Ind vs SA, 2nd Test Highlights: వాండరర్స్‌లో మొదటిసారి వండర్.. ఏడు వికెట్లతో దక్షిణాఫ్రికా విజయం!
IND vs SA, 2nd Test, Wanderers Stadium: వాండరర్స్ స్టేడియంలో జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లతో విజయం సాధించింది.
వాండరర్స్ టెస్టులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. 240 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (96 నాటౌట్: 188 బంతుల్లో, 10 ఫోర్లు) దగ్గరుండి ప్రొటీస్‌ను గెలిపించాడు. టెస్టు సిరీస్ 1-1తో సమం అయింది. మూడో టెస్టులో గెలిచిన వారికి సిరీస్ దక్కనుంది. నిజానికి వాండరర్స్ మనకు బాగా కలిసొచ్చిన స్టేడియం. ఇక్కడ భారత్ ఇప్పటివరకు ఆరు టెస్టులు ఆడగా.. ఇదే మొదటి ఓటమి. 2018లో భారత్ ఇక్కడ విజయం సాధించింది. 2007లో భారత్ ఇక్కడే ఫైనల్స్ ఆడి టీ20 వరల్డ్ కప్‌ను కూడా గెలుచుకుంది.
నాలుగో రోజు వర్షం కారణంగా లంచ్ వరకు మ్యాచ్ ప్రారంభం కాలేదు. అనంతరం 118-2 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మ్యాచ్‌ను ఈరోజే ముగించాలన్నట్లు ఆడారు. కేవలం 27.4 ఓవర్లలోనే 122 పరుగులు సాధించారు. దాదాపు నాలుగు పైగా రన్‌రేట్‌తో దక్షిణాఫ్రికా ఈరోజు పరుగులు చేసింది.
డీన్ ఎల్గర్, వాన్ డర్ డసెన్ (40: 92 బంతుల్లో, ఐదు ఫోర్లు) మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. 175 పరుగుల వద్ద షమీ.. వాన్ డర్ డసెన్‌ను అవుట్ చేయడంతో అద్భుతం జరుగుతుందేమోనని భారత అభిమానులు ఆశపడ్డారు. అయితే టెంపా బవుమా, డీన్ ఎల్గర్ అస్సలు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఆడారు. అభేద్యమైన నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 68 పరుగులు జోడించారు. దీంతో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లతో విజయం అందుకుంది. భారత బౌలర్లలో షమీ, శార్దూల్ ఠాకూర్, అశ్విన్‌లకు చెరో వికెట్ దక్కింది.
South Africa beat India for the first time at the Wanderers and keep the series alive 💥
— ICC (@ICC) January 6, 2022
Dean Elgar leads by example and helps the Proteas level the series 1-1 👏#WTC23 | #SAvIND pic.twitter.com/zqgRP5Cm1x
South Africa win the second Test by 7 wickets.
— BCCI (@BCCI) January 6, 2022
The series is now leveled at 1-1. #TeamIndia will bounce back in the third Test. 👍 👍 #SAvIND
Scorecard ▶️ https://t.co/b3aaGXmBg9 pic.twitter.com/s5z3Z01xTx
Also Read: జకోవిచ్‌కు అవమానం.. ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత, ఆ దేశ అధ్యక్షుడి మండిపాటు
Also Read: బుమ్రా, జన్సెన్ మాటల యుద్ధం..! మైదానంలో టెన్షన్.. టెన్షన్
Also Read: విహారి పోరాటానికి హ్యాట్సాఫ్! సఫారీల లక్ష్యం 240.. టీమ్ఇండియా 266 ఆలౌట్
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.