టీమ్‌ఇండియాకు కివీస్‌ దీటుగానే బదులిస్తోంది. కాన్పూరు టెస్టులో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. మూడో రోజు, శనివారం భోజన విరామానికి 2 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. ఓపెనర్‌ టామ్ లేథమ్‌ (82 బ్యాటింగ్‌; 239 బంతుల్లో 10x4) శతకం వైపు సాగిపోతున్నాడు. ప్రస్తుతం అజింక్య సేన కన్నా కివీస్‌ 148 పరుగులే వెనకబడి ఉంది.


ఓవర్‌నైట్‌ స్కోరు 129/0తో కివీస్‌ మూడోరోజు ఆట ఆరంభించింది. సమయోచితంగా ఆడుతున్న ఓపెనర్‌ విల్‌యంగ్‌ (89; 214 బంతుల్లో 15x4) శతకం వైపు నెమ్మదిగా సాగిపోయాడు. కీలక సమయంలో అతడిని అశ్విన్‌ పెవిలియన్‌ పంపించాడు. 151 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరిదించాడు. ఆ తర్వాత కేన్‌ విలియమ్సన్‌ (18; 64 బంతుల్లో 2x4) అండతో టామ్‌ లేథమ్ ఇన్నింగ్స్‌ నడిపించాడు. టీమ్‌ఇండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. రెండో వికెట్‌కు 117 బంతుల్లో 46 పరుగుల భాగస్వామ్యం అందించాడు.


వికెట్‌  కోసం ఎదురు చూసుకున్న టీమ్‌ఇండియాకు ఉమేశ్‌ యాదవ్‌ బ్రేకిచ్చాడు. 85.3వ బంతికి కివీస్ సారథి కేన్‌ విలియమ్సన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అప్పటికి స్కోరు 197/2. వెంటనే అంపైర్లు భోజన విరామం ప్రకటించారు. ఈ రోజు భారత బౌలర్లు వికెట్లు తీయకపోతే మ్యాచులు గెలుపు కష్టం అవుతుంది.






Also Read: Bhuvneshwar Kumar Became Father: భువీకి ఆడపిల్ల.. ఈ సంవత్సరం భారత పేసర్‌కు మొదటి గుడ్‌న్యూస్!


Also Read: Ind-Pak 2021 WC: రికార్డు బద్దలు కొట్టిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్.. ఎంతమంది చూశారంటే?


Also Read: 83 Teaser: ‘83’ మూవీ టీజర్.. వచ్చేస్తోంది వరల్డ్ కప్ హిస్టరీ.. హిట్ పక్కా!


Also Read: IPL 2022 Auction: ముంబయి ఇండియన్స్‌ తీసుకుంటానన్నా.. నో.. నో అంటున్న స్టార్‌ ప్లేయర్‌


Also Read: Ind vs NZ, 1st Test Match Highlights: ఇదేంది సామీ..! ఒక్క వికెట్టైనా తీయలేదు.. కివీస్‌ 129/0


Also Read: Shreyas Iyer: నాలుగేళ్లుగా డీపీ మార్చని శ్రేయస్‌ తండ్రి..! కొడుకు సెంచరీకీ దానికీ లింకేంటి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి