అన్వేషించండి

బెడ్ రూమ్‌లో అద్దం అక్కడ ఉందా? జాగ్రత్త, అది మీకే నష్టం!

పడకగది ప్రశాంతంగా లేకపోతే ఇల్లు ప్రశాంతంగా లేనట్టే. అందుకే బెడ్ రూమ్ విషయంలో వాస్తు నియమాలను అనుసరించడం అవసరం. బెడ్ రూమ్ ప్రశాంతంగా ఉండేందుకు ఉపయోగపడే వాస్తు టిప్స్ ఇక్కడ చూడండి.

ఇంట్లో అడుగు పెట్టగానే ఒక ప్రశాంత రావాలంటే ఇల్లు వాస్తు నియమానుసారం ఉండాలి. అందుకే వాస్తును శాస్త్రంగా పరిగణిస్తారు మన సంస్కృతిలో. ఇంటి నిర్మాణంలో ప్రతి గదికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అందులో బెడ్ రూమ్ చాలా ముఖ్యమైనది. ఇంట్లో సేద తీరగలిగే ప్రశాంతమైన చోటు ఏదీ అంటే.. అది బెడ్ రూం మాత్రమే. ఇది ప్రశాంతంగా ఉండడమే కాదు చాలా పర్సనల్ స్పేస్ కూడా. వర్క్ స్పేస్ తర్వాత చాలా టైం ఇక్కడే గడుపుతాం. అందుకే కొత్తగా ఇల్లు కట్టుకొనే వారైనా, కట్టిన ఇల్లు కొనుక్కునే వారైనా లేదా ఇల్లు అద్దెకు తీసుకుంటున్నా కూడా బెడ్ రూమ్ ఎంత సౌకర్యంగా ఉందా, లేదా అనేది ప్రత్యేకంగా చూసుకుంటారు. ఇంట్లో ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉండడానికి మాత్రమే కాదు, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తేవడానికి కచ్చితంగా వాస్తు నియమాలను అనుసరించే ఉండాలి. బెడ్ రూం వాస్తు సరిగ్గా లేకపోతే ఇంట్లో మీ ప్రియతములతో సంబంధావ్యాల మీద కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అందుకే బెడ్ రూమ్ కు సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను తెలుసుకుందాం.

బెడ్ రూం ఎప్పుడూ కూడా నైరుతి దిశలో ఉండాలి. ఇలా ఉన్నపుడు ఆరోగ్యంతో పాటు సంబంధ బాంధవ్యాలు కూడా బావుంటాయి. ఈశాన్యంలో ఉంటే అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆగ్నేయంలో ఉంటే ఇంట్లో ఎప్పుడూ గొడవలుగా ఉంటుంది. ముఖ్యంగా దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. బెడ్ కూడా నైరుతి మూలనే ఉండాలి. తల పడమర వైపు ఉండాలి. బెడ్ రూం ఎప్పుడూ కూడా ఇంటికి మధ్య భాగంలో ఉండకూడదు. ఇంటి మధ్య భాగం బ్రహ్మస్థానం అంటారు. ఇక్కడ స్థిరమైన ఎనర్జీ ఎల్లప్పుడూ ఉంటుంది. అందువల్ల  బెడ్ రూమ్ ఇంటి మధ్యలో  ఉంటే ప్రశాంతత లోపిస్తుంది.

బెడ్ రూమ్‌లో పాటించాల్సిన వాస్తు నిమయాలు

  1. మంచానికి ఎదురుగా అద్దం లేదా టీవీ ఉండకూడదు. మంచంలో పడుకుని ఉన్నపుడు ప్రతిబింబం కనిపించకూడదు. అలా కనిపిస్తే ఇంట్లో గొడవలు జరుగుతాయి.
  2. బెడ్ రూమ్ గోడల రంగులు సహజమైనవిగా ఉండేట్టు జాగ్రత్త పడాలి. ఎర్తీ కలర్స్ పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి.
  3. బెడ్ రూంలో గుడి లేదా పూజ కు సంబంధించిన ప్లేస్ ఉండకూడదు.
  4. బెడ్ రూమ్ లో నీటి ప్రవాహాలు, ఫౌంటైన్స్ వంటి పేయింటింగ్స్ ఉండకూడదు. ఇది ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ తేవచ్చు.
  5. చిన్న వెలుతురు వచ్చే లైట్స్, అరోమాటిక్ ఆయిల్స్ ఉండే డిఫ్యూజర్స్ వాడొచ్చు.
  6. నైరుతి దిశలో ఉన్న గోడను ఆనుకొని బెడ్ పెట్టుకోవడం మంచిది. ఒక వేళ అటువంటి అవకాశం లేనపుడు గోడకు బెడ్ కు మధ్య ఒక అంగుళం వదలాలి.
  7. తలుపుకు ఎదురుగా ఉండేట్టుగా బెడ్ ఏర్పాటు చేసుకోకూడదు. ఇలా ఉంటే పీడకలలు వస్తాయి.
  8. బెడ్ పిల్లర్ లేదా బీమ్ కింద ఉంటే నిద్ర పట్టదు.
  9. గదిలో ఆగ్నేయంలో నీటి జగ్ పెట్టుకుంటే నిద్ర పట్టడంలో ఇబ్బందులు వస్తాయి.
  10. బెడ్ రూం అటాచ్డ్ బాత్రూం లేదా లాండ్రీ ఏరియా తలుపు తెరచి పెట్టుకోవద్దు ముఖ్యంగా రాత్రుళ్లు.

టాప్ హెడ్ లైన్స్

12-10-2026 సోమవారం మకరం, కుంభం, మీన రాశుల ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆర్థిక పరిస్థితి!
12-10-2026 సోమవారం మకరం, కుంభం, మీన రాశుల ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆర్థిక పరిస్థితి!
12-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ భవిష్యత్తుకు మార్గదర్శకం!
12-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ భవిష్యత్తుకు మార్గదర్శకం!
12-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశుల దినఫలాలు!
12-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశుల దినఫలాలు!
12-10-2026 సోమవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం - మీ జాతకం ఏం చెబుతోంది
12-10-2026 సోమవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం - మీ జాతకం ఏం చెబుతోంది

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
PM Modi Chennai Tour: సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
సీఎం విజయ్‌తో కలిసి చెన్నై మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం- రూ.13 వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం!
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
Embed widget