CWG 2022: ట్రిపుల్ జంప్‌లో ఇండియాకే స్వర్ణం, రతజం! అథ్లెటిక్స్‌లో మరో 2 మెడల్స్
CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మరో నాలుగు పతకాలు వచ్చాయి. ఇవన్నీ అథ్లెటిక్స్ విభాగంలోనే రావడం విశేషం. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఎల్డోస్ పాల్ స్వర్ణం ముద్దాడాడు.

CWG 2022: బర్మింగ్‌హామ్‌లో భారత్‌కు మరో నాలుగు పతకాలు వచ్చాయి. ఇవన్నీ అథ్లెటిక్స్ విభాగంలోనే రావడం విశేషం. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఎల్డోస్ పాల్ స్వర్ణం ముద్దాడాడు. అబ్దుల్లా అబూబాకర్ రజతం కైవసం చేసుకున్నాడు. 10 కిలో మీటర్ల నడకలో సందీప్ కుమార్ కాంస్యం కొల్లగొట్టాడు. మహిళల జావెలిన్ త్రోలో అన్నూ రాణి కంచు మోగించింది.
చరిత్రలో తొలిసారి
ట్రిపుల్ జంప్‌లో ఎల్డోస్ పాల్ నవ చరిత్రను ఆవిష్కరించాడు. కామన్వెల్త్ ట్రిపుల్ జంప్‌లో స్వర్ణం ముద్దాడిన తొలి భారతీయుడిగా అవతరించాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా 17.03 మీటర్లు గెంతి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అతడి సహచరుడు అబూ బాకర్ 17.02 మీటర్లు దూకి వెండి పతకం సొంతం చేసుకున్నాడు. ఐదు రౌండ్లు ముగిశాక ఇద్దరు భారతీయులు 1, 2 స్థానాల్లో నిలవడం గమనార్హం. మరో ఆటగాడు ప్రవీణ్ చిత్రావల్ నాలుగో స్థానంతో ముగించాడు.
WHAT A W🤩W JUMP!!🔥#EldhosePaul creates history by winning 🇮🇳's 1st ever GOLD in Men's Triple Jump at #CommonwealthGames 🤩
— SAI Media (@Media_SAI) August 7, 2022
With the best effort of 17.03m he leaves everyone in awe of his stunning jump 😍😍#Cheer4India#India4CWG2022
1/1 pic.twitter.com/TN5bD57AUf
తొలి ట్రిపుల్ జంపర్
కామన్వెల్త్ క్రీడల్లో 17 మీటర్లకు పైగా దూకిన తొలి ట్రిపుల్ జంపర్ పాల్ కావడం విశేషం. మూడో ప్రయత్నంలో అతడీ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు యూజినీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో 16.79 మీటర్లతో సంచలనం సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఐదుగురు మాత్రమే అర్హత సాధించగా అందులో ఫైనల్‌కు చేరింది పాల్ ఒక్కడే.
WHAT A BRILLIANT EFFORT!!
— SAI Media (@Media_SAI) August 7, 2022
Abdulla Aboobacker made a solid jump to win silver🥈at the #CommonwealthGames2022 🤟
He is only the 3️⃣rd Indian to breach the 17m mark and now he recorded a jump of 17.02🤩
Absolutely Stunning! #Cheer4India#India4CWG2022 pic.twitter.com/4t0fE1LGil
అన్నూ రాణి.. ఎన్నాళ్లకో!
జావెలిన్ త్రోలో అన్నూ రాణి సరికొత్త చరిత్ర లిఖించింది. కామన్వెల్త్ జావెలిన్ క్రీడలో పతకం ముద్దాడిన తొలి భారతీయురాలిగా నిలిచింది. పోటీలో జావెలిన్‌ను 60 మీటర్లు విసిరి కాంస్యం అందుకుంది. కొన్నేళ్లుగా అనేక అంతర్జాతీయ క్రీడల్లో పతకం కోసం ఆమె శ్రమిస్తూనే ఉంది. ఇన్నాళ్లకు కల నెరవేరింది.
ANNU WINS BRONZE 🥉@Annu_Javelin scripts history by becoming the 1️⃣st Indian female Javelin Thrower to win a medal at #CommonwealthGames
— SAI Media (@Media_SAI) August 7, 2022
The gutsy javelin thrower has proved her mettle & won a Bronze 🥉with the best throw of 60m at #B2022
Well Done Champ!!👍🏻#Cheer4India🇮🇳 pic.twitter.com/zmGneoJQze
నడక.. ఆహా!
సుదూర నడక (రేస్ వాక్)లో ఇండియాకు మరో పతకం రావడం అభిమానులను సంతోష పెట్టింది. టోక్యో ఒలింపియన్ సందీప్ 10,000 మీటర్ల నడకలో కాంస్యం ముద్దాడాడు. 38:49.21 నిమిషాల్లో రేసు ముగించి పర్సనల్ బెస్ట్ సాధించాడు. ఇదే పోటీలో 18 ఏళ్ల అమిత్ ఖత్రి 43:04.47 నిమిషాల్లో రేసు పూర్తి చేసి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. అరంగేట్రం క్రీడల్లోనే సీజనల్ బెస్ట్ అందుకొని ఆశలు రేపాడు.
SANDEEP HAS DONE IT!!! 🔥🔥#Tokyo2020 Olympian @OlySKP clocks 38:49.21 (PB) to win a Bronze 🥉in Men's 10,000m Race Walk at #CommonwealthGames2022 💪
— SAI Media (@Media_SAI) August 7, 2022
Sandeep showcased great resilience & hard work to give us a walk to remember! 🤟
Many congratulations Champ!!#Cheer4India pic.twitter.com/riPaKV3fXi
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

