అన్వేషించండి

Asian Para Games 2023: ప్రకాశించిన ప్రాచీ యాదవ్ , కానో మహిళల KL2 ఈవెంట్‌లో తొలి స్వర్ణం

Asian Para Games 2023: పారా ఆసియా గేమ్స్‌లో మహిళల KL2 ఫైనల్‌లో ప్రాచీ యాదవ్ స్వర్ణం సాధించగా ఆమే భర్త మనీష్ రజితాన్ని పొందారు. ప్రాచీ ప్రదర్శన దేశానికే గర్వకారణం అని ప్రధాని మోదీ ప్రశంసించారు.

ఆసియా పారా గేమ్స్‌లో తొలి స్వర్ణ  పతకాన్ని సాధించి  భారత క్రీడా చరిత్రలో ప్రాచీ యాదవ్ తన పేరును నిలబెట్టుకుంది. భారత్ దేశపు విజయ పతాకాన్ని మరోసారి  రెపరెపలాడించింది.  పారా కానోయింగ్ మహిళల KL2 ఫైనల్‌లో  స్వర్ణ పతకం సాధించడం ద్వారా ఆమె అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశం గర్వించేలా చేసిందని ప్రధాని మోదీ స్వయంగా ట్వీట్ చేశారు.

మహిళల VL2 ఫైనల్లో 1వ రోజు రజతం సాధించిన తర్వాత, ఆమె మహిళల KL2 ఈవెంట్లో 54.962 సెకన్ల టైమింగ్ తో అగ్రస్థానంలో నిలిచారు.  చైనాకు చెందిన షన్హాన్ వాంగ్ 55.674 సెకన్లతో రజత పతకాన్ని చేజిక్కించుకున్నారు . ఇరాన్ కు  చెందిన రోయా సోల్తానీ 56.714 సెకన్లతో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 1వ రోజున, ప్రాచీ ఉజ్బెకిస్తాన్కు చెందిన ఇరోదాఖోన్ రుస్తమోవాకు 1.022 సెకన్ల తేడాతో ఉన్నారు. ప్రాచీ 1:03.47 సెకన్లతో రజత పతకాన్ని ఖాయం చేసుకోగా, ఇరోదాఖోన్ 1:02. 125 సెకన్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక జపాన్ క్రీడాకారిణి సాకి కొమట్సు 1:11.635 సెకన్లతో కాంస్య పతకంతో నిష్క్రమించింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ప్రాచీకి అభినందనలు తెలిపారు. సంకల్ప శక్తికి పరిమితులు లేవని ఆమె గెలుపు నిరూపించిందని అన్నారు. అలాగే క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ భారత్‌కు చెందిన నారీ శక్తి ఈ క్రీడల్లో దేశానికి తొలి పతకం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఆమె నిబద్ధత, అవిశ్రాంత అంకితభావం, విశేషమైన నిలకడను ప్రశంసిస్తూ, యావత్ దేశం మరోసారి గర్విస్తున్నదని ట్వీట్ చేశారు.

ఆసియా క్రీడలు ముగిసిన రెండు వారాల తర్వాత హాంగ్‌జౌలో మళ్లీ ఆటల సందడి మొదలైంది. ఈసారి పారా ఆసియా క్రీడలు ప్రారంభం  అయ్యాయి. ఆదివారంనాడు  హాంగ్‌జౌ ఒలింపిక్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌ స్టేడియంలో ఈ క్రీడల ఆరంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చైనా ఉపాధ్యక్షుడు డింగ్‌ గ్జూజియాంగ్‌ క్రీడలు మొదలైనట్లు ప్రకటించారు. ఈ క్రీడలలో మన దేశం  తరఫున 313 అథ్లెట్లు బరిలో ఉన్నారు.

మధ్యప్రదేశ్ గ్వాలియార్కు చెందిన ప్రాచీ ఆసియా పారాకానో ఛాంపియన్‌షిప్ 2023లో రెండు స్వర్ణాలు మరియు ఒక రజతం గెలుచుకున్నారు.అలాగే ఆమె 2022లో జరిగిన ICF కానో స్ప్రింట్ మరియు పారాకానో ప్రపంచ కప్‌లో కాంస్యాన్ని కూడా గెలుచుకుంది.  2019లో ఢిల్లీలో జరిగిన పారా కానో ఛాంపియన్‌షిప్‌లో ప్రాచీ తన మొదటి బంగారు పతకం పొందారు. తరువాత మే 2019లో పోలాండ్‌లోని పోజ్నాన్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో  మొదటి అంతర్జాతీయ కార్యక్రంలో పాల్గొని 8 వ స్థానంలో నిలిచారు.  జపాన్‌లోని టోక్యోలో జరిగిన  2020 పారాలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన మొట్టమొదటి భారతీయ పారాకానో అథ్లెట్ కూడా ప్రాచీ. ఆమే భర్త  మనీష్ కౌరవ్, పురుషుల KL3 కానోలో 44.605 సెకన్ల సమయాన్ని నమోదు చేసి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. మనీష్ కౌరవ్ ఇప్పటికే  రెండుసార్లు ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతక విజేత మరియు జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు పొందారు. కాంటినెంటల్ గేమ్స్‌లో మనీష్ కౌరవ్‌కు ఇదే తొలి పతకం.

అసలు పారా ఆసియా గేమ్స్‌లో భారత్ ఈసారి  అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది.  రెండు ఈవెంట్స్‌లో అన్ని పతకాలను సాధించిన భారత్.. ఘనమైన ఓపెనింగ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల హైజంప్ టీ63, పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లలో భారతదేశం మొత్తం అన్ని పతకాలను కైవసం చేసుకుంది. పురుషుల హైజంప్ టీ63 ఈవెంట్‌లో శైలేష్ కుమార్, బ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో ప్రణవ్ సూర్మ గోల్డ్ మెడల్స్ సాధించారు. పతకాల పట్టికలో చైనా  మొదటి స్థానంలో ఉండగా భారత్ 2 వ స్థానంలో ఉంది. 

 

టాప్ హెడ్ లైన్స్

PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
BCCI Selection Twist: అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
IND vs SL Test Series Updates: లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
లంకలో ల్యాండైన టీమ్ ఇండియా.. ఫ్లైట్ ఎక్కని టాపార్డ‌ర్ బ్యాటర్, తొలి టెస్టు ఆడ‌టంపై సందిగ్ధం !
BCCI Pension Rules: రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే
రహానే రిటైర్మెంట్ డెసిషన్ తో మళ్లీ చర్చల్లోకి బిసిసిఐ పెన్షన్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లో పడే అమౌంట్ ఎంతో తెలిస్తే షాకే

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Embed widget