అన్వేషించండి

Rahul Dravid: వారి గురించి ఇప్పుడే మాట్లాడలేం - సెమీఫైనల్ అనంతరం రాహుల్ ద్రవిడ్!

సీనియర్ ఆటగాళ్ల భవితవ్యం గురించి ఈ వేదికపై మాట్లాడలేమని సెమీ ఫైనల్ అనంతరం మాట్లాడుతూ రాహుల్ ద్రవిడ్ అన్నారు.

గురువారం అడిలైడ్ ఓవల్‌లో జరిగిన రెండో సెమీఫైనల్‌లోఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో రోహిత్ శర్మ నేతృత్వంలోని  టీమ్ ఇండియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడారు. సీనియర్ ఆటగాళ్ల భవితవ్యం గురించి మాట్లాడటానికి ఇది సరైన వేదిక కాదని తెలిపారు.

'సెమీస్‌లో మా ప్రదర్శన నిరాశపరిచింది. ఫైనల్‌కు వెళ్లాలని అనుకున్నా. ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో మెరుగైన జట్టుగా నిలిచారు.మొత్తమ్మీద, మేం చాలా మంచి క్రికెట్ ఆడాం. మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మేం కొన్ని విషయాల్లో మెరుగుపడ్డాం. తదుపరి ప్రపంచ కప్ కోసం ఇవి ఉపయోగపడతాయి. మేం టోర్నమెంట్‌లో బాగా బ్యాటింగ్ చేశాం. ఆట ప్రారంభమైనప్పుడు, వికెట్ నెమ్మదిగా ఉందని జట్టు సభ్యులు చెప్పారు. చివరి ఓవర్లు బాగా సాగాయి. మేము 180 నుంచి 185 పరుగులు సాధించగలిగి ఉండాల్సింది.' అని భారత మాజీ కెప్టెన్ చెప్పాడు.

గురువారం అడిలైడ్‌ వేదికగా జరిగిన సెమీఫైనల్లో భారత్‌ ఓటమి చవిచూసింది. 169 పరుగులను డిఫెండ్‌ చేసుకోలేక తెల్లముఖం వేసింది. కనీసం ఒక్క వికెట్టైనా పడగొట్టలేక అవమానం మూటగట్టుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (80 నాటౌట్; 49 బంతుల్లో 9x4, 3x6), అలెక్స్ హేల్స్‌ (86 నాటౌట్; 47 బంతుల్లో 4x4, 7x6) టీమ్‌ఇండియా బౌలింగ్‌ను చితకబాదేశారు. అంతకు ముందు విరాట్‌ కోహ్లీ (50; 40 బంతుల్లో 4x4, 1x6), హార్దిక్‌ పాండ్యా (63; 33 బంతుల్లో 4x4, 5x6) రాణించారు.

ఛేదనకు దిగిన ఆంగ్లేయులను అడ్డుకోవడంలో టీమ్‌ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. పిచ్‌ కండిషన్‌ను అర్థం చేసుకోకుండా వేగంగా బంతులు విసిరారు. దాంతో అలెక్స్‌ హేల్స్‌, జోస్‌ బట్లర్‌ పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకున్నారు. స్వింగ్‌ లభించకపోవడంతో భువనేశ్వర్‌ను బట్లర్‌ టార్గెట్‌ చేసుకున్నాడు. అర్షదీప్‌ సైతం ప్రభావం చూపలేదు. మహ్మద్‌ షమి సైతం ఎక్కువ రన్స్‌ ఇచ్చాడు. దాంతో 6 ఓవర్లకు ఇంగ్లాండ్‌ 63 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ సైతం ఎఫెక్టివ్‌గా లేకపోవడంతో వారికి అడ్డేలేకుండా పోయింది. హేల్స్‌ 28, బట్లర్‌ 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు అందుకోవడంతో 10.1 ఓవర్లకే ఇంగ్లాండ్‌ స్కోరు 100 దాటేసింది.  ఆ తర్వాత వారిద్దరూ మరింత జోరు పెంచడంతో 83 బంతుల్లోనే 150కి చేరుకుంది. 16 ఓవర్లకే విజయం అందుకుంది.

అడిలైడ్‌లో రాత్రంతా వర్షం. కవర్ల కిందే పిచ్‌. ఔట్‌ ఫీల్డ్‌పై తేమ. ఆకాశంలో మబ్బులు! ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో టీమ్‌ఇండియా మొదట బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. టాస్‌ గెలవడంతో జోస్‌ బట్లర్‌ బౌలింగ్‌ తీసుకొని భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. జట్టు స్కోరు 9 వద్దే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (5) క్రిస్‌ వోక్స్‌ ఔట్‌ చేశాడు. అదనపు బౌన్స్‌తో వచ్చిన బంతిని ఆడబోయి జోస్‌ బట్లర్‌కు కేఎల్‌ క్యాచ్‌ ఇచ్చాడు.

ఆంగ్లేయులు కఠినంగా బౌలింగ్‌ చేస్తుండటంతో కోహ్లీ, రోహిత్ నిలకడగా ఆడారు. రెండో వికెట్‌కు 47 రన్స్‌ భాగస్వామ్యం అందించడంతో 7.5 ఓవర్లకు స్కోరు 50కి చేరుకుంది. వేగం పెంచే క్రమంలో రోహిత్‌ 8.5వ బంతికి ఔటయ్యాడు. సూర్యకుమార్‌ (14) త్వరగానే పెవిలియన్‌ చేరడంతో హార్దిక్‌ పాండ్య క్రీజులోకి వచ్చాడు. 39 బంతుల్లో 50 చేసిన కోహ్లీకి అండగా నిలిచాడు. నాలుగో వికెట్ కు 40 బంతుల్లో 61 పరుగుల భాగస్వామ్యం నెకలొల్పాడు. మొదట్లో ఒకట్రెండు బంతుల్ని నిలకడగా ఆడిన పాండ్య డెత్‌ ఓవర్లలో వరుస సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. జట్టు స్కోరును 168/6కి చేర్చాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Somu Veerraju: జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్ నాకు సన్నిహితుడు కాదు, వైసీపీ అధినేతతో స్నేహంపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Nara Lokesh: రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు: మంత్రి నారా లోకేష్
Kannada Actress Ranya Rao: కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
కోర్టులో బోరున విలపించిన రన్యా రావు... బంగారం స్మగ్లింగ్ కేసులో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ICC Champions Trophy: ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ ఇండియ‌న్ కే ఇవ్వాల్సింది.. నేనేతై అలాగే చేసేవాడిని: అశ్విన్
ప్లేయ‌ర్ ఆఫ్ ద టోర్నీ ఇండియ‌న్ కే ఇవ్వాల్సింది.. నేనేతై అలాగే చేసేవాడిని: అశ్విన్
Weight Loss Meal Plan : పోషకాలతో కూడిన హెల్తీ డైట్​ ప్లాన్.. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఇది
పోషకాలతో కూడిన హెల్తీ డైట్​ ప్లాన్.. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఇది
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Telugu TV Movies Today: చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Embed widget