Vastu-Spirituality: మీ బెడ్‌రూమ్‌ నుంచి బాత్‌రూం వరకు అంతా ఆ ఎనిమిది మంది డైరెక్షన్‌లోనే, బిగ్‌ బాస్‌ కంటే ఎక్కువ ఫోకస్ ఉంటుంది

ఈ ఎనిమిది మంది దేవుళ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇంట్లో కష్టాలు తప్పవా... అణువణువూ ఇంటిని నిరంతరం పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చే ఈ దేవతలను ఏమంటారు.. వారి కరుణ లేకపోతే పరిస్థితేంటి..

FOLLOW US: 

దిక్కులు ఎన్ని అనగానే...తూర్పు ,పడమర ,ఉత్తరం ,దక్షిణం అని ఠక్కున చెబుతారు. అయితే దిక్కులతో పాటూ నాలుగు మూలలు కూడా ఉన్నాయి.  నాలుగు ప్రధాన దిక్కులతో పాటు.. నాలుగు దిక్కుల మూలలకు కాపలాగా ఉండే వారినే అష్టదిక్పాలకులు అంటారు.

ఏ దిక్కుకి ఎవరు పాలకుడు
తూర్పు దిక్కు పాలకుడు ఇంద్రుడు-ఆయుధం వజ్రాయుధం-వాహనం ఐరావతం
పడమర దిక్కు పాలకుడు వరుణుడు- ఆయుధం పాశం- వాహనం మొసలి
ఉత్తర దిక్కు పాలకుడు కుబేరుడు- ఆయుధం ఖడ్గం- వాహనం నరుడు
దక్షిణం దిక్కు పాలకుడు యముడు-ఆయుధం దండం- వాహనం ఎద్దు
ఆగ్నేయం దిక్కు పాలకుడు  అగ్ని-ఆయుధం శక్తి- వాహనం రాం
నైరుతి దిక్కు పాలకుడు నిరృతి- ఆయుధం కుంతం- వాహనం పిశాచం
వాయువ్యం  దిక్కు పాలకుడు వాయువు-ఆయుధం ధ్వజం- వాహనం జింక
ఈశాన్యం దిక్కు పాలకుడు ఈశానుడు-ఆయుధం త్రిశూలం- వాహనం ఎద్దు

Also Read: గంజాయి ఇక్కడ నిషేధం-అక్కడ ప్రసాదం
అష్టదిక్పాలకుల భార్యలు
ఇంద్రుని భార్య శచీదేవి
అగ్నిదేవుని భార్య స్వాహాదేవి
యముని భార్య శ్యామలాదేవి
నిర్భతి భార్య దీర్ఘాదేవి
వరుణుని సతీమణి కాళికాదేవి
వాయుదేవుని భార్య అంజనాదేవి
కుబేరుని భార్య చిత్రరేఖాదేవి
ఈశానుని భార్య పార్వతీదేవి

Also Read: పురుషులు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే దాంపత్య సమస్యలు తప్పవట
పురాతన ఆలయాలలోని పైకప్పుల మీద  కూడా ఈ అష్టదిక్పాలకుల ప్రతిమలు ఉండటాన్ని గమనించవచ్చు. ఈ అష్టదిక్పాలకులను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. వీరితో పాటూ ఊర్ధ్వ దిక్కుకి బ్రహ్మనూ, అధో దిక్కుకు విష్ణువునూ పాలకులుగా భావిస్తారు. అష్టదిక్పాలకులు ఆధీనంలోనే ఇల్లు ఉంటుంది. నాలుగు మూలలు, నాలుగు దిక్కుల ఆధారంగానే  ఇంటి వాస్తు నిర్ణయిస్తారు.ఏ వైపు తిరిగి తినాలి, ఎటువైపు తలపెట్టి నిద్రించాలి అనేవి కూడా ఈ అష్టదిక్పాలకుల ఆధారంగానే నిర్ణయిస్తారు. అందుకే ప్రధాన పూజల్లో వాస్తు మండపం వేసి వాస్తు దేవతలైన అష్టదిక్పాలకుల్ని ఆవాహనం చేస్తారు. వీరిని ప్రసన్నం చేసుకుంటే ఇంట్లో, వ్యక్తిగత జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని చాలామంది విశ్వాసం.

అష్టదిక్పాలస్తోత్రం 

శ్రీ ఇంద్రస్తుతి
ఐరావతగజారూఢం స్వర్ణవర్ణ కిరీటినం
సహస్రనయనం శక్రం వజ్రపాణిం విభావయేత్

శ్రీ అగ్నిస్తుతి
సప్తార్చిషం చ బిభ్రాణమక్షమాలాం కమండలం
జ్వాలమాలాకులం రక్తం శక్తిహస్తం చకాసతం

శ్రీ యమస్తుతి
కృతాంతం మహిషారూఢం దండహస్తం భయానకం
కాలపాశధఱం కృష్ణం ధ్యాయేత్ దక్షిణదిక్పతిం

శ్రీ నిరృత్య స్తుతి
రక్తనేత్రం శవారూఢం నిలోత్పలదలప్రభం
కృపాణపాణిమస్రౌఘం పిబంతం రాక్షసేశ్వరం

వరుణ స్తుతి
నాగపాశధరం హృష్టం రక్తౌఘద్యుతివిగ్రహం
శశాంకధవలం ధ్యాయేత్ వరుణం మకారాసనం

శ్రీ వాయుస్తుతి
ఆపీతం హరితచ్ఛాయం విలోలధ్వజధారిణం
ప్రాణభూతంచ భూతానాం హరిణస్థం సమిరణం

శ్రీ కుబేరస్తుతి
కుబేరం మనుజాసీనం సగర్వం గర్వవిగ్రహం
స్వర్ణచ్ఛాయం గదాహస్తముత్తరాధిపతిం స్మరేత్

శ్రీ ఈశాన స్తుతి
వృషభారూఢం త్రిశూలం వ్యాలధారిణం
శరచ్చంద్రసమాకారం త్రినేత్రం నీలకంఠకం

అష్టదిక్పాలస్తోత్రం సంపూర్ణం

Published at : 05 Mar 2022 06:47 AM (IST) Tags: Kubera Indra Yama Varuna అష్టదిక్పాలకులు Agni vayu astadikpalakas

సంబంధిత కథనాలు

Panchang 30 June 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం,  గురువారం పఠించాల్సిన మంత్రం

Panchang 30 June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, గురువారం పఠించాల్సిన మంత్రం

Horoscope 30th June 2022: ఈ రాశివారి చేతిలో డబ్బు నిలవదు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 30th June  2022: ఈ రాశివారి చేతిలో డబ్బు నిలవదు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Karimnagar: బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయం చూశారా? ఒకే రాయి కొండపై గుడి నిర్మాణం - ప్రత్యేకతలు ఏంటంటే

Karimnagar: బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయం చూశారా? ఒకే రాయి కొండపై గుడి నిర్మాణం - ప్రత్యేకతలు ఏంటంటే

Temples In AP: ఏపీలో దేవాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం- అధికారులకు ఆగస్టు వరకే డెడ్‌లైన్‌

Temples In AP: ఏపీలో దేవాలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం- అధికారులకు ఆగస్టు వరకే డెడ్‌లైన్‌

Horoscope 29th June 2022: ఈ రాశివారికి గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 29th June  2022:  ఈ రాశివారికి గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌!

Relief For Amaravati Employees : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Relief For Amaravati Employees  : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?