అన్వేషించండి

Spirituality: పదహారణాల తెలుగు అమ్మాయి అని ఎందుకంటారు , ఎలా ఉంటే అనాలి

లంగాఓణి వేసుకున్న అమ్మాయిని చూసి తెలుగుదనం ఉట్టిపడుతోంది అంటారు. పదరహారణాల తెలుగమ్మాయిలా ఉందంటారు. ఇంతకీ పదహారణాల తెలుగమ్మాయి అని ఎందుకంటారో తెలుసా

పదాహారణాల తెలుగు అమ్మాయి అంటే పదహారేళ్ళ తెలుగు అమ్మాయి అని పొరపడే వాళ్ళు చాలా మంది ఉంటారు.  తెలుగు సంస్కృతిని అచ్చంగా, కల్తీ లేకుండా, ఇతర సంస్కృతుల ప్రభావం లేకుండా ప్రతిబింబించే అమ్మాయిని ఊహించుకుని పదహారణాల తెలుగమ్మాయి అంటారు. అంతా ఈ మాట ఉపయోగిస్తారు కానీ...మరి పదహారణాల తెలుగమ్మాయి అని ఎందుకంటారో తెలియాలంటే పదహారణాలు అంటే ఏంటో తెలియాలి. 

పూర్వం మన కరెన్సీ అణాల రూపంలో ఉండేది.  ఆ తర్వాత కాలంలో రూపాయి వచ్చింది.  రూపాయి అంటే వంద పైసలు. మరి అణాలను పైసలుగా, పైసలను అణాలుగా మార్చలంటే ఎలా. పదహారణాలు అంటే ఎంతఅవుతుంది. 
ఒక అణా అంటే = 6.25 పైసలు..అంటే రూపాయిలో పదహారో వంతు
చారాణా (చార్, అణా) = 4 * 6.25 =25 పైసలు
ఆటాణా (ఆట్, అణా) = 8 * 6.25 = 50 పైసలు
బారాణా (బారహ్, అణా) = 12 * 6.25 = 75 పైసలు

Also Read: మీ నక్షత్రం ప్రకారం ఇంటి ఆవరణలో పెంచాల్సినవి .. ఆవరణలో ఉండకూడని చెట్లు ఇవే..

పదహారణాలు అంటే 16 * 6.25 = 100 పైసలు. అంటే నిండు రూపాయి. లేదా నూటికి నూరు శాతం (100%). 99.9999..% కూడా 100% కి సమానం కాదు. ఇక పదహారణాల తెలుగమ్మాయంటే నూటికి నూరుశాతం తెలుగమ్మాయి, నిండైన తెలుగమ్మాయి, సంపూర్ణమైన తెలుగమ్మాయి అని చెప్పాలి. తన భాషలో, భావనలో, నడకలో, నడతలో, ఆహార్యంలో, వస్త్ర ధారణలో  ప్రతివిషయంలో తెలుగుదనాన్ని మాత్రమే నింపుకున్న అమ్మాయిని పదహారణాల తెలుగమ్మాయి అంటారు. 

పదహారు అణాలు కలిస్తే 100 పైసలు అయినట్టే... పదహారు అలంకారాలను కలిగి ఉన్న అమ్మాయిని పదహారణాల తెలుగమ్మాయి అంటారు.

స్త్రీ 16 అలంకారాలు

  1. దంతధావనం
  2. నలుగుపెట్టి స్నానం
  3. పసుపు రాసుకోవడం
  4. చీర, రవిక ధరించడం
  5. కాళ్లకు పారాణి
  6. జుట్టు చక్కగా దువ్వుకోవడం
  7. జడకి నిండుగా పూలు పెట్టుకోవడం
  8. పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం
  9. బుగ్గన చక్కటి చుక్క
  10. నుదిటిన బొట్టు
  11. చేతులకు గోరింటాకు
  12. తాంబూలం
  13. పెదవులకి ఎర్రటి రంగు
  14. కళ్లకి కాటుక
  15. సర్వాభరణ అలంకరణ
  16. పెళ్లైన స్త్రీకి మంగళసూత్రం, మెట్టెలు, నల్లపూసలు వేసుకోవడం

Also Read:ఎవరీ రామానుజులు, ఆయన ఏం చెప్పారు, సమాజం-సమానత్వం కోసం ఏం చేశారు..

టాప్ హెడ్ లైన్స్

సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
సూర్యగ్రహణం రాహు యోగం: ఈ 4 రాశులవారికి ఆగష్టులో 15 రోజులు కఠిన పరీక్ష!
01-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
01-08-2026 శనివారం మీ రాశిఫలాలు!
ఆగస్టు 2026: నాగ పంచమి, రక్షాబంధన్ సహా శ్రావణ మాసంలో గ్రహణాలు, పండుగలు, వ్రతాల పూర్తి జాబితా!
ఆగస్టు 2026: నాగ పంచమి, రక్షాబంధన్ సహా శ్రావణ మాసంలో గ్రహణాలు, పండుగలు, వ్రతాల పూర్తి జాబితా!
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget