అన్వేషించండి

IND vs SL: సంజు శాంసన్‌ క్లాస్, కుర్రాళ్లలో మస్తు టాలెంట్‌ ఉంది బ్రో అంటున్న రోహిత్‌

India vs Sri Lanka T20 Series: రెండో టీ20లో సంజు శాంసన్ బ్యాటింగ్‌ను రోహిత్‌ శర్మ పొగిడేశాడు. తన సత్తా చూపించాడని వెల్లడించాడు.

India vs Sri Lanka T20 Series: శ్రీలంకతో రెండో టీ20లో సంజు శాంసన్ (Sanju Samson) బ్యాటింగ్‌ అద్భుతంగా ఉందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ప్రశంసించాడు. కఠిన పరిస్థితుల్లో ఎలా ఆడగలడో తన బ్యాటింగ్‌ ద్వారా చూపించాడని పేర్కొన్నాడు. యువ క్రికెటర్లకు తలుపులు తెరిచే ఉన్నాయని వెల్లడించాడు. వాటిని ఒడిసిపట్టుకొని తమను తాము నిరూపించుకోవాలని సూచించాడు. 2-0తో సిరీస్‌ గెలిచిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.

Sanju Samson క్లాస్‌ బ్యాటింగ్‌

రెండో టీ20లో భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా (Team India) త్వరగా ఓపెనర్ల వికెట్ల చేజార్చుకుంది. అప్పుడు శ్రేయస్‌ అయ్యర్‌తో (Shreyas Iyer) కలిసి సంజు శాంసన్‌ విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆచితూచి ఆడుతూనే విధ్వంసకరమైన షాట్లు బాదేశాడు. వీరిద్దరూ 47 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా సంజు తన క్లాస్‌ చూపించాడు. 25 బంతుల్లో 39 పరుగులు చేశాడు. లాహిరు కుమార వేసిన 13వ ఓవర్లో మూడు భారీ సిక్సర్లు బాదేసి మ్యాచును టీమ్‌ఇండియా వైపు తిప్పేశాడు. అతడు ఔటయ్యాక శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆటను ముగించారు.

చాలా టాలెంట్‌ ఉంది

'మా బ్యాటింగ్‌ యూనిట్‌లో చాలామంది ప్రతిభావంతులు ఉన్నారు. మేం వారికి అవకాశాలు ఇస్తూనే ఉంటాం. వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం వారిపైనే ఉంది. తనెంత బాగా బ్యాటింగ్‌ చేయగలడో సంజూ శాంసన్‌ చూపించాడు. దొరికిన ఛాన్సులు ఒడిసిపట్టుకోవడమే ముఖ్యం. కుర్రాళ్లలో చాలా టాలెంట్‌ ఉంది. మైదానంలోకి వెళ్లి నిరూపించుకొనేందుకు వారికో అవకాశం కావాలంతే. ఇంకా చాలామంది ఎదురు చూస్తున్నారు. వారికీ టైమ్‌ వస్తుంది. జట్టులోకి వస్తూ పోతున్న వారిని మేం జాగ్రత్తగా చూసుకోవాలి' అని హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (Hitman Rohit Sharma) అన్నాడు.

2-0తో సిరీస్‌ కైవసం

Ind VS SL 2nd T20I: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 183 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 17.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్‌ను కూడా 2-0తో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (74 నాటౌట్: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. రవీంద్ర జడేజా (45 నాటౌట్: 18 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), సంజు శామ్సన్ (39: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు) రాణించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABPMadhavi Latha vs Asaduddin Owaisi |  పాతబస్తీలో కొడితే దేశవ్యాప్తంగా రీసౌండ్ వస్తుందా..? | ABPAllari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Embed widget