News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

IND vs NZ 2nd Test: అజాజ్‌కు 14 వికెట్లు.. న్యూజిలాండ్‌ లక్ష్యం 540

ముంబయి టెస్టులో న్యూజిలాండ్‌కు ఇక కష్టమే! ఆ జట్టుకు టీమ్‌ఇండియా 540 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. 276/7 వద్ద కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

FOLLOW US: 
Share:

ముంబయి టెస్టులో న్యూజిలాండ్‌కు ఇక కష్టమే! ఆ జట్టుకు టీమ్‌ఇండియా 540 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. 276/7 వద్ద కోహ్లీసేన  రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (62; 108 బంతుల్లో 9x4, 1x6) అర్ధశతకంతో అదరగొట్టాడు. చెతేశ్వర్‌ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6), శుభ్‌మన్‌ గిల్‌ (47; 75 బంతుల్లో 4x4, 1x6) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నారు. అక్షర్‌ పటేల్‌ (41*; 26 బంతుల్లో 3x4, 4x6) అజేయంగా నిలిచాడు. మొత్తంగా కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ ఈ మ్యాచులో 14 వికెట్లు తీశాడు.

ఓవర్‌నైట్ స్కోరు 69/0తో మూడోరోజు టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. 38 పరుగులతో క్రీజులోకి వచ్చిన ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (62; 108 బంతుల్లో 9x4, 1x6) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌ అర్ధశతకం సాధించాడు. అతడికి తోడుగా 29 పరుగులతో బ్యాటింగ్‌ చేపట్టిన చెతేశ్వర్‌ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరినీ కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేలే ఔట్‌ చేయడం గమనార్హం. జట్టు స్కోరు 107 వద్ద మయాంక్‌, 115 వద్ద పుజారాను అతడు పెవిలియన్‌ పంపించాడు.

ఓపెనర్లు ఔటయ్యాక శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ (36; 84 బంతుల్లో 1x4, 1x6) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. మూడో వికెట్‌కు 144 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. కీలక సమయంలో అర్ధశతకం ముందు గిల్‌ను రచిన్‌ రవీంద్ర ఔట్‌ చేయడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత ఆరు పరుగుల వ్యవధిలోనే శ్రేయస్‌ అయ్యర్‌ (14), విరాట్‌ కోహ్లీ ఔటయ్యారు. అయితే అక్షర్‌ పటేల్‌ వేగంగా ఆడి సిక్సర్లు బాదేయడంతో టీమ్‌ఇండియా 276/7కి డిక్లేర్‌ చేసింది.

Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్‌.. కిర్రాక్‌! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్‌!

Also Read: PV Sindhu: వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరిన సింధు.. ప్రత్యర్థి ఎవరంటే?

Also Read: Ajaz Patel Record: 10 వికెట్ల ఫీట్.. ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటే.. వారికి మాత్రమే సాధ్యమా?

Also Read: Ajaz Patel History: 10 వికెట్ల ఘనతను 2సార్లు ప్రత్యక్ష్యంగా చూసింది ఇద్దరే! ఒకరు ద్రవిడ్‌.. మరొకరు ఎవరంటే?

Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!

Also Read: IND vs NZ , Ajaz patel: అజాజ్‌ అదరహో..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన భారత సంతతి స్పిన్నర్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Dec 2021 02:01 PM (IST) Tags: Mohammed Siraj Virat Kohli Team India Indian Cricket Team Tom Latham Ind Vs NZ New Zealand cricket team IND vs NZ 2021 IND vs NZ Test series IND vs NZ 2nd Test wankhade stadium Zaheer Khan

ఇవి కూడా చూడండి

Ganguly vs Virat Kohli:  కెప్టెన్సీ నుంచి కోహ్లిని నేను తప్పించలేదు, మరోసారి వివరణ ఇచ్చిన  దాదా

Ganguly vs Virat Kohli: కెప్టెన్సీ నుంచి కోహ్లిని నేను తప్పించలేదు, మరోసారి వివరణ ఇచ్చిన దాదా

Smriti Mandhana: మరో నాలుగు రోజుల్లో వేలం, స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

Smriti Mandhana: మరో నాలుగు రోజుల్లో వేలం, స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

IND vs AUS: టీమిండియా క్రికెట్‌ ఇంతే, ఇంకెంత కాలం ఇలా?

IND vs AUS: టీమిండియా క్రికెట్‌ ఇంతే, ఇంకెంత కాలం ఇలా?

PV Sindhu: ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, రిలేషన్ షిప్ పై పీవీ సింధు రియాక్షన్!

PV Sindhu: ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, రిలేషన్ షిప్ పై పీవీ సింధు రియాక్షన్!

BCCI Secretary Jay Shah: జైషాకు అరుదైన గౌరవం , క్రీడల్లో ఇప్పటివరకూ ఎవరికీ దక్కని అవార్డు

BCCI Secretary Jay Shah: జైషాకు అరుదైన గౌరవం , క్రీడల్లో ఇప్పటివరకూ ఎవరికీ దక్కని అవార్డు

టాప్ స్టోరీస్

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
×