Ranji Trophy: రంజీ ట్రోఫీలో చరిత్ర - మొదటిసారి మహిళా అంపైర్లు!
రంజీ ట్రోఫీలో మొదటి సారి మహిళా అంపైర్లు విధులు నిర్వర్తించారు.
Ranji Trophy: జనవరి 10వ తేదీన రంజీ ట్రోఫీలో కొత్త చరిత్ర నమోదైంది. ఈ ట్రోఫీలో తొలిసారిగా మహిళా అంపైర్లు అరంగేట్రం చేశారు. ఇందులో మాజీ స్కోరర్ బృందా రాఠీ, మాజీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జననీ నారాయణ్, మాజీ ప్లేయర్ గాయత్రి వేణుగోపాలన్ రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారిగా మహిళా అంపైర్లుగా కనిపించారు.
సూరత్‌లో రైల్వేస్, త్రిపుర జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జననీ నారాయణ్ అంపైరింగ్ చేస్తున్నారు. జంషెడ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వేణుగోపాలన్ అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోవా, పాండిచ్చేరి మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బృందా రాఠీ అంపైరింగ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇంజినీరింగ్ వదిలేసిన జననీ నారాయణ్
నారాయణ్ జనని వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. క్రికెట్‌పై ఎప్పుడూ ఆసక్తి కనబరిచేవారు. ఆమె ఎప్పుడూ అంపైరింగ్‌కి వెళ్లాలని కోరుకునేవారు. దీని కోసం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌తో మాట్లాడారు. అప్పుడు TNCA తన నిబంధనలను మార్చిన తర్వాత జననీని అంపైరింగ్ చేయడానికి అనుమతించింది. 2018లో రెండు BCCI స్థాయి అంపైరింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత ఆమె తన ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని వదిలి అంపైరింగ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు.
బృందా రాఠీ ఇలా
గతంలో బృందా రాఠీ ముంబై స్థానిక మ్యాచ్‌లలో స్కోర్ చేసేవారు. దీని తర్వాత అంపైరింగ్‌లో కెరీర్‌ను సంపాదించాలని కలలు కన్నారు. అనంతరం బీసీసీఐ స్కోరర్ టెస్టులో రాఠీ ఉత్తీర్థత సాధించారు. దీని తరువాత ఆమె 2013 మహిళల ప్రపంచ కప్‌లో BCCI తరపున స్కోరర్‌గా వ్యవహరించారు.
క్రికెటర్ కావాలని కల కని
43 సంవత్సరాల వయసున్న గాయత్రీ వేణుగోపాలన్ ఎప్పుడూ క్రికెటర్ కావాలని కోరుకున్నారు. కానీ భుజం గాయం ఆమె కలను నెరవేర్చలేకపోయింది. దీని తర్వాత కూడా క్రికెట్‌పై ఆమెకి ఉన్న ప్రేమ అంతం కాకపోవడంతో అంపైరింగ్ వైపు తన బలాన్ని పెంచుకున్నారు. వేణుగోపాలన్ 2019లో BCCI అంపైరింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తన కెరీర్‌ను ప్రారంభించారు.
Women umpires Rathi, Narayanan, Venugopalan make Ranji Trophy debut pic.twitter.com/EXOZrIZMkA
— sports news (@CricketDeDaNaDa) January 10, 2023
View this post on Instagram