అన్వేషించండి

Vastu Tips: తాబేలు బొమ్మను ఈ దిక్కున పెడితే మీకు తిరుగే ఉండదు

ఒక్కో రకమైన తాబేలు బొమ్మతో ఒక్కోరకమైన ఫలితం ఉంటుంది. అసలు తాబేలు బొమ్మ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది?

ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్లాన్, దాన్ని డిజైన్ చేసే సమయంలో కొన్ని నిర్థుష్టమైన రంగుల ప్యాలెట్, డెకార్ థీమ్ వంటి వాటిని నిర్ణయించుకునేందుకు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఇంట్లో నివసించే వారి మీద ఇంట్లోని ప్రతి భాగం కూడా ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం అనేది ఒక సంప్రదాయ ఆర్కిటెక్చర్ సిస్టమ్. ఎంతో మంది పండితులు దీని గురించి చాలా పరిశోధించి అందించిన పరిజ్ఞానం. అందుకే ఇంటి నిర్మాణం చేపట్టే ముందు వాస్తును పరిశీలించి అందుకు తగినట్లు నిర్మాణాలు చేసుకోవడం అన్నిటా మంచిది.

తాబేలు బొమ్మతో దోషాల పరిష్కారం

విష్ణు అవతారాల్లో ఒకటి కూర్మావతారం. కూర్మం అంటే తాబేలు. ఈ తాబేలు బొమ్మను చాలా మంది ఇంట్లో అలంకరించుకుంటారు. కానీ దీని ప్రభావం చాలా గొప్పది. సరైన తాబేలు బొమ్మ సరైన దిశలో పెట్టినపుడు మంచి ఫలితాలు ఉంటాయి. రకరకాల మెటల్స్ తో, చెక్కతో, గాజుతో చేసిన తాబేలు బొమ్మలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ఒక్కోరకమైన తాబేలును ఒక్కోదిశలో అలంకరించాలి. ఒక్కో రకమైన తాబేలు బొమ్మతో ఒక్కోరకమైన ఫలితం ఉంటుంది. అసలు తాబేలు బొమ్మ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది? ఇంట్లో ధనం నిలిచి ఉంటుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

విష్ణుమూర్తి ఎటు వెళ్లినా ఆయన్ని అనుసరిస్తూ అతడి భార్య లక్ష్మీ దేవి వస్తుంది. సంపదల రాణి లక్ష్మిని ఆకర్శించేందుకు విష్ణువు ఆహ్వానించాలని పండితులు చెబుతున్నారు. అంతేకాదు తాబేలు దీర్ఘాయుష్షుకు ప్రతీక. తాబేలు 125 నుంచి 150 సంవత్సరాల పాటు జీవిస్తుంది. ఇది ఇంటిలోకి ఆరోగ్యాన్ని దీర్ఘాయువును తెస్తుంది.

తాబేలు బొమ్మను సరైన దిశలో పెట్టుకుంటే ఇంట్లో స్థిరత్వం, ఇంట్లో నివసించేవారికి ఆరోగ్యం, దీర్ఘాయువు, సంపద చేరి తద్వారా ఆనందం వెల్లివిరుస్తుందని పండితులు చెబుతున్నారు.

మెటల్/వెండి: వెండితో చేసిన తాబెలు బొమ్మను వాయవ్యం లేదా ఉత్తరంలో పెట్టుకోవాలి.

ఇత్తడి: ఇత్తడితో చేసిన తాబేలును నైరుతిలో పెట్టుకుంటే ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి.

చెక్క: చెక్కతో చేసిన తాబేలును తూర్పున పెట్టుకుంటే మానసిక ఆరోగ్యం, అదృష్టాన్ని ఇస్తుంది.

క్వార్ట్స్ లేదా క్లియర్ గ్లాస్: వీటితో చేసిన తాబేలును ఆగ్నేయంలో పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది.

  • ఉత్తరాభి ముఖంగా ఉన్న ఇంట్లో పశ్చిమ దిక్కున తాబెలు బొమ్మ పెట్టుకుంటే అది కోరికలు నెరవేరేందుకు దోహదం చేస్తుంది. ఆఫీస్ లేదా వర్క ప్లేస్ లో పెట్టుకుంటే అధిక రాబడి, వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుంది.
  • అభివృద్ధి నిలిచిపోయిన వారు నైరుతిలో ఇత్తడి తాబేలును ఉత్తరాభిముఖంగా ఉంచాలి. ఇది ఆర్థిక వృద్ధికి మంచిది. రకరకాల సైజుల్లో కొన్ని తాబేలు బొమ్మలను నైరుతిలో పెట్టుకున్నపుడు కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య సామరస్యం ఉంటుంది. ఇత్తడి తాబేలును పిల్లల స్టడీ టేబుల్ మీద పడమర వైపు ఉంచితే చదువులో వారికి ఏకాగ్రత పెరుగుతుంది.
  • ఉత్తరాభిముఖంగా ఉండే తాబేలు బొమ్మ ఇంటి మధ్యలో ఉంచితే సహనం, పట్టుదల పెరుగుతాయి.
  • అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు వెండి తాబేలును వెండి గిన్నెలో నీళ్లలో ఉంచితే అవకాశాలు మాత్రమే కాదు డబ్బు కూడా సమృద్ధిగా చేరుతుంది.

Also Read: మీ ఇల్లు ఇలా ఉంటే పర్సులో పైసా కూడా నిలవదు - డబ్బులు నీళ్లలా ఖర్చవుతాయ్

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi Posts Vijayawada Singer Song: ప్రధాని మోదీ మెచ్చిన విజయవాడ సింగర్ గురించి ఈ విషయాలు తెలుసా!
ప్రధాని మోదీ మెచ్చిన విజయవాడ సింగర్ గురించి ఈ విషయాలు తెలుసా!
Wedding Tradition: ఈ ఊర్లో ఇంటి దగ్గర పెళ్లి చేస్తే పిల్లలు పుట్టరట! 350 ఏళ్లుగా వింత ఆచారం!
ఈ ఊర్లో ఇంటి దగ్గర పెళ్లి చేస్తే పిల్లలు పుట్టరట! 350 ఏళ్లుగా ఆలయాల్లోనే వివాహం!
Ram Navami 2026 Date : శ్రీరామ నవమి మార్చి 26 or 27? రాములోరి కళ్యాణం ఎప్పుడు?
శ్రీరామ నవమి మార్చి 26 or 27? రాములోరి కళ్యాణం ఎప్పుడు?
2026 మార్చి 25 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
2026 మార్చి 25 రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !
Embed widget