అన్వేషించండి

Srivari Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆర్జిత సేవా టికెట్లు విడుదల, కొనసాగుతోన్న రద్దీ

TTD News: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (ఆగస్ట్ నెల కోటా)ను టీడీపీ విడుదల చేసింది. అటు, శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

TTD Released Arjitha Seva Tickets: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తులకు అలర్ట్. ఆగస్ట్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను (Srivari Arjitha Seva Tickets) టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయగా ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకూ భక్తులు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ టిెకెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in సైట్ లో బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాలని.. వారికి లక్కీ డిప్ లో టికెట్లు జారీ అవుతాయని పేర్కొన్నారు. అలాగే, శ్రీవారి ఆలయంలో ఆగస్ట్ 15 నుంచి 17వ తేదీ వరకూ నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల చేశారు.

మిగిలిన టికెట్లు ఎప్పుడంటే.?

  1. ఈ నెల 23న ఆగస్ట్ నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల.
  2. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించి ఆగస్ట్ నెల ఆన్ లైన్ కోటాను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
  3. అలాగే, ఆగస్ట్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
  4. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్ట్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
  5. అలాగే, తిరుమల, తిరుపతిల్లో ఆగస్ట్ నెల గదుల కోటాను ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
  6. ఈ నెల 27న తిరుమల - తిరుపతి శ్రీవారి సేవా కోటాను ఉదయం 11 గంటలకు నవనీత సేవకు సంబంధించి టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.

భక్తుల రద్దీ

మరోవైపు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. వెలుపలి శిలాతోరణం వరకూ దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 6 గంటలు, సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీడీపీ అధికారులు తెలిపారు. లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు చెప్పారు. తితిదే భద్రతాధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, శుక్రవారం 71,510 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా.. 43,199 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

Also Read: Post-Poll Violence In AP : పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు ప్రారంభం- నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

14-10-2026 బుధవారం రాశిఫలాలు: కర్కాటకానికి జాక్‌పాట్, సింహానికి సవాళ్లు, కన్యకు శుభం!
14-10-2026 బుధవారం రాశిఫలాలు: కర్కాటకానికి జాక్‌పాట్, సింహానికి సవాళ్లు, కన్యకు శుభం!
14-10-2026 బుధవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
14-10-2026 బుధవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
Navaratri Day 4 : ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ అలంకరణలో అమ్మవారు! ఆదిశక్తి పూర్ణ స్వరూపం, శత్రువులపై విజయం, భయాలు దూరం!
ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ అలంకరణలో అమ్మవారు! ఆదిశక్తి పూర్ణ స్వరూపం, శత్రువులపై విజయం, భయాలు దూరం!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!
నవరాత్రులలో నవ దుర్గలు, నవ నైవేద్యాలు..వాటి విశిష్టత తెలుసుకోండి!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget