News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ABP premium story Premium

Vastu Tips In Telugu: ఇంట్లో డబ్బు ఉంచేటప్పుడు ఈ త‌ప్పులు చేస్తే వాస్తు దోషాలు త‌ప్ప‌వు!

Vastu Tips In Telugu: ఇంట్లో డబ్బు ఉంచేటప్పుడు వాస్తుకు సంబంధించిన ఈ తప్పులు చేయకండి. మీ ఇంట్లో ఐశ్వర్యం ఉండాలంటే, మీరు ఈ చిన్నచిన్న‌ వాస్తు దోషాలను నివారించాలి.

FOLLOW US: 
Share:

Vastu Tips In Telugu: అందరం మన జీవితంలో ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటాం, దాని కోసం కష్టపడతాం. సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి, మనకు తగినంత డబ్బు అవ‌స‌రం. అయితే చాలాసార్లు కష్టపడి పనిచేసినా మన ఇంట్లో డబ్బులు సరిగ్గా ఉంచుకోకపోవడం వల్ల ఆ ఆర్థిక ప్రయోజనం మనకు అందదు. లక్ష్మీదేవి అనుగ్రహం జీవితంలో కొనసాగాలంటే, ఆమెకు తగిన గౌరవం ఇవ్వడం ముఖ్యం. డబ్బును ఎక్క‌డ‌ప‌డితే అక్కడ ఉంచడం లేదా కొన్ని చిన్న విషయాలను విస్మరించడం కార‌ణంగా డబ్బు కోల్పోయేలా చేస్తుంది. అందువ‌ల్ల‌ ఇంట్లో డబ్బును ఉంచేటప్పుడు వాస్తు సంబంధిత తప్పులను ఎలా నివారించాలో తెలుసుకోండి.

చిరిగిన‌, పాత నోట్లు
చాలా సార్లు మ‌నం మ‌న‌ నగదు మొత్తాన్ని కలిపి ఉంచుతాము. కానీ మీరు డబ్బు ఉంచేట‌ప్పుడు చిరిగిపోయిన లేదా చాలా పాత నోట్లను ఉంచకూడదని గుర్తుంచుకోండి. మీ వద్ద అలాంటి నోట్లు ఉంటే, వాటిని పక్కన పెట్టండి లేదా మొదట వాటిని ఖర్చు చేయండి. మీకు కావాలంటే, బ్యాంకుకు వెళ్లి అలాంటి నోట్లను మార్చుకోవచ్చు.

Also Read : ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టే సూపర్ టిప్స్ ఇవే!

ప్రతికూల విషయాలు
మనం మన ఇంట్లో డబ్బు ఉంచినప్పుడల్లా, రోజూ అలాగే ఉంచే శ‌క్తి క‌ల‌గాల‌ని ల‌క్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటాము. కానీ ప్రతికూల విషయాలను డబ్బుతో ఉంచుకుంటే అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, మీరు మీ డబ్బును ఏ అల్మారాలో ఉంచినా, అందులో ఏదైనా కోర్టు కేసు లేదా కుటుంబ వివాదాలు మొదలైన వాటికి సంబంధించిన పత్రాలను ఉండ‌కుండా చూసుకోండి.

డబ్బు, ఔషధాలు కలిపి ఉంచడం
చాలాసార్లు ప్రజలు తమ ఐరన్‌ సేఫ్ లేదా మనీ అల్మారాలో మందులు మొదలైనవాటిని కూడా ఉంచుకుంటారు. కానీ వాస్తుశాస్త్రంలో దీనిని స‌రైన ప‌నిగా ప‌రిగ‌ణించ‌రు. మందులు తీసుకోవడం అంటే వ్యాధితో పోరాడడం. మీ ఆర్థిక పరిస్థితి బాధాకరంగా మారాలని మీరు ఎప్పటికీ కోరుకోకూడ‌దు. కాబట్టి, మీరు న‌గ‌దు ఉంచే అల్మారా, ఐర‌న్ సేఫ్‌లో మందులను ఉంచకుండా చూసుకోండి.

రంగును విస్మరించడం
మ‌నం డబ్బు సుర‌క్షితంగా ఉంచడానికి ఉప‌యోగించే ఐర‌న్ సేఫ్‌, అల్మారా, క‌ప్ బోర్డుల‌కు మల్టీకలర్‌ని ఉపయోగిస్తాము. కానీ డబ్బు ఉంచడానికి అల్మారా కోసం లోహ రంగులు ఉపయోగించడం చాలా మంచిదని భావిస్తారు. మీరు మెటల్, గోల్డెన్ లేదా లేత బూడిద రంగు వంటి రంగుల అలమారాలను ఎంచుకోవచ్చు. నలుపు లేదా ముదురు ఎరుపు రంగుల వార్డ్‌రోబ్‌ను ఎప్పుడూ ఎంచుకోవద్దు.

Also Read : వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలు ప్రతిమను ఏ దిశలో ఉంచాలో తెలుసా!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మీరు మీ న‌గ‌దు భ‌ద్ర‌ప‌ర‌చ‌డానికి ఇంట్లో అల్మారా లేదా ఒక ప్రత్యేక స్థలాన్ని తయారు చేసినట్లయితే, మీరు దానిని సరిగ్గా ఉంచాలి. మీ అల్మారా లేదా ఐర‌న్‌ సేఫ్ ముందు వేరే ఎలాంటి తలుపు ఉండకూడదని గుర్తుంచుకోండి. ఇది కాకుండా, న‌గదు ఉంచిన అల్మారా, ఐర‌న్ సేప్‌ తలుపు ముందు టాయిలెట్ తలుపు ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇది అస‌లు మంచిది కాదు.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

Published at : 03 Oct 2023 09:53 AM (IST) Tags: vastu tips in telugu Vastu Mistakes Keeping Money Mutilated Notes Negative Things

ఇవి కూడా చూడండి

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో  ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Election Result 2023 Astrology: ఎన్నికల ఫలితాల్లో ఈ రాశులవారికి విజయం - వారికి అపజయం, గ్రహాలు చెప్పే ఎగ్జిట్ పోల్ ఇదే!

Horoscope Today December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

Horoscope Today  December 23rd, 2023: ఈ రాశులవారికి ఆనందం - ఆ రాశులవారికి ఆందోళన, డిసెంబరు 03 రాశిఫలాలు

Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

Astrology: ఈ 5 రాశులవారు అపర చాణక్యులు, వ్యూహం రచిస్తే తిరుగుండదు!

Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

Margashira Masam 2023 Starting Ending Dates: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో  ముఖ్యమైన రోజులివే!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

Christmas Celebrations 2023: ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలు ఈ చర్చిల్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసుకోండి!

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి,  తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
×