News
News
X

DCW Vs MIW: ఢిల్లీకి ఇ‘షాక్’ - టోర్నీలో మొదటిసారి తడబడ్డ క్యాపిటల్స్ బ్యాటింగ్!

ముంబై ఇండియన్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 18 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది.

FOLLOW US: 
Share:

Delhi Capitals Women vs Mumbai Indians Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి సారి తడబడింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తూ 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్, ఓపెనర్ మెగ్ లానింగ్ (43: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ముంబై విజయానికి 120 బంతుల్లో 106 పరుగులు చేస్తే సరిపోతుంది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ కీలకమైన మూడు వికెట్లు (మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్) తీసి సత్తా చాటింది.

మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి సారి తడబడింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తూ 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్, ఓపెనర్ మెగ్ లానింగ్ (43: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు) ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ముంబై విజయానికి 120 బంతుల్లో 106 పరుగులు చేస్తే సరిపోతుంది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ కీలకమైన మూడు వికెట్లు (మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్) తీసి సత్తా చాటింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్లోనే ఢిల్లీకి ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ షెఫాలీ వర్మ (2: 6 బంతుల్లో) సైకా ఇషాక్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత వచ్చిన అలీస్ క్యాప్సే (6: 7 బంతుల్లో), మారిజానే క్యాప్ (2: 4 బంతుల్లో) విఫలం అయ్యారు. దీంతో 31 పరుగులకే ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (25: 18 బంతుల్లో, మూడు ఫోర్లు), ఓపెనర్ మెగ్ లానింగ్‌తో (43: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుట పరిచింది. వీరిద్దరూ బౌండరీలతో స్కోరు వేగాన్ని కూడా పెంచారు. మెగ్ లానింగ్ మొదట నిదానంగా ఆడినా క్రమంగా తను కూడా జోరు పెంచింది. అయితే సైకా ఇషాక్ ఢిల్లీకి మరోసారి షాక్ ఇచ్చింది. క్రీజులో కుదురుకున్న జెమీమా రోడ్రిగ్స్, మెగ్ లానింగ్ ఇద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేసింది.

ఆ తర్వాతి ఓవర్లోనే జొనాసెన్ (2: 3 బంతుల్లో), మిన్ను మణిలను (0: 3 బంతుల్లో) హేలీ మాథ్యూస్ అవుట్ చేసింది. దీంతో ఢిల్లీ 84 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన వారు కూడా త్వరగానే అవుట్ అయిపోయారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 18 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది.

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళలు (ప్లేయింగ్ XI)
మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజాన్ కాప్, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), మిన్ను మణి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్

ముంబై ఇండియన్స్ మహిళలు (ప్లేయింగ్ XI)
హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా (వికెట్ కీపర్), నాట్ స్కీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్

Published at : 09 Mar 2023 09:07 PM (IST) Tags: Harmanpreet Kaur WPL 2023 Delhi Capitals Women vs Mumbai Indians Women DCW Vs MIW

సంబంధిత కథనాలు

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023 Slogans: ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ స్లోగన్, దాని అర్థం మీకు తెలుసా?

IPL 2023 Slogans: ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ స్లోగన్, దాని అర్థం మీకు తెలుసా?

Sanju Samson: సంజు శామ్సన్ ఎదురు చూపులకు సరైన ఫలితం - ఏకంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో!

Sanju Samson: సంజు శామ్సన్ ఎదురు చూపులకు సరైన ఫలితం - ఏకంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!