News
News
వీడియోలు ఆటలు
X

IND vs SA T20 Live Streaming: రెండో టీ20 వేదిక ఏంటి? లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ టైమింగ్స్‌ ఇవీ!

India vs South Africa T20 Live Streaming: భారత్‌, దక్షిణాఫ్రికా రెండో టీ20కి వేళైంది. తొలి పోరులో టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. కీలకమైన రెండో మ్యాచ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌, టెలికాస్ట్‌ వివరాలు ఇవీ!

FOLLOW US: 
Share:

India vs South Africa T20 Live Streaming: భారత్‌, దక్షిణాఫ్రికా రెండో టీ20కి వేళైంది. ఐదు మ్యాచుల సిరీసులో టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. తొలిమ్యాచులో 212 పరుగులు టార్గెట్‌ చేసినా గెలవలేదు. డేవిడ్‌ మిల్లర్‌, వాండర్‌ డుసెన్‌ అజేయ అర్ధశతకాలు దంచికొట్టడంతో సఫారీలు విజయం అందుకున్నారు. కీలకమైన రెండో మ్యాచ్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌, టెలికాస్ట్‌ వివరాలు ఇవీ!

When Does India vs South Africa 2nd T20  Begin (Date and Time in India)?

భారత్‌, దక్షిణాఫ్రికా రెండో టీ20 వేదిక కటక్‌లోని బారాబటి స్టేడియం. సాయంత్రం 6:30 గంటలకు టాస్‌ వేస్తారు. 7 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. ఇప్పటికే టికెట్లన్నీ విక్రయించారు. భారీ స్థాయిలో అభిమానులు వచ్చే అవకాశం ఉంది.

Where to Watch India vs South Africa 2nd T20 Match?

భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌ ప్రసార హక్కులను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ దక్కించుకుంది. స్టార్‌స్పోర్ట్స్‌ 1, స్టార్‌స్పోర్ట్స్‌ 1 హెచ్‌డీ, స్టార్‌స్పోర్ట్స్‌ 1 హిందీ, స్టార్‌స్పోర్ట్స్‌1 హెచ్‌డీ హిందీ, స్టార్‌స్పోర్ట్స్‌ 1 తమిళ్‌, స్టార్‌స్పోర్ట్స్‌1 తెలుగు,  స్టార్‌స్పోర్ట్స్‌1 కన్నడలో మ్యాచ్‌ ప్రసారం అవుతుంది.

How to Watch India vs South Africa 2nd T20 Match Live Streaming Online for Free in India?

భారత్‌, దక్షిణాఫ్రికా తొలి టీ20ని లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. ఎయిర్‌ టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో సహా మరికొన్ని ఆపరేటర్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆయా ప్రీపెయిడ్‌, పోస్టు పెయిడ్‌ ప్లాన్లను బట్టి లైవ్‌ స్ట్రీమింగ్‌ వీక్షించొచ్చు.

India vs South Africa T20 Series

దక్షిణాఫ్రికా టీమ్‌ఇండియాతో ఐదు టీ20లు ఆడనుంది. జూన్‌ 9న దిల్లీ, 12న కటక్‌, 14న వైజాగ్‌, 17న రాజ్‌కోట్‌, 19న బెంగళూరులో మ్యాచులు ఆడుతుంది. జులై 1 నుంచి ఇంగ్లాండ్‌ పర్యటన మొదలవుతుంది. టీమ్‌ఇండియా అక్కడ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుంది. అంతకన్నా ముందు ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఉంటాయి.

What happend in India vs South Africa 1 st T20 match

మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి విజయం సాధించింది. డేవిడ్ మిల్లర్ (64 నాటౌట్: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), రాసీ వాన్ డర్ డుసెన్ (75 నాటౌట్: 46 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించారు.

Published at : 11 Jun 2022 05:15 PM (IST) Tags: Cricket Score Live India vs South Africa IND vs SA T20 Live Streaming IND vs SA T20 Live IND vs SA T20 Score Live Cricket Score Live Streaming

సంబంధిత కథనాలు

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్‌ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?

LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ - ఎలా ఉందో చూశారా?

LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ -  ఎలా ఉందో చూశారా?

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

టాప్ స్టోరీస్

Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Balineni Meet Jagan :  సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?