By: ABP Desam | Updated at : 26 Sep 2023 02:22 PM (IST)
Image Credit: Peakpx
Vishnu Sahasranamam: పవిత్రత, ఆధ్యాత్మిక బలం పెరగడానికి విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. ఈ ప్రక్రియలో శ్రీ మహావిష్ణువు 1000 నామాలను జపిస్తారు. ఈ నామాలు విష్ణువు మహిమలను వివరిస్తాయి. ఈ నామాలన్నీ ఆధ్యాత్మికత, ధ్యానం, భక్తి, అంతర్గత శాంతి కోసం పారాయణ చేస్తారు. విష్ణుసహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు మానసిక ఆందోళనలు తగ్గుతాయి.
విష్ణు సహస్రనామాన్ని క్రమం తప్పకుండా పారాయణం చేయడం వల్ల కష్టాలు, బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని విశ్వసిస్తారు. క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అశాంతి, చెడు సంకల్పం, అభ్యంతరాలు తొలగిపోతాయి. ఇది హిందూ ధర్మంలోని అత్యంత పవిత్రమైన గ్రంథాల్లో ఒకటి. ఎవరైతే ఈ పారాయణాన్ని నిర్మలమైన మనస్సుతో, నిశ్చల భక్తితో పారాయణ చేస్తారో లేదా వింటారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు.
Also Read : ఈ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కుటుంబ వృద్ధి, శత్రునాశనం!
విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు జపించాలి
విష్ణు సహస్రనామ పారాయణ నియమాలు
Also Read : వీటిని విక్రయిస్తే పాపాలు చుట్టుముడతాయ్!
విశ్వంలోని ప్రతి సంఘటన విష్ణువుకు సంబంధించినది. విశ్వం సృష్టికర్త అయిన విష్ణువు కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతారు. జీవితంలోని ప్రతి అవరోధాన్ని, ప్రతి విపత్తును తొలగించే విష్ణు సహస్రనామం హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనది. కాబట్టి, మీరు మీ జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలోపేతం చేయాలనుకుంటే లేదా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలనుకుంటే, మీరు విష్ణుసహస్రనామాన్ని తప్పకుండా పారాయణ చేయాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Chirstmas 2023: క్రిస్మస్ సందర్భంగా మీరు చేసే దానం ఇలా ఉండాలి!
Karthika Masam End date Deepadaanam 2023: కార్తీక మాసం ఆఖరి సోమవారం లేదా చివరి రోజు దీపదానం చేస్తే!
Astrology: ఈ రాశులవారికి చలికాలం అంటే చాలా ఇష్టం!
Daily Horoscope Today Dec 9, 2023: ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది, డిసెంబరు 09 రాశిఫలాలు
Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>