అన్వేషించండి

Ishan Kishan: రీఎంట్రీ మ్యాచ్‌లో ఆకట్టుకోని ఇషాన్‌

Ishan Kishan: 3 నెలల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌  రీఎంట్రీ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్‌ టీ20 టోర్నీలో ఆకట్టుకోలేకపోయాడు.

Ishan Kishan News: మూడు నెలల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌(Ishan Kishan)  రీఎంట్రీ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్‌ టీ20 టోర్నీ(DY Patil T20 Cup 2024)లో ఆకట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్‌.. రూట్‌ మొబైల్‌ లిమిటెడ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో 12 బంతులాడి 19 పరుగులే చేసి ఇషాన్‌ అవుటయ్యాడు. 12 బంతుల్లో రెండు బౌండరీలు, ఒక భారీ సిక్సర్‌ సాయంతో 19 రన్స్‌ చేసిన ఇషాన్‌.. మ్యాక్స్‌వెల్‌ స్వామినాథన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.  ఈ మ్యాచ్‌లో ఇషాన్‌కు మెరుపు అరంభమే లభించినప్పటికీ.. ఆతర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. 193 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌.. రెండు ఫోర్లు, సిక్సర్‌తో దూకుడుగా ఆడేందుకు యత్నించినా అతడు ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయిన ఇషాన్‌.. వికెట్‌కీపింగ్‌లో పర్వాలేదనిపించాడు. ఓ క్యాచ్‌తో పాటు స్టంప్‌ ఔట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో రూట్‌ మొబైల్‌ లిమిటెడ్‌ నిర్ణీత ఓవర్లలో 192 పరుగలు చేయగా... ఆర్బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.
 
దేశవాళీలో స్టార్‌ క్రికెటర్లు
ఐపీఎల్‌(IPL)లో వస్తున్న ఆదరణ, డబ్బుతో యువ క్రికెటర్లు రంజీ మ్యాచ్‌(Ranji Match)లు అంటేనే తమకేం పట్టనట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రంజీలు ఆడడానికి అయిష్టత చూపించిన ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్స్‌ అయ్యర్‌... ఐపీఎల్ ఆడేందుకు మాత్రం సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కొత్త నిబంధన తెచ్చేందుకు సిద్ధమైంది. భారత జట్టులో లేనప్పుడు ఐపీఎల్‌లో ఆడాలంటే ఆ ఆటగాడు ఆ టోర్నీ కన్నా ముందు కనీసం కొన్ని రంజీ మ్యాచ్‌లు ఆడడం తప్పనిసరని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నిబంధనతో యువ ఆటగాళ్లు.. ఐపీఎల్‌ ఆడాలంటే తప్పనిసరిగా దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ ఆడాల్సి వస్తుంది. రెండు నెలలకు పైగా ఎలాంటి క్రికెట్‌ ఆడని ఇషాన్‌, వెన్నునొప్పితో రంజీ ఆడని ఆయ్యర్‌పై బీసీసీఐ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆగ్రహంగా ఉంది. దేశవాళీ టోర్నీలను కాదని ఐపీఎల్‌ సన్నాహకాల్లో నిమగ్నమైపోయాడు. ఇషాన్‌ ప్రవర్తన చూసి అసహనం వ్యక్తం చేసిన బీసీసీఐ పెద్దలు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. 
 
దారికొచ్చిన అయ్యర్‌, కిషన్‌
బీసీసీఐ హెచ్చరికలతో శ్రేయస్‌ అయ్యర్‌, కిషన్‌ ఎట్టకేలకు దారికొచ్చారు. సెమీస్‌లో భాగంగా ముంబై.. తమిళనాడు మధ్య జరుగుతున్న  మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌.. రంజీ సెమీస్‌ ఆడనున్నట్టు తెలుస్తోంది. మార్చి మూడు నుంచి జరుగబోయే రంజీ సెమీస్‌ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని ముంబై రంజీ టీమ్‌కు సమాచారమిచ్చినట్టు తెలుస్తోంది. రంజీ సెమీఫైనల్స్‌లో సెలక్షన్‌కు అందుబాటులో ఉంటానని అయ్యర్‌ తెలిపినట్లు తెలుస్తోంది. అయ్యర్‌తో పాటు టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ కూడా స్వల్ప విరామం తర్వాత క్రికెట్‌ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. నవంబర్‌లో ఆసిస్‌తో టీ20 సిరీస్‌ ఆడిన తర్వాత కిషన్‌ మళ్లీ గ్రౌండ్‌లోకి దిగాడు. బరోడాలో హార్ధిక్‌ పాండ్యాతో కలిసి కిరణ్‌ మోరే అకాడమీలో ట్రైనింగ్‌ తీసుకున్న ఇషాన్‌.. తాజాగా డీవై పాటిల్‌ టీ20 కప్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ టోర్నీ తర్వాత ఇషాన్‌.. నేరుగా ఐపీఎల్‌ ఆడనున్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Jofra Archer Vs Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
IND VS ENG 5th T20i Preview: శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న గండం.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న ముప్పు.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
Smriti Mandhana Historic Milestone:  స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
PDS Rice Smuggling: మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
మంచిర్యాలలో యూపీ లారీ..రేషన్ మాఫియా గుట్టురట్టు! ఆదిలాబాద్‌లో డీలర్ల దందా ఛేదించిన పోలీసులు!
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
INS Mahendragiri:భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి! ఈ యుద్ధనౌక ప్రత్యేకత ఏంటి? 
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Embed widget