BCCI New Decision: క్రికెట్‌పై కరోనా ఎఫెక్ట్.. మరో టోర్నీ వాయిదా వేసిన బీసీసీఐ!
కరోనావైరస్ కారణంగా ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 కూచ్ బెహర్ టోర్నమెంట్‌ను బీసీసీఐ వాయిదా వేసింది.
ప్రస్తుతం పుణేలో జరుగుతున్న అండర్-19 కూచ్ బెహర్ టోర్నమెంట్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు కూడా కరోనా సోకింది. దీంతో బీసీసీఐ టోర్నీని వాయిదా వేయక తప్పలేదు.
కూచ్ బెహర్ అండర్-19 ట్రోఫీ ప్రస్తుతానికి క్వార్టర్ ఫైనల్స్ దశలో ఉంది. జనవరి 11వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 40 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ముందుజాగ్రత్తల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
కరోనా కేసులు పెరగడంతో పాటు టోర్నీలో పాల్గొనే వేర్వేరు జట్లకు చెందిన పలువురు ఆటగాళ్లు కూడా కోవిడ్ బారిన పడ్డారు. దీంతో టోర్నమెంట్‌ను కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన ముంబై జట్టులోని ఆటగాడికి కరోనా సోకింది. అలాగే సౌరాష్ట్రలోని ఆటగాళ్లకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది.
టోర్నమెంట్ జరగడం కోసం జట్లకు హోటళ్లలో ప్రత్యేకంగా ఫ్లోర్లు కేటాయించారు. అయినా ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ముంబై, చత్తీస్‌ఘర్, జార్ఖండ్, రాజస్తాన్, విదర్భ, బెంగాల్, హర్యానా , మహారాష్ట్ర జట్లు క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
కరోనావైరస్ థర్డ్ వేవ్ మనదేశంలో ప్రారంభం అయింది. దీంతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా గుబులు పుట్టిస్తుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1.5 లక్షల కేసులు నమోదయ్యాయి. బీసీసీఐ ఇప్పటికే రంజీ ట్రోఫీ, కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలను వాయిదా వేసింది.
Also Read: జకోవిచ్‌కు అవమానం.. ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత, ఆ దేశ అధ్యక్షుడి మండిపాటు
Also Read: బుమ్రా, జన్‌సెన్ మాటల యుద్ధం..! మైదానంలో టెన్షన్.. టెన్షన్
Also Read: విహారి పోరాటానికి హ్యాట్సాఫ్! సఫారీల లక్ష్యం 240.. టీమ్‌ఇండియా 266 ఆలౌట్
Also Read: WATCH: 'మమ్మా..' అంటున్న వామిక! తపించి పోతున్న కోహ్లీ, అనుష్క
Also Read: Kohli on 100th Test: వందో టెస్టుకు మీడియా ముందుకు కోహ్లీ..! షాకింగ్ విషయాలు చెబుతాడా??
Also Read: Lionel Messi Covid Positive: మెస్సీకి కరోనా.. మరో ఇద్దరికి కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి