.com/1tu3QyTVhU
— CricketMAN2 (@man4_cricket) July 20, 2021
భారత్ విజయానికి చివరి 24 బంతుల్లో 29 పరుగులు అవసరమైన దశలో చమీరా బౌలింగ్‌కి రాగా.. దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్ చెరొక ఫోర్ కొట్టారు. ఎక్కువగా బ్యాట్ ఎడ్జ్ తాకుతూ కనిపించిన బంతి కీపర్ పక్క నుంచి లేదా థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి వెళ్తూ కనిపించింది. దాంతో.. ఓవర్ల మధ్యలో నిబంధనల్ని అతిక్రమించి మరీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శ్రీలంక ఆటగాళ్లకి సూచనలు చేసిన మిక్కీ ఆర్థర్.. చివర్లో ఆటగాళ్లు ఫీల్డింగ్ తప్పిదాలు చేయడంతో సహనం కోల్పోయాడు. రాహుల్ ద్రవిడ్ మాత్రం ఒక్కసారి డ్రెస్సింగ్ రూము నుంచి వెలుపలికి వచ్చి డగౌట్లో ఉన్న డ్రింక్స్ బాయ్ రాహుల్ చాహర్‌కి కొన్ని సూచనలు చెప్పి.. అవి దీపక్ చాహర్‌కి చేరవేయాల్సింది సూచించి వెళ్లిపోయాడు.
PBKS Vs DC Highlights: టాప్-4కు ఢిల్లీ క్యాపిటల్స్ - కీలక మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం!
PBKS Vs DC: ఆఖర్లో తడబడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ ముందు సులువైన లక్ష్యం!
Batsmen Out At 199: 199 మీద అవుటైన ఏంజెలో మాథ్యూస్ - ఆ 12 మంది సరసన - ఇద్దరు భారతీయలు కూడా!
PBKS Vs DC Toss: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ - ప్రతీకారానికీ రెడీ!
CSK Worst Record: ఐపీఎల్లో చెన్నై చెత్త రికార్డు - 15 సీజన్లలో ఏ జట్టూ చేయని ఘోరమైన ప్రదర్శన!
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై
AP PCC New Chief Kiran : వైఎస్ఆర్సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?
Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా, చూడండి ఎంత బావుందో