News
News
X

రోహిత్‌ కెప్టెన్సీకి అసలు సిసలు పరీక్ష! 2 నెలల్లో హిట్టో, ఫట్టో తేలిపోద్ది!

Rohit Sharma: రోహిత్ శర్మకు కెప్టెన్ గా టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. టీమిండియాకు ఎన్నో మంచి విజయాలను అందించాడు. ఇప్పుడు 2 నెలల్లో వచ్చే 2 కీలక టోర్నీలను రోహిత్ ఎలా ఎదుర్కొంటాడో ఆసక్తి నెలకొంది.

FOLLOW US: 

Rohit Sharma Captaincy Test: రోహిత్ శర్మకు కెప్టెన్ గా టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. టీమిండియాకు ఎన్నో మంచి విజయాలను అందించాడు. కానీ ఇప్పటిదాకా బైలేటరల్ సిరీసులే తప్ప సిసలైన పరీక్ష ఇంకా ఎదురుకాలేదు. ఇప్పుడు 2 నెలల్లో వచ్చే 2 కీలక టోర్నీలను రోహిత్ ఎలా ఎదుర్కొంటాడో ఆసక్తి నెలకొంది.

టీ20ల్లో రోహిత్ కు అద్భుతమైన రికార్డు

రోహిత్ శర్మ... కెప్టెన్సీ ఎబిలిటీస్ చూస్తే చాలా మందికి... కోహ్లీ ప్లస్ ధోనీ కాంబోలా కనిపిస్తాడు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. అగ్రెసివ్ కెప్టెన్సీ, అపోజిషన్ కు కౌంటర్స్ ఇవ్వడం.... లాంటి విషయాల్లో కోహ్లీని పోలి ఉంటాడు. ఇక కొత్త ట్యాక్ టిక్స్ అమలు చేయడంలో, మ్యాచ్ మన కంట్రోల్ లో లేనప్పుడు, అవకాశాలు చేజారిపోతున్నప్పుడు సంయమనం కోల్పోకుండా ఉండటంలో... ధోనీలా వ్యవహరిస్తాడు. సో ఆ రకంగా రోహిత్ కెప్టెన్సీ సామర్థ్యం మీదా అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలే ఆశలుగా మారాయి. అవి రోజురోజుకూ పెరిగిపోతున్నాయి... రోహిత్ శర్మ మీద. 9 ఏళ్లుగా ఊరిస్తున్న ఐసీసీ  ట్రోఫీ తీసుకొస్తాడని.... 15 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న  టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకొస్తాడని!

కోహ్లీ, ధోనీకి రెస్ట్ ఇచ్చినప్పుడు... రోహిత్ ఇంతకముందు కెప్టెన్సీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్నాడో... అప్పట్నుంచి... అంటే గతేడాది నవంబర్ నుంచి రోహిత్ టీ20ల్లో ఫుల్ టైం కెప్టెన్ అయ్యాడు. అలాగే వన్డేలు, టెస్టుల్లో కూడా. సరే అప్పట్నుంచి టీ20లకు సంబంధించి రోహిత్ రికార్డ్ ఎలా ఉందో చూద్దాం.

రోహిత్ ఫుల్ టైం కెప్టెన్సీ తీసుకున్న దగ్గర నుంచి ఐదు సిరీసుల్లో, 16 మ్యాచుల్లో టీమిండియాను నడిపించాడు. ఐదు సిరీసులూ గెలిచేశాడు. తాను నడిపించిన 16 మ్యాచుల్లో కేవలం ఒక్కసారి మాత్రమే టీమిండియా ఓడిపోయింది. అంటే దాదాపుగా 94 పర్సెంట్ విన్ పర్సంటేజ్. చాలా అద్భుతమైన రికార్డ్ ఇదని చెప్పుకోవాలి.

రాబోయే 2 నెలల్లో రోహిత్ కు 2 పరీక్షలు

ఓకే. ఇప్పటిదాకా బైలేటరల్ సిరీసుల్లో టీమిండియాను సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. కానీ అసలు పరీక్ష ఇప్పట్నుంచే మొదలవుతుంది. ఏషియా కప్ రోహిత్ శర్మ కెప్టెన్సీకి సిసలైన సవాల్ విసురుతుంది. టీ20 ఫార్మాట్ లో జరగబోతోంది. ఈ ఏడాది ఏషియా కప్ జరిగే ఫార్మాట్ చూస్తే..... కనీసం 3 సార్లు అయినా ఇండియా పాకిస్థాన్ తో తలపడుతుంది. అంటే చాలా హై ప్రెషర్ మ్యాచెస్ ఉంటాయి. అదొక్కటే కాదు. అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు ఈ ఏషియా కప్ సరైన డ్రెస్ రిహార్సల్. కేవలం 2 నెలల గ్యాప్ లోనే రోహిత్ శర్మకు టీ20 ఫార్మాట్ లో రెండు చాలా ఇంపార్టెంట్ టోర్నీలు రాబోతున్నాయి. ఇది అతని కెప్టెన్సీకి సరైన సవాలే. కానీ టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్ ఏంటంటే టీం మంచి ఫాంలో ఉంది. బ్యాటింగ్ లో తిరుగే లేదు. హార్దిక్ పాండ్య వచ్చిన దగ్గర నుంచి టీం కాంబినేషన్ సూపర్ గా సెట్ అయిపోయింది. సో టీం ఇంజిన్ సాఫీగా సాగిపోతుంది. దీన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటూ ప్రెషర్ మూమెంట్స్ లో కాస్త సంయమనం పాటిస్తే.... 2 నెలల్లోనే రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2 ట్రోఫీలూ కొట్టేయచ్చు.

రోహిత్ కెప్టెన్సీలో విజయాలు

Ind vs NZ 3-0 క్లీన్ స్వీప్
Ind vs WI 3-0 క్లీన్ స్వీప్
Ind vs SL 3-0 క్లీన్ స్వీప్
Ind vs ENG 2-1 విజయం
Ind vs WI 4-1 విజయం ( ఓన్లీ 4 మ్యాచెస్ కెప్టెన్సీ)

Published at : 23 Aug 2022 05:00 PM (IST) Tags: Rohit Sharma Team India T20 Worldcup 2022 Ind vs Pak Asia Cup Asia Cup 2022 Asia Cup 2022 Live

సంబంధిత కథనాలు

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

IND vs SA 3rd T20: మూడో టీ20 టాస్‌ మనదే! రోహిత్‌ ఏం ఎంచుకున్నాడంటే?

భారత్-దక్షిణాఫ్రికా మూడో టీ20కి విరాట్ కోహ్లీకి విశ్రాంతి!

భారత్-దక్షిణాఫ్రికా మూడో టీ20కి విరాట్ కోహ్లీకి విశ్రాంతి!

WI T20 World Cup Squad: టీ20 వరల్డ్ కప్ నుంచి హిట్‌మేయర్ ఔట్, ఇలా కూడా జట్టులో చోటు కోల్పోతారా

WI T20 World Cup Squad: టీ20 వరల్డ్ కప్ నుంచి హిట్‌మేయర్ ఔట్, ఇలా కూడా జట్టులో చోటు కోల్పోతారా

Jasprit Bumrah: ఆ వార్త తెలిసి గుండె పగిలిందన్న జస్ప్రీత్‌ బుమ్రా!

Jasprit Bumrah: ఆ వార్త తెలిసి గుండె పగిలిందన్న జస్ప్రీత్‌ బుమ్రా!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

Jasprit Bumrah Ruled Out: భయాలే నిజం అయ్యాయ్ - టీ20 వరల్డ్‌కప్ నుంచి బుమ్రా అవుట్!

టాప్ స్టోరీస్

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: జంబలకిడి పంబలా శ్రీహాన్, పిచ్చోడిలా సూర్య, ఫైమాకు సీక్రెట్ టాస్క్ - బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మామూలుగా లేదు

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !

EC On Freebies : ఉచిత హామీల కట్టడికి ఈసీ కార్యాచరణ - నిధులెక్కడి నుంచి తెస్తారో కూడా చెప్పాల్సిందే !