ఈవారం ఈ రాశుల వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు
Weekly Horoscope: ఈ వారం రోజులు పలు రాశుల అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలున్నాయి. కొన్ని రాశుల వారికి ధనలాభం ఉంటే. మరికొన్ని రాశులవారికి రాజకీయ, సినీరంగాలలో ఉత్తమ ఫలితాలున్నాయి.
Weekly Horoscope 19-25 September: సెప్టెంబరు 19 సోమవారం నుంచి సెప్టెంబరు 25 ఆదివారం వరకూ ఈ వారంలో తులా రాశి నుంచి మీన రాశివరకూ..ఆరు రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం...
మేషరాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈవారం నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అవివాహితులకు వివాహం కుదిరుతుంది. రుణబాధలు తొలుగుతాయి. అయితే అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
వృషభ రాశి (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : వృషభరాశి వారికి ఈ వారం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. . ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. ఐ.టి, వైద్య విద్యార్ధులకు సమయం అనుకూలంగా ఉంది. అయితే అందరినీ పూర్తిగా నమ్మవద్దు. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి.
మిథున రాశి (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : ఈ వారం ఈరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న బంధువులకు అర్థిక సహాయం అందిస్తారు. ఆదాయం నిలకడగా ఉన్నా ఆర్థిక బాధలు తప్పవు. అష్టమ శని నడుస్తున్నందున్న అనారోగ్యం బాధిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు ఈవారం కలిసి వస్తుంది.
కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈరాశి వారికి ఈవారం బంధుమిత్రుల్లో మాటకు విలువ పెరుగుతంది. ఆర్థికలావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. విదేశీయాన సూచనలు కనిపిస్తున్నాయి. సైన్స్, ఆర్ట్స్ రంగంలోని విద్యార్థులకు అనుకూలం. ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి. సప్తమ శని కారణంగా వారం మధ్యలో శ్‌రమ. పని ఒత్తిడి, ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈవారంలో వీరికి ఎప్పటినుంచో ఉన్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. బంధుమిత్రులతో సుఖంగా కాలం గడుపుతారు..అవివాహితులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి వస్తుంది. ఆరోగ్యం కుదురుపడుతుంది. ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతారు. కోర్టుకేసులు అనుకూలంగా ఉంటాయి. గణితం, డాక్టర్లు, టెక్నాలజీ నివుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది.
కన్య రాశి (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) : ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతాయి. వారం మధ్యలో వృథా వ్యయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తే అవకాశం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. దూరప్రయాణాలు చేస్తారు. ప్రేమవ్యవహారాలు సఫలీకృతం అవుతాయి.
తుల రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఈరాశి వారికి నాలుగులో శని, ఆరులో గురు గ్రహాల సంచారం వల్ల ఈవారం ఏమంత అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు లాభించవు. కోర్టుకేసుల్లో విజయం ప్రాప్తిస్తుంది. అయితే ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కళా సాహిత్య రంగాలవారికి అనుకూలం. విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. స్పెక్యులేషన్ వల్ల పెద్దగా లాభముండదు.
వృశ్చిక రాశి (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : ఈరాశివారికి ఈవారం ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. గృహలాభం ఉండబోతోంది. రియల్ ఎస్టేట్ వారికి మంచి లాభాలు కలుగుతాయి. భార్యాపిల్లల సహాయం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. డబ్బుల విషయంలో ఆచితూచి ఖర్చు పెట్టండి. సామాజిక రంగాలలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఒకరికి వివాహం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకు శ్రమ ఉంటుంది.
ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : సహనంతో ఉంటే ఈవారం మీ లక్ష్యాలను నెరవేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మునపటికన్నా మెరుగుపడుతుంది. రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. భాగస్వామితో అనవసర వివాదాలు దూరమయి అన్యోన్యంగా ఉంటారు. సొంత ఇల్లుకోసం ఆలోచిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : వీరికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఎలాంటి పురోగతి ఉండదు. వివాహా ప్రయత్నాలకు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. ధ్యానం చేయడం చెప్పదగిన సూచన. అనుకోని ఖర్చులు వారం మధ్యలో కలిగే అవకాశాలున్నాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. సంఘంలో గౌరవం లభిస్తుంది.
కుంభరాశి (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : వీరికి ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. కోర్టుకేసులకు అనుకూలం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అప్పులను తీర్చే ప్రయత్నం చేస్తారు.
మీన రాశి (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : వీరికి శని, గురువులు లాభస్థానంలో ఉండడం వల్ల శుభపరిణామాలు ఉంటాయి. ప్రశాంతంగా వారం గడుస్తుంది. పిల్లల పెళ్లి ప్రయత్నాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి.