అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ind vs NZ 2nd T20 Live: 17.2 ఓవర్లలో మ్యాచ్ ముగించిన భారత్, ఏడు వికెట్లతో విజయం

భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

LIVE

Key Events
Ind vs NZ 2nd T20 Live: 17.2 ఓవర్లలో మ్యాచ్ ముగించిన భారత్, ఏడు వికెట్లతో విజయం

Background

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయం అందుకున్న టీమిండియా రెండో టీ20కి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. రోహిత్ సేనను ఓడించి 1-1తో ఆశలు నిలుపుకోవాలని కివీస్‌ అనుకుంటోంది.

అస్సలు గ్యాప్ లేదు
ఈ సిరీసుకు సన్నద్ధం అయ్యేందుకు టీమ్‌ఇండియాకు కొంత సమయం దొరికింది. ముందుగానే దుబాయ్‌ నుంచి వచ్చి కాస్త విశ్రాంతి తీసుకుంది. కుర్రాళ్లు, సీనియర్లు తాజాగా కనిపించారు. కెప్టెన్‌గా రోహిత్‌, కోచ్‌గా ద్రవిడ్‌ తమ ప్రస్థానం ఆరంభించడంతో కుర్రాళ్లు ఉత్సాహంగా కనిపించారు. గెలుపోటములను పక్కనపెట్టి భయం లేకుండా క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నించారు. కివీస్‌ మాత్రం అలసటతో కనిపించింది. గత ఆదివారం ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడి విరామమే లేకుండా టీమ్‌ఇండియాతో తొలి టీ20 ఆడింది.

టీమ్‌ఇండియా బలాలు
రోహిత్‌ ఓపెనింగ్‌ మెరుపులు.
సూర్యకుమార్‌ ఫామ్‌లోకి రావడం.
పంత్‌ పరిణతితో ఆడటం.
భువీ బంతిని స్వింగ్‌ చేస్తూ వికెట్లు తీయగలగడం.
అశ్విన్‌, అక్షర్ జోడీ బంతితో మాయ చేయడం.
వెంకటేశ్‌ అయ్యర్‌ రాకతో ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ దొరకడం

టీమ్‌ఇండియా బలహీనతలు
మంచు కురిస్తే మెరుగ్గా బౌలింగ్‌ చేయకపోవడం.
దీపక్‌ చాహర్‌, సిరాజ్‌ పరుగులు ఇవ్వడం.
వెంకటేశ్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ చేయకపోవడం.
కివీస్‌ బౌలర్లకు భారత బ్యాటర్ల బలహీనతలు తెలియడం.

పట్టుదలగా కివీస్‌
న్యూజిలాండ్‌ జట్టులో మార్టిన్‌ గుప్టిల్‌ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. విలియమ్సన్‌ స్థానంలో వచ్చిన చాప్‌మన్‌ రాణించాడు. అయితే మిడిలార్డర్‌లో కొంత తడబాటు కనిపించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ ఈ మ్యాచులో అదరగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. రచిన్‌ రవీంద్ర, జిమ్మీ నీషమ్‌ బ్యాటు ఝుళిపించాల్సిన అవసరం ఉంది. కివీస్‌ పేసర్లు తెలివిగా బంతులేస్తారు. ఇక్కడి పిచ్‌లు, భారత బ్యాటర్ల గురించి సౌథీ, బౌల్ట్‌కు బాగా తెలియడం అనకూల అంశం. టాడ్‌ ఆస్ట్లే ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఏదేమైనా రాంచీలో టాస్‌ కీలకం కానుంది.

మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ (62: 40 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని దక్కించుకుంది. 

న్యూజిలాండ్ తరఫున మార్క్ చాప్‌మన్ (63: 50 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (70: 42 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మంచి ఇన్నింగ్స్ ఆడారు.

22:51 PM (IST)  •  19 Nov 2021

17.2 ఓవర్లలో మ్యాచ్ ముగించిన భారత్, ఏడు వికెట్లతో విజయం

జిమ్మీ నీషం వేసిన ఈ ఓవర్ మొదటి రెండు బంతుల్లోనే రెండు సిక్సర్లతో పంత్ మ్యాచ్ ముగించాడు. ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది.
రిషబ్ పంత్ 12(6)
వెంకటేష్ అయ్యర్ 12(11)
జిమ్మీ నీషం 0.2-0-12-0

22:48 PM (IST)  •  19 Nov 2021

17 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 143-3, లక్ష్యం 154 పరుగులు

ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. భారత్ విజయానికి 18 బంతుల్లో 11 పరుగులు కావాలి.
రిషబ్ పంత్ 0(4)
వెంకటేష్ అయ్యర్ 12(11)
ట్రెంట్ బౌల్ట్ 4-0-36-0

22:43 PM (IST)  •  19 Nov 2021

16 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 137-3, లక్ష్యం 154 పరుగులు

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యారు. భారత్ విజయానికి 24 బంతుల్లో 17 పరుగులు కావాలి.
రిషబ్ పంత్ 0(0)
వెంకటేష్ అయ్యర్ 7(9)
టిమ్ సౌతీ 4-0-16-3
రోహిత్ శర్మ (సి) గుప్టిల్ (బి) సౌతీ (55: 36 బంతుల్లో, ఒక ఫోర్, ఐదు సిక్సర్లు)
సూర్యకుమార్ యాదవ్ (బి) సౌతీ (1: 2 బంతుల్లో)

22:36 PM (IST)  •  19 Nov 2021

15 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 134-1, లక్ష్యం 154 పరుగులు

ఆడం మిల్నే వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ అర్థ సెంచరీ పూర్తయింది. భారత్ విజయానికి 30 బంతుల్లో 20 పరుగులు కావాలి.
రోహిత్ శర్మ 55(35)
వెంకటేష్ అయ్యర్ 5(6)
ఆడం మిల్నే 3-0-39-0

22:31 PM (IST)  •  19 Nov 2021

14 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 122-1, లక్ష్యం 154 పరుగులు

టిమ్ సౌతీ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. రెండో బంతికి కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. భారత్ విజయానికి 36 బంతుల్లో 32 పరుగులు కావాలి.
రోహిత్ శర్మ 48(33)
వెంకటేష్ అయ్యర్ 0(2)
టిమ్ సౌతీ 3-0-13-1
కేఎల్ రాహుల్ (సి) గ్లెన్ ఫిలిప్స్ (బి) సౌతీ (65: 49 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!Memers Celebrating Team India Bowlers | Aus vs Ind First Test లో బౌలర్ల దెబ్బ అదుర్స్ కదూ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురి మృతితో తీవ్ర విషాదం
Embed widget