Ishan Kishan: పంత్ బ్యాట్‌తో ఇషాన్ దూకుడు - అతడి వల్లే ఇది సాధ్యమైందన్న కీపర్
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ వెస్టిండీస్‌తో రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో 33 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు.
IND vs WI: భారత్ - వెస్టిండీస్ మద్య పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భాగంగా నాలుగో రోజు భారత బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి తన స్థానాన్ని త్యాగం చేసి మరీ యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను ముందుకు పంపాడు. టీమ్ మేనేజ్‌మెంట్ తనపై పెట్టిన నమ్మకాన్ని ఇషాన్ వమ్ము చేయలేదు. 33 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆట ముగిసిన తర్వాత కిషన్ మాట్లాడుతూ.. పంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పంత్ సూచనలు పనిచేశాయి..
రెండో ఇన్నింగ్స్‌లో కిషన్ పట్టుకున్న బ్యాట్‌పై ఆర్పీ 17 అని ఉంది. దీంతో అది రిషభ్ పంత్ బ్యాటేనని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆట ముగిశాక కిషన్ మాట్లాడుతూ.. ‘నేను గత నెలలో ఎన్సీఏలో ఉన్నాను. రిషభ్ కూడా అక్కడే ఉన్నాడు. ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేశాం. ఈ క్రమంలో రిషభ్.. బ్యాటింగ్, స్టాన్స్, బ్యాట్ పొజిషన్, తదితర అంశాలలో కొన్ని సూచనలు చేశాడు. అలాగే టీమ్‌లో కొంతమంది సీనియర్లు కూడా దీనిపై సూచనలు చేశారు..’ అని తెలిపాడు. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్‌లు అండర్ - 19 నుంచే మిత్రులన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
విరాట్ భయ్యే వెళ్లమన్నాడు..
నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్ స్థానంలో ముందుకురావడంపై కోహ్లీ ప్రభావం ఉందన్నాడు ఇషాన్. ‘బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు రావడం వెనుక కోహ్లీ భయ్యా ప్రభావం ఉంది. వెస్టిండీస్ టీమ్‌లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌలింగ్‌కు వస్తుండటంతో నన్ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపారు. కోహ్లీ భయ్యా స్వయంగా నా దగ్గరకు వచ్చి నన్ను ముందు బ్యాటింగ్‌కు వెళ్లాలని చెప్పాడు..’అని తెలిపాడు. వర్షం వల్ల వీలైనంత త్వరగా పరుగులు చేయాలని ముందే అనుకున్నామని.. అందుకు అనుగుణంగానే దూకుడుగా ఆడామని చెప్పుకొచ్చాడు.
Hey Rishabh Pant - Ishan Kishan thanks you 😊#TeamIndia | #WIvIND | @RishabhPant17 | @ishankishan51 | @windiescricket pic.twitter.com/hH6WxxJskz
— BCCI (@BCCI) July 24, 2023
కాగా నిన్న ఇషాన్ 33 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేయగా.. భారత్ తరఫున టెస్టులలో ఒక వికెట్ కీపర్ బ్యాటర్ అత్యంత వేగంగా అర్థ సెంచరీ సాధించిన దాన్లో ఇషాన్ రెండో స్థానంలో నిలిచాడు. రిషభ్ పంత్.. 28 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. 2006లో ధోని.. పాకిస్తాన్ మీద 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ధోని రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు. ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, 2 భారీ సిక్సర్లున్నాయి. కీమర్ రోచ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఇషాన్ అర్థ సెంచరీ పూర్తైన వెంటనే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. 365 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 76 పరుగులు చేసింది. చివరిరోజు టెస్టును కాపాడుకోవాలంటే ఆ జట్టు.. 289 పరుగులు చేయాల్సి ఉంది. భారత బౌలింగ్ దాడిని ఎదుర్కుని విండీస్ ఆ స్కోరు చేయగలదా..? లేక టీమిండియా బౌలర్లు మరోసారి విజృంభించి విండీస్‌కు షాకిస్తారా..? అన్నది నేడు తేలనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial