అన్వేషించండి

BWF World Championships 2022: మరో టోర్నీపై కన్నేసిన భారత షట్లర్లు! ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ షెడ్యూలు ఇదే!

BWF World Championships 2022:భారత షట్లర్లు ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై కన్నేశారు. మరి ఈ టోర్నీ ఎప్పుడు మొదలవుతుంది? ఎవరి సీడింగ్‌ ఏంటి? ఏ రౌండు ఎప్పుడు జరుగుతుందో మీకోసం!

BWF World Championships 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు దుమ్మురేపారు. అన్ని విభాగాల్లో కలిసి ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు స్వర్ణం గెలిస్తే పురుషుల సింగిల్స్‌లో కుర్రాడు లక్ష్యసేన్‌ పసిడి ముద్దాడాడు. పురుషుల డబుల్స్‌లోనూ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి జోడీ బంగారు పతకం అందుకుంది. ఇప్పుడు వీరంతా మరో ప్రతిష్ఠాత్మక టోర్నీపై దృష్టి సారించారు.

భారత షట్లర్లు ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌పై కన్నేశారు. జపాన్‌ రాజధాని టోక్యో వేదికగా జరిగే మెగా టోర్నీలో పతకాల పంట పండించేందుకు సిద్ధమయ్యారు. కనీసం మూడు పతకాలైనా సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. మరి ఈ టోర్నీ ఎప్పుడు మొదలవుతుంది? ఎవరి సీడింగ్‌ ఏంటి? ఎవరు ఎవరితో తలపడుతున్నారు? ఏ రౌండు ఎప్పుడు జరుగుతుందో మీకోసం!

ఆగస్టు 22న మొదలు

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఆగస్టు 22 నుంచి 28 వరకు జరుగుతుంది. జపాన్‌ రాజధాని టోక్యో ఇందుకు వేదిక. అన్ని విభాగాల్లో ఆరు రౌండ్ల వరకు పోటీలు ఉంటాయి. స్వర్ణం లేదా రజతం అందుకోవాలంటే తొలి రౌండు, రెండో రౌండు, ప్రి క్వార్టర్స్‌, క్వార్టర్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్‌, ఫైనల్‌ ఆడాల్సి ఉంటుంది. 385 ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. 271 ఎంట్రీలు ఉన్నాయి. ఆగస్టు 22, 23న తొలి రౌండు, 24న రెండో రౌండు, 25న మూడో రౌండు పోటీలు ఉంటాయి. 26న క్వార్టర్‌ ఫైనళ్లు, 27న సెమీ ఫైనళ్లు, 28న ఫైనల్‌ మ్యాచులు జరుగుతాయి.

లక్ష్యసేన్‌పై ఆశలు

పురుషుల సింగిల్స్‌లో విక్టర్‌ అక్సెల్‌సెన్‌ టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. కెంటో మొమొటో, ఆండర్స్‌ ఆంటోన్‌సెన్‌, చౌ టీన్‌ చెన్‌, లీ జీ జియా వరుసగా 2, 3, 4, 5 సీడ్‌గా ఉన్నారు. భారత యువ కెరటం లక్ష్య సేన్‌ తొమ్మిదో సీడ్‌, కిదాంబి శ్రీకాంత్‌ 12వ సీడ్‌గా దిగుతున్నారు. మహిళల సింగిల్స్‌లో అకానె యమగూచి టాప్‌ సీడ్‌. తైజు ఇంగ్‌, ఆన్‌ సె యంగ్‌, చెన్‌ యూఫీ, కరోలినా మారిన్‌ వరుసగా టాప్‌ 5లో ఉన్నారు.

గత విజేతలు

సింగపూర్‌ షట్లర్‌ లో కీన్‌ యూ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నాడు. మహిళల సింగిల్స్‌లో జపాన్‌ అమ్మాయి అకానె యమగూచి గతేడాది విజేతగా నిలిచింది. పురుషుల డబుల్స్‌లో టకురో హోకి, ఉగో కబయాచి, మహిళల డబుల్స్‌లో చెన్‌ క్వింగ్‌చెన్‌, జియా యిఫాన్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో డెచాపొల్‌ , సప్సిరీ డిఫెండింగ్‌ ఛాంపియన్లు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Badminton World Federation (@bwf.official)

టాప్ హెడ్ లైన్స్

Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
IND VS NZ 2nd Test Day 1 Updates: రెండోటెస్టులో ఆకట్టుకున్న ఆకాశ్ దీప్.. రాణించిన గుర్నూర్, నిలకడగా ఆడుతున్న కివీస్.. సిరాజ్, జడేజాలకు మరోసారి నిరాశ
రెండోటెస్టులో ఆకట్టుకున్న ఆకాశ్ దీప్.. రాణించిన గుర్నూర్, నిలకడగా ఆడుతున్న కివీస్.. సిరాజ్, జడేజాలకు మరోసారి నిరాశ
Hardik Pandya News: హార్దిక్ రాకతో PBKS బ్యాటింగ్ బలపడినా అసలు చిక్కు అక్కడే.. ఆ ప్లేయ‌ర్ లోటు తీర్చకపోతే కప్పు కష్టమే అంటున్న మాజీలు, 18 కోట్ల పర్స్‌పై  చ‌ర్చ‌..
హార్దిక్ రాకతో PBKS బ్యాటింగ్ బలపడినా అసలు చిక్కు అక్కడే.. ఆ ప్లేయ‌ర్ లోటు తీర్చకపోతే కప్పు కష్టమే అంటున్న మాజీలు, 18 కోట్ల పర్స్‌పై  చ‌ర్చ‌..
వైభవ్ సూర్యవంశీ 2027 జాతకం: టీమ్ ఇండియాలో చోటు, రికార్డులు తిరగరాస్తాడా?
వైభవ్ సూర్యవంశీ 2027 జాతకం: టీమ్ ఇండియాలో చోటు, రికార్డులు తిరగరాస్తాడా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget