అన్వేషించండి

TTD US Srivari Kalayanutsavam : అమెరికాలో ఉంటున్నారా? ఇదిగో టీటీడీ నిర్వహించి శ్రీవారి కల్యాణోత్సవాల షెడ్యూల్

అమెరికాలో శ్రీవారి కల్యాణోత్సవాల షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. ఆయా ప్రాంతాల్లోని శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనవచ్చని ఆహ్వానించింది.

TTD US Srivari Kalayanutsavam :  అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగు వారి కోసం శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్ణయించాయి.  జూన్ 18 నుంచి జూలై 9వ తేదీ వరకు ఎనిమిది నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించినట్లుగా  టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ( YV Subba Reddy ) వెల్లడించారు. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల ఇతర దేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని పరిస్థితి ఏర్పడింది . అందుకే   భక్తుల కోరిక మేరక..   సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM Jagan ) ఆదేశం మేరకు అమెరికాలోని భక్తుల కోసం టీటీడీ శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని నిర్ణయించామని టీటీడీ ప్రకటించింది. 

ప్రవాస భారతీయ సంఘాల సహకారంతో  టీటీడీ శ్రీనివాస కల్యాణోత్సవాలు 

టీటీడీ ( TTD ) నిర్వహించబోతున్న శ్రీనివాస కల్యాణాలకు అమెరికాలోని ప్రవాస భారతీయులు సహకరించనున్నారు. అక్కడి పలు సంఘాలు ఈ మేరకు టీటీడీకి హామీ ఇచ్చాయి.   ఆంధ్రప్రదేశ్ ప్రవాస భారతీయుల అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామన్నారు. అనుమతులు, ఏర్పాట్లు, కల్యాణోత్సవాల నిర్వహణలో వారు సహకరిస్తున్నారు. అక్కడి సంఘాలతో మాట్లాడిన తర్వతా తేదీలు కూడా ఖరారు చేశారు. 

జూన్ 18 నుంచి ప్రారంభం జూలై 9 వరకూ పలు నగరాల్లో కల్యాణోత్సవాలు

జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియాటెల్, 25న డల్లాస్, 26న సెయింట్ లూయిస్, 30న చికాగో నగరాల్లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.  అలాగే జూలై 2న న్యూ ఆర్లిన్, 3న వాషింగ్టన్ డిసి, 9వ తేదీ అట్లాంటా నగరాల్లో శ్రీవారి కళ్యాణాలు ( Sri Vari Kalyanam ) జరుగుతాయన్నారు.. ఇతర దేశాల నుంచి కూడా తమ ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని విజ్ఞప్తులు వచ్చాయని వాటిని కూడా పరిశీలిస్తామని సుబ్బారెడ్డి చెబతున్నారు. ప్రపంచం వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉన్నాయన్నారు. 

కరోనా తర్వాత ఇప్పుడు బయట దేశాల్లో నిర్వహణ 

టీటీడీ నుంచి పండితులు, అర్చకులు వెళ్లి ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహించడం చాలా కాలంగా జరుగుతోంది. అయితే కరోనా కారణంగా కొంత కాలంగా ఇవి జరగలేదు. ప్రవాస భారతీయుల సహకారంతో వీటిని మళ్లీ ప్రారంభించనున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

అక్టోబర్ 29 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - అదృష్టం మీ వెంటే!
అక్టోబర్ 29 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - అదృష్టం మీ వెంటే!
అక్టోబర్ 29 రాశిఫలాలు: సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల వారికి అదృష్టం ఎలా ఉంది?
అక్టోబర్ 29 రాశిఫలాలు: సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల వారికి అదృష్టం ఎలా ఉంది?
అక్టోబర్ 29 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం...మీ రాశికి ఎలాంటి ఫలితాలు?
అక్టోబర్ 29 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం...మీ రాశికి ఎలాంటి ఫలితాలు?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?
'ఆదర్శ కుటుంబం' ఈవెంట్‌లో త్రివిక్రమ్ ప్రస్తావించిన భగవద్గీత, ఉద్ధవగీత: శ్రీకృష్ణుడి బోధనల్లో అసలు వ్యత్యాసం ఏంటి?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget