News
News
X

Virat Kohli: ఇండోర్‌లో 77 పరుగులు చేస్తే చాలు - విరాట్ ఖాతాలో మరో రికార్డు!

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టులో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డు సాధించే అవకాశం ఉంది.

FOLLOW US: 
Share:

IND vs AUS, Virat Kohli: ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మార్చి 1వ తేదీ నుంచి ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా 2-0తో ముందంజలో ఉంది. ఒకవైపు మూడో టెస్టులో గెలిచి భారత జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించాలని భావిస్తుంది.

కంగారూ జట్టు మాత్రం ఎదురుదాడి చేయాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లికి ప్రత్యేక రికార్డు సృష్టించే అవకాశం దక్కనుంది. ఈ రికార్డు సాధించాలంటే కేవలం 77 పరుగులు మాత్రం చేస్తే సరిపోతుంది.

77 పరుగులు చేసిన వెంటనే విరాట్ భారీ రికార్డు
భారత్‌లో టెస్టు ఆడుతూ 4000 పరుగులు పూర్తి చేసే గోల్డెన్ ఛాన్స్ విరాట్ కోహ్లీకి ఉంది. ఇండోర్ టెస్టులో ఈ రికార్డు చేరుకునే అవకాశం ఉంది.  విరాట్ కోహ్లీ భారత్‌లో ఇప్పటి వరకు 48 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అతను 74 ఇన్నింగ్స్‌లలో 59.43 సగటుతో 3923 పరుగులు చేశాడు. భారత్‌లో టెస్టు ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 13 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు సాధించాడు.

సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఈ సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉండటం గమనార్హం. మరోవైపు మూడో మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే మరోసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంటుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరనున్న భారత్‌
ఇండోర్‌లో జరిగే మూడో టెస్టులో భారత జట్టు విజయాన్ని నమోదు చేస్తే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో చోటు దక్కించుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 64.06 విజయాల శాతంతో టీమిండియా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియా 66.67 విజయాల శాతంతో నంబర్‌వన్‌లో ఉంది.

మరో వైపు రెండో టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ పడ్డ విధానం గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ మాథ్యూ కునెమన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ తన వికెట్ కోల్పోయాడు. ఎల్బీడబ్ల్యూ అయిన తర్వాత విరాట్ కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. అయితే బంతి విరాట్ కోహ్లీ బ్యాట్, ప్యాడ్ రెండింటినీ ఒకేసారి తాకినట్లు అల్ట్రా ఎడ్జ్‌లో కనిపించింది. దీని తర్వాత కూడా విరాట్‌ను అవుట్ అని థర్డ్ అంపైర్ ప్రకటించారు. అవుటైన తర్వాత కోహ్లీ చాలా అసంతృప్తిగా ఉన్నాడు.కోహ్లీ ఇలా ఎల్‌బీడబ్ల్యూ అవడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా అతనికి రెండు సార్లు ఇలాగే జరిగింది. వీటిలో మొదటి సంఘటన 2021లో జరిగింది. న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా విరాట్ కోహ్లి ఇలాగే ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అప్పుడు కూడా విరాట్ కోహ్లీ అవుట్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు.

దీని తరువాత 2022లో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆడుతున్నప్పుడు, విరాట్ కోహ్లిని ఇదే పద్ధతిలో అవుట్ చేశారు. అప్పుడు కూడా బంతి అతని బ్యాట్, ప్యాడ్‌కు తగిలింది. విరాట్ కోహ్లిని మూడు సార్లూ అంపైర్ అవుట్ అయినట్లు ప్రకటించాడు.

Published at : 27 Feb 2023 09:50 PM (IST) Tags: Ind vs Aus VIRAT KOHLI IND vs AUS 3rd test Virat Kohli Record

సంబంధిత కథనాలు

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

టాప్ స్టోరీస్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!