అన్వేషించండి

Ramadan 2026 Date: ఈ ఏడాది రంజాన్‌ మాసం ప్రారంభం, విశిష్టత, ఖురాన్ విశేషాలు తెలుసుకోండి!

Ramadan 2026 Starting Date India: చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్ క్యాలెండర్ లో 9వ నెల రంజాన్. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు మొదలవుతాయి. ముస్లింలకు ఈ నెల ఎందుకు పవిత్రం?

Ramadan 2026: ఇస్లామిక్ క్యాలెండర్లో ప్రకారం తొమ్మిదో నెల రంజాన్. తెలుగు నెలలు అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి తో మొదలవుతాయి...ఇస్లామిక్ నెలలు నెలవంక దర్శనంతో ప్రారంభమవుతాయి. ప్రతి నెలా 29 రోజులు లేదా 30 రోజులుంటుంది. ఇండొనేసియా నుంచి మొరాకో వరకు ఉన్న చాలా  ముస్లిం దేశాల్లో నెలవంక ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో కనిపించే అవకాశం ఉంది. మక్కాలో నెలవంక కనిపించే సమయాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. సౌదీ అరేబియాతో సహా పలు గల్ఫ్‌ దేశాల్లో రంజాన్‌ నెలవంక ఫిబ్రవరి 17 మంగళవారం కనిపించింది. దీంతో భక్తిశ్రద్ధలకు ప్రత్యేకమైన పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైనట్టే. నెలవంక కనిపించిన సమాచారాన్ని సౌదీ అరేబియా ప్రకటించడంతో ..దీనినే  భారతీయ ముస్లింలు ప్రామాణికంగా భావిస్తారు. నెలవంక సౌదీ అరేబియాలో మంగళవారం దర్శనమిచ్చింది..ఈ లెక్కన భారత్ లో ఫిబ్రవరి 18న మొదలవ్వాలి. ఫిబ్రవరి 18 బుధవారం సాయంత్రం నెలవంక కనిపిస్తే రంజాన్ తొలిరోజు అవుతుంది.  UAEకి చెందిన కమిటీ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. ఒమన్, తుర్కియే వంటి దేశాల్లో నెలవంక కనిపించకపోవడంతో ఆ దేశాల్లో ఫిబ్రవరి 19 గురువారం నుంచి రంజాన్ మాసం మొదలవుతుంది.

రంజాన్ మాసం ముస్లింలకు ఎందుకు ప్రత్యేకం అంటే... వారి పవిత్ర గ్రంథం ఖురాన్ అవిర్భవించింది ఈ నెలలోనే. కఠినంగా ఆచరించే 'రోజా' ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో ఈ నెల సాగుతుంది.  మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం ఈ మాసాన్ని సృష్టించాడని విశ్వాసం. ఈ నెల రోజులు చేసే దీక్షలతో శరీరం, మనసులో మలినాలు ప్రక్షాళన అవుతాయని, పాపాలు దహించుకుపోతాయని విశ్వసిస్తారు. సూర్యోదయ సమయంలో ‘సహర్‌’ నుంచి సూర్యాస్తమయం 'ఇప్తార్‌' వరకు నీళ్లు కూడా తీసుకోకుండా కఠిన ఉపవాసం చేస్తారు
 
రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు చేసేందుకు వయసుతో సంబంధం లేదు..కేవలం వారి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా నియమాలు పాటిస్తారు. ఈ దీక్షలతో బలహీనతలు, వ్యసనాలు జయించవచ్చని బోధిస్తారు మత గురువులు. సాయంత్రం వరకూ ఉపవాసం ఆచరించి ముందుగా ఖర్జూరం తీసుకుని దీక్ష విరమిస్తారు. అనంతరం హలీమ్ తీసుకుంటారు..రుచికరమైన భోజనం చేస్తారు
 
రంజాన్ నెల రోజులు పెట్టుకుని కాటుకను సుర్మా అంటారు. ప్రవక్త హజరత్‌ మహ్మద్‌ నిత్యం సుర్మా పెట్టుకునేవారట. పౌడర్‌ రూపంలో ఉండే సుర్మాను వారు పెట్టుకోవడంతో పాటూ అతిథులకు కూడా ఇస్తారు. ప్రతి రోజూ నమాజ్ చేసేముందు సుర్మా పెట్టుకుంటారు. ఇది సంప్రదాయం మాత్రమే కాదు కళ్లకు ఆరోగ్యం కూడా. 

ప్రతి శుక్రవారం చేసే నమాజ్ ల కన్నా రంజాన్ నెలలో చేసే నమాజ్ చాలా ప్రత్యేకం. ఈ సమయంలో మసీదుకి వెళ్లలేని వారు ఇంటి దగ్గర స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థనలు చేస్తారు. నమాజ్ పూర్తయ్యాక అంతా అలయ్ బలయ్ చెప్పుకుంటారు. పండుగ రోజు షీర్ ఖుర్మా  అనే వంటాకాన్ని  పంచుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు
 
ఖురాన్ ప్రకారం 

ప్రతి మనిషి తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పేదలకు దానం చేయాలి. అందుకే ఈ నెలలో పండ్లు, గోధుమలు, సేమియా, వస్త్రాలు, బంగారం...ఎవరి స్తోమతకు తగ్గట్టు దానం చేస్తారు. పండుగ వేళ పేదలు కూడా  సంతోషంగా ఉండాలన్నదే దానాల వెనుకున్న ఆంతర్యం
 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
Embed widget