By: ABP Desam | Updated at : 06 Oct 2021 07:55 PM (IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
దేవదేవుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. కరోనా నిబంధనల కారణంగా ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా అర్చకులు అంకురార్పణ నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలోకి సేనాధిపతి వారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామి వారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ప్రధాన ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి.. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయని నమ్ముతారు.
గురవారం సాయంత్రం 5.10 నుండి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు.. ఆ తరువాత రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవను ఆలయ అర్చకులు ఏకాంతంగా శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు. ఎనిమిదోతేదీ శుక్రవారం ఉదయం చిన్నశేష వాహనం, సాయంత్రం హంస వాహన సేవ ఉంటుంది. తొమ్మిదో తేదీన ఉదయం సింహ వాహనం, తర్వాత స్నపన తిరుమంజనం, రాత్రికి ముత్యపుపందిరి వాహన సేవ ఉంటుంది.
పదో తేదీన ఆదివారం కల్పవృక్ష వాహనసవ ఉంటుంది. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం.. సాయంత్రం సర్వభూపాలవాహన సేవ ఉంటుంది. పదకొండో తేదీన ఉదయం మోహినీ అవతారంతో శ్రీవారు దర్శనమిస్తారు. సాయంత్రం గరుడ సేవ ఉంటుంది. ఏకాంతంగా నిర్వహిస్తున్నందున భక్తుల్ని అనుమతించరు. పన్నెండో తేదీన మంగళవారం హనుమంత వాహన సేవ ఉంటుంది. ఇక మధ్యాహ్నం స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహన సేవ ఉంటుంది. రాత్రికి గజ వాహనం మీద శ్రీవారు దర్శనమిస్తారు.
పదమూడో తేదీన బుధవారం ఉదయం సూర్యప్రభవాహనం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, రాత్రికి చంద్ర ప్రభవాహన సేవ ఉంటుంది. పధ్నాలుకో తేదీన రథోత్సవానికిబ దులుగా సర్వభూపాల వాహనసేవ. రాత్రికి అశ్వ వాహనసేవ నిర్వహిస్తున్నారు. ఇక చివరి రోజు పదిహేనో తేదీన పల్లకీ ఉత్సవం.. తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్నారు. ఉదయం 8 నుండి 11 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. రాత్రికి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
Weekly Horoscope (03-09 April): ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!
వారఫలాలు ( ఏప్రిల్ 03 నుంచి 09 ): ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు
ఏప్రిల్ 2 రాశిఫలాలు, ఈ రాశివారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్ లో ప్రయోజనకరంగా ఉంటుంది
Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!
Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే
Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్
SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం