Vastu Tips: మీ ఇంట్లో డబ్బులు నిలవాలంటే హనుమాన్ విగ్రహాన్ని ఈ దిశలో పెడితే చాలు
Vastu Tips: హనుమంతుడి విగ్రహం ఇంట్లో ఎక్కడ ఉంచాలనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది.
Vastu Tips: విధేయత, శౌర్యం, బలం ప్రదర్శించడంలో హనుమంతుడు ప్రతీకగా నిలుస్తాడు. అందుకే హనుమంతుడిని హిందూవులు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి మనకు రక్షకుడిగా, దేవుడిగా నిలిచే హనుమంతుడిని భక్తులు భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు. చాలా మంది భక్తులు హనుమాన్ ఆశీస్సులు, మార్గదర్శకత్వం కోసం ఇంట్లో ఆయన విగ్రహాన్ని ఉంచుకుంటారు. అయితే హనుమతుండి విగ్రహం ఇంట్లో ఎక్కడ ఉంచాలనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే హనుమాన్ విగ్రహం శక్తి ప్రవాహాన్ని, పర్యావరణ సామరస్యాన్ని ప్రభావితం చేస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో హనుమాన్ విగ్రహాన్ని ఉంచేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఈ నియమాలు పాటిస్తే ఆ ఇంట్లో విజయం, సంపద నిలుస్తుంది. మరి ఎలాంటి నియమాలో పాటించాలో తెలుసుకుందామా?
హనుమాన్ విగ్రహం ఉంచే దిశలు:
ఇంట్లో హనుమాన్ విగ్రహం పెట్టుకుంటే దక్షిణ ముఖంగా పెట్టాలి. ఈదిశ హనుమంతుడికి ధైర్యం, శక్తితో ముడిపడి ఉంటుంది. విగ్రహాన్ని దక్షిణం వైపు ఉంచితే ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తాడు. ఇది విశ్వాసం, బలాన్ని కూడా పెంచుతుంది.
ఇంటికి ఎదురుగా :
మీ ఇల్లు తూర్పు లేదా దక్షిణం వైపు ఉంటే ఇంట్లో ప్రవేశించే మార్గంలో ఆంజనేయుడి విగ్రహం ఉంచవచ్చు. ఈ దిశలో ఉంచితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. అనారోగ్యాలకు, దరిద్రానికి కారణమయ్యే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.
తూర్పు ముఖంగా:
తూర్పు దిశ ఉదయించే సూర్యూనితో ముడిపడి ఉంటుంది. కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. విగ్రహాన్ని తూర్పు ముఖంగా ఉంచితే దానికి ఉదయించే సూర్యకాంతి అందుతుంది. స్వామివారు ఉన్న గదికి శక్తిని అందిస్తుంది.
ఈ పనులు చేయాలి..ఈ పనులు చేయకూడదు:
⦿ ఇంట్లో హనుమంతుడిని విగ్రహం ఏర్పాటు చేసుకుంటే అనువైన ప్రదేశంతోపాటు ఒక బలిపీఠం లేదా ప్రత్యేకంగా పూజగది ఉండాలి. పూజగది అయితే శుభ్రంగా ఉండాలి.
⦿ విగ్రహం ఏర్పాటు చేసిన పరిసర ప్రాంతం శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శుభ్రత పాటిస్తే శక్తిని స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తుంది.
⦿ హనుమాన్ విగ్రహం కానీ చిత్రపటం కానీ పడక గదిలో ఉంచకూడదు. ఎందుకంటే బెడ్ రూమ్ విశ్రాంతి తీసుకునే స్థలం. కాబట్టి ఇక్కడ హనుమాన్ కు సంబంధించిన ఫొటోలు పెట్టరాదు.
⦿ నిలబడి లేదా ఎగురుతున్న భంగిమలో ఉన్న హనుమంతుని విగ్రహాన్ని కొనుగోలు చేయాలి. నిద్రిస్తున్న హనుమాన్ విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు.
⦿ విగ్రహం చుట్టు ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. చిందరవందరగా ఉండే స్థలం శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.
⦿ ప్లాస్టిక్ లేదంటే ఇతర సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. వీలైతే విగ్రహానికి దైవిక శక్తిని నింపేందుకు ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ ఆచారంపై మార్గదర్శకత్వం కోసం పూజారుల సలహా కూడా తీసుకోవచ్చు.
⦿ మీ ఇంట్లో అతిథులు కూర్చుండే గదిలో సీతారామ లక్ష్మణులకు నమస్కరిస్తున్న హనుమాన్ ఫొటోను ఉంచాలి. శ్రీరాముడిపాదాలవద్దహనుమంతుడు కూర్చొన్న ఫొటోను ఉంచాలి. లేదంటే శ్రీరాముడి భజన చేస్తున్న హనుమంతుని ఫొటోను కూడా ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉండే హనుమంతుని ఫొటోలో శ్రీరాముని భజన చేస్తున్న భంగిమలో ఉంటే మీకు భక్తి, విశ్వాసం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వీటి కారణంగా మీరు జీవితంలో విజయాలను సాధించడంతోపాటు ఏకాగ్రత శక్తి కూడా పెరుగుతుంది.
Also Read: భక్తులకు అలర్ట్, తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలపై టీటీడీ ప్రకటన
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.