అన్వేషించండి

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 21 పరుగులతో పరాజయం పాలైంది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ (54: 72 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. 2019 తర్వాత భారత్ స్వదేశంలో సిరీస్ కోల్పోయింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియానే భారత్‌ను ఓడించింది.

కోహ్లీ అర్థ సెంచరీ చేసినా...
ఓ మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (37: 49 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), రోహిత్ శర్మ (30: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 9.1 ఓవర్లలోనే 65 పరుగులు జోడించారు. రోహిత్ అయితే బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. రోహిత్ శర్మను అవుట్ చేసి సీన్ అబాట్ ఆస్ట్రేలియాకు మొదటి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే శుభ్‌మన్ గిల్ కూడా ఆడం జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో భారత్ 77 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

అనంతరం విరాట్ కోహ్లీ (54: 72 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), కేఎల్ రాహుల్ (32: 50 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. బౌండరీల కోసం ప్రయత్నించకుండా సింగిల్స్‌తో స్కోరును ముందుకు నడిపించారు. వీరు మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించారు.

అయితే కేఎల్ రాహుల్‌ను అవుట్ చేసి జంపా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అనంతరం అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపి చేసిన ప్రయోగం ఫలించలేదు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో వరుసగా మూడో సారి మొదటి బంతికే అవుట్ అయి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతకు ముందు బంతికే విరాట్ కోహ్లీ కూడా అవుట్ కావడంతో భారత్ 185 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

అనంతరం రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. వీరు ఏడో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. అయితే ఒత్తిడిని తట్టుకోలేక వీరిద్దరూ కూడా భారీ షాట్లకు ప్రయత్నించి అవుటయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారు త్వరగా అవుట్ కావడంతో భారత్ 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది.

సమష్టిగా రాణించిన ఆసీస్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (33: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), మిషెల్ మార్ష్ (47: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరు మొదటి వికెట్‌కు 10.5 ఓవర్లలోనే 68 పరుగులు జోడించారు. ఈ దశలో ఆస్ట్రేలియాను హార్దిక్ పాండ్యా దెబ్బ తీశాడు. ట్రావిస్ హెడ్ వికెట్‌ను తీసి భారత్‌కు మొదటి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం తన వరుస ఓవర్లలో మరో ఓపెనర్ మిషెల్ మార్ష్, వన్ డౌన్ బ్యాటర్, కెప్టెన్ అయిన స్టీవ్ స్మిత్‌లను (0: 3 బంతుల్లో) కూడా వెనక్కి పంపాడు. దీంతో ఆస్ట్రేలియా  14.3 ఓవర్లలోనే 85 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరు నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. క్రమంగా ఇద్దరూ క్రీజులో కుదురుకుంటున్న దశలో ఈసారి కుల్‌దీప్ యాదవ్ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు. డీప్ మిడ్ వికెట్ వైపు లాఫ్టెడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ లాంగాఫ్‌లో హార్దిక్ పాండ్యా చేతికి చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా 25 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్నస్ లబుషేన్ (20 నాటౌట్: 35 బంతుల్లో, ఒక సిక్సర్), అలెక్స్ కారీ (1 నాటౌట్: 3 బంతుల్లో) ఉన్నారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యాకు మూడు, కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి.

టాప్ హెడ్ లైన్స్

TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
 Team India Management Confusion: సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget