అన్వేషించండి

IND vs SL T20I: ముందే తెలిశాక అలా చేయడంలో తప్పేముంది - ద్రవిడ్‌!

IND vs SL T20I: శ్రీలంకతో రెండో టీ20లో తొలుత బౌలింగ్‌ చేయడాన్ని టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సమర్థించాడు. మంచు కురుస్తుందని తెలిసినప్పుడు బౌలింగ్‌ ఎంచుకోవడంలో తప్పేం లేదన్నాడు.

IND vs SL T20I:

శ్రీలంకతో రెండో టీ20లో తొలుత బౌలింగ్‌ చేయడాన్ని టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సమర్థించాడు. మంచు కురుస్తుందని తెలిసినప్పుడు బౌలింగ్‌ ఎంచుకోవడంలో  తప్పేం లేదన్నాడు. ప్రతిసారీ చరిత్రను బట్టే నిర్ణయాలను తీసుకోలేమని స్పష్టం చేశాడు. మరికొన్ని వికెట్లు ఉండుంటే కచ్చితంగా గెలిచేవాళ్లమని ధీమా వ్యక్తం చేశాడు.

'పుణెలో రెండో ఇన్నింగ్సు సమయంలో చాలా మంచు కురిసింది. ఛేదనలో త్వరగా వికెట్లు చేజార్చుకోవడం వల్లే ఓడిపోయాం. కొన్ని వికెట్లు ఉండుంటే కచ్చితంగా గెలిచేవాళ్లం. అప్పటికీ లక్ష్యాన్ని సమీపించాం. ప్రతిసారీ చరిత్రను బట్టే నిర్ణయాలు తీసుకోలేం. పిచ్‌ చాలా బాగుంది. సరైన ప్రాంతాల్లో బంతులు వస్తే ఫాస్ట్‌ బౌలర్లకు సహకరించింది. లంకేయులు చక్కగా ఆడి 206 చేశారు. మేం కొన్ని తప్పిదాలు చేశాం. మంచు కురుస్తుంటే లంక స్పిన్నర్లకు బౌలింగ్‌ కష్టమవుతుందనే ఛేదనకు దిగాం' అని ద్రవిడ్‌ వివరించాడు.

యువ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (31 బంతుల్లో 65)ను ద్రవిడ్‌ ప్రశంసించాడు. రోజురోజుకీ అతడి బ్యాటింగ్‌ మరింత మెరుగవుతోందని అభినందించాడు. 10 ఓవర్లకు 57/5తో కష్టాల్లో పడ్డ టీమ్‌ఇండియా అతడి వల్లే లక్ష్యానికి చేరువైందన్నాడు. 'అక్షర్‌ బంతితో ఏం చేయగలడో మనందరికీ తెలుసు. ఇప్పుడు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. ఏడాదికి పైగా జట్టుతో ప్రయాణిస్తున్నాడు. తన లోపాలు గుర్తించి సరిదిద్దుకుంటున్నాడు. జడ్డూ గాయపడటంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అతడు మూడు ఫార్మాట్లలో రాణిస్తుండటం శుభపరిణామం' అని ద్రవిడ్‌ అన్నాడు.

టీమ్‌ఇండియాలో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు చాలామంది ఉన్నారని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ అద్భుతంగా చేస్తాడని ప్రశంసించాడు. షాబాజ్‌ అహ్మద్‌ సైతం రెండింట్లో రాణించగలడన్నాడు. జడేజా తిరిగొస్తే మరింత బలం చేకూరుతుందని చెప్పాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లలో హార్దిక్‌ పాండ్యపై ఎక్కువ ఆధారపడుతున్నామని వివరించాడు. రెండో టీ20లో శివమ్‌ మావి బ్యాటింగ్ చేసిన తీరు ఆకట్టుకుందన్నాడు. ఫాస్ట్‌ బౌలర్లు సిక్సర్లు కొడుతుంటే ముఖంపై నవ్వులు వెల్లివిరుస్తాయని తెలిపాడు.

View this post on Instagram
 
A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget