అన్వేషించండి

Australian Open 2024: సుమిత్‌ నగాల్‌ సంచలనం,35 ఏళ్ల తర్వాత అద్భుతం

Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఇండియన్‌ స్టార్‌ టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌ చరిత్ర సృష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్‌ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు.

ఆస్ట్రేలియా ఓపెన్‌(Australian Open 2024)లో ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌(Sumit Nagal) చరిత్ర సృష్టించాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ 27వ ర్యాంకర్‌ను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మెన్స్ సింగిల్స్‌లో కజికిస్థాన్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు అలెగ్జాండర్ బబ్లిక్‌(Sumit Nagal vs Alexander Bublik) ను మట్టికరిపించాడు. 6-4, 6-2, 7-6 (5)తో వరుస సెట్లలో గెలిచి చరిత్ర సృష్టించాడు. 1989 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఓ సీడెడ్ ప్లేయర్‌ను భారత ఆటగాడు ఓడించడం ఇదే తొలిసారి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 139వ స్థానంలో ఉన్న నగాల్‌.. 27వ ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ బబ్లిక్‌పై గెలిచి సంచలనం సృష్టించాడు. సుమిత్‌ 6-4, 6-2, 7-6 (7-5)తో గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌ చరిత్రలో దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత ఓ సీడెడ్‌ ఆటగాడిని భారత క్రీడాకారుడు ఓడించడం ఇదే తొలిసారి. జబ్లిక్‌ను ఓడించిన రెండో రౌండ్‌లో దూసుకెళ్లిన సుమిత్ తర్వాత మెకెంజీ మెక్‌డొనాల్డ్, షాంగ్ జున్‌చెంగ్ లతో తలపడనున్నాడు.
 
అప్పుడెప్పుడో 1989లో....
టెన్నిస్ దిగ్గజం రమేశ్ కృష్ణన్‌( Ramesh Krishnan) 1989లో.. అప్పటి ప్రపంచ నంబర్‌ 1 మ్యాట్స్‌ విలాండర్‌ను రెండో రౌండ్‌లో ఓడించాడు. టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఇప్పటివరకు ఓ భారత ఆటగాడు ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌ వరకు మాత్రమే చేరుకున్నారు. రమేశ్ కృష్ణన్‌ తన కెరీర్‌లో ఐదు సార్లు 1983, 84, 87, 88, 89 ఏడాదుల్లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడో రౌండ్‌ వరకు వెళ్లాడు. లియాండర్‌ పేస్‌, విజయ్‌ అమృత్‌రాజ్ కూడా ఈ టోర్నీలో ఆడినప్పటికీ.. రెండో రౌండ్‌లోనే వెనుదిరిగారు. సుమిత్‌ చివరగా 2021 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రధాన డ్రాలో ఆడాడు. అప్పుడు మొదటి రౌండ్లోనే ఓడిపోయాడు. 2019, 2020లో యూఎస్‌ ఓపెన్‌ ప్రధాన డ్రాలోనూ సుమిత్‌ బరిలో దిగాడు. 2020 యూఎస్‌ ఓపెన్‌లోనూ రెండో రౌండ్‌ వరకు చేరుకున్నాడు. 
 
అప్పుడు యూఎస్‌ ఓపెన్‌లో కూడా..
స్విస్ దిగ్గజం, 20సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన రోజర్ ఫెదరర్‌ యూఎస్ ఓపెన్‌ 2019లో తొలి రౌండ్‌లో భారత ఆటగాడు సుమిత్ నగాల్‌(22)పై 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో ఆయన విజయం సాధించాడు. అయితే ఈ ఆటలో మొదటి సెట్‌లో సుమిత్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నాడు ఫెదరర్. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న ఈ నగాల్‌ 6-4తో మొదటి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తరువాత ఫెదరర్ అనుభవం ముందు సుమిత్ ఓడిపోక తప్పలేదు. ఏది ఏమైనా అరంగేట్ర మ్యాచ్‌లోనే ప్రపంచ దిగ్గజంతో పోటీ పడి అదరగొట్టాడని అభిమానులు సుమిత్‌ను పొగిడేస్తున్నారు. మరోవైపు మ్యాచ్ అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో సుమిత్‌ మంచి ఆటగాడు అవుతాడంటూ ప్రశంసించడం మరో విశేషం. ప్రాగ్‌ ఓపెన్‌లోనూ భారత యువ కెరటం సుమిత్‌ నగాల్‌.. మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత స్టానిస్లాస్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌)కు చెమటలు పట్టించాడు. అ యితే, ఆ తర్వాత ఒత్తిడికి గురై మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ప్రాగ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సుమిత్‌ 6-2తో తొలి సెట్‌ను కైవసం చేసుకొని వావ్రింకాకు షాకిచ్చాడు. కానీ, ఆ తర్వాత స్విస్‌ ప్లేయర్‌ విజృంభించడంతో అనవసర తప్పిదాలు చేసిన సుమిత్‌ 6-2, 0-6, 1-6తో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Viral Video - Tragic Football Incident: ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతున్న మ్యాచ్.. అంత‌లోనే పిడుగుపాటు.. ప్లేయ‌ర్ మృత్యువాత‌.. 12 మందికి గాయాలు!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
MSD Rahane Secrets: ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!
ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget