అన్వేషించండి

Christmas Celebrations 2025: క్రిస్మస్ డిసెంబర్ 25న కాదు.. ఈ దేశాల్లో జనవరిలో సెలబ్రేషన్స్! కారణం ఏంటో తెలుసుకోండి

Christmas Celebrations 2025: ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని క్రైస్తవులు మాత్రం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను నిర్వహించుకోరు. డిసెంబర్ 25వ తేదీన కాకుండా మరో రోజున వీరు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు.

Christmas Celebrations 2025: యేసు క్రీస్తు పుట్టిన రోజును డిసెంబర్ 25వ తేదీన క్రైస్తవులందరూ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని అందరికీ తెలిసిన విషయం. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని క్రైస్తవులు మాత్రం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను నిర్వహించుకోరు. డిసెంబర్ 25వ తేదీన కాకుండా మరో రోజున వీరు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు. అయితే ఆ దేశాలు ఏంటి? ఎందుకు అనేది ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

డిసెంబర్ 25వ తేదీన జరుపుకోని దేశాలు ఇవే..

యేసుక్రీస్తు పుట్టుకను ఈస్టర్న్ ఆర్థడాక్స్ (Eastern Orthodox) దేశాలు డిసెంబర్ 25వ తేదీన జరుపుకోవు.

ఆ దేశాల జాబితా ఇదే:

రష్యా (Russia)

ఉక్రెయిన్ (Ukraine) - కొన్ని చర్చిలు

సెర్బియా (Serbia)

జార్జియా (Georgia)

బెలారస్ (Belarus)

మోల్డోవా (Moldova)

మాంటెనెగ్రో (Montenegro)

ఉత్తర మాసిడోనియా (North Macedonia)

ఎథియోపియా (Ethiopia)

ఎరిట్రియా (Eritrea)

ఈజిప్ట్ (Egypt) - కాప్టిక్ క్రిస్టియన్స్

ఈ దేశాలు ఇప్పటికీ జూలియన్ క్యాలెండర్ (Julian Calendar) అనుసరిస్తాయి. ఈ కారణంగా డిసెంబర్ 25వ తేదీని క్రీస్తు జన్మదినంగా జరుపుకోవు. మన క్యాలెండర్‌లోని డిసెంబర్ 25వ తేదీ, వారు అనుసరించే జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 7వ తేదీ అవుతుంది. ఆ కారణంగా ఈ దేశాల్లోని క్రైస్తవులు జనవరి ఏడో తేదీన యేసు క్రీస్తు జన్మదినపర్వాన్ని ఆచరిస్తారు.

ఆర్మేనియా (Armenia) దేశానిది మరో ప్రత్యేకత

ఇక ఆర్మేనియా దేశం క్యాలెండర్ ప్రకారం కాకుండా, వారి పాత సంప్రదాయాలను అనుసరించడం వల్ల యేసు క్రీస్తు జన్మదినాన్ని భిన్నంగా జరుపుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు డిసెంబర్ 25వ తేదీన ఈ పండుగ జరిపితే, జూలియన్ క్యాలెండర్ ప్రకారం మరికొంత మంది జనవరి ఏడో తేదీన జరుపుతారు. ఈ ఆర్మేనియన్ క్రైస్తవులు మాత్రం జనవరి ఆరో తేదీన క్రిస్మస్ పండుగ జరుపుతారు. జనవరి ఆరో తేదీన యేసు జననంతో పాటు ఆయన బాప్తిస్మం తీసుకోవడాన్ని ఒకే రోజున జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. యూరోపియన్ దేశాలు క్యాలెండర్ ప్రకారం యేసు క్రీస్తు జన్మదినోత్సవం జరుపుతుంటే, ఆర్మేనియా మాత్రం పాత సంప్రదాయాల ప్రకారమే ఈ పండుగను జరుపుకుంటోంది.

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 3 రాశి ఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారికి ఆర్థిక లాభం, గౌరవం!
నవంబర్ 3 రాశి ఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారికి ఆర్థిక లాభం, గౌరవం!
నవంబర్ 3 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయ్?
నవంబర్ 3 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు ఎలాంటి ఫలితాలున్నాయ్?
నవంబర్ 3, 2026 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారి అదృష్టం ఎలా?
నవంబర్ 3, 2026 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారి అదృష్టం ఎలా?
నవంబర్ 2 రాశి ఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారికి ధన లాభం, మరికొందరికి జాగ్రత్త అవసరం!
నవంబర్ 2 రాశి ఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారికి ధన లాభం, మరికొందరికి జాగ్రత్త అవసరం!

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah In Hyderabad: చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, సాయంత్రం హైదరాబాద్‌లో పాదయాత్ర
చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా, సాయంత్రం హైదరాబాద్‌లో పాదయాత్ర
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
Royal Enfield Himalayan 750 వచ్చేస్తోంది.. క్రూజ్‌ కంట్రోల్‌, TPMS సహా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల్లో హైయెస్ట్‌ పవర్‌ ఉన్న బండి.. హిమాలయన్ 750 ఫీచర్లు రివీల్!
Ranabaali OTT : రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - విరోష్ కపుల్ కొత్త మూవీ స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Embed widget