అన్వేషించండి

Pitru Paksham 2026: పితృపక్షంలో ఈ 5 తప్పులు: 7 తరాలకు పితృదోషం తప్పదా?

2026లో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 వరకు పితృపక్షాలు..ఈ 15 రోజులు పితృదేవతలను స్మరించుకుంటారు. ఈ సమయంలో కొన్ని తప్పులు చేస్తే ఆ దోషం ఏడు తరాలు వెంటాడుతుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెద్దలను అవమానిస్తే పితృదోషం కలుగుతుంది; శుభకార్యాలకు ఆటంకం.

Pitru Paksham 2026: సంస్కృత భాషలో పితృ అంటే "పూర్వీకులు", పక్ష అంటే " 15రోజులు" లేదా చాంద్రమాసంలోని ఒక వైపు. పౌర్ణమికి ముందు 15 రోజులు ప్రకాశవంతంగా ఉంటాయి..పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్లో చంద్రుడు క్షీణించి చీకటిగా మారుతాడు. ప్రకాశవంతమైన పక్షం పెరుగుదలకు సూచన అయితే కృష్ణ పక్షం ఆత్మపరిశీలన, ధ్యానం, శుద్ధీకరణ , పరివర్తనకు సూచన. ఏటా గణేష్ నవరాత్రులు ముగిసిన తర్వాత వచ్చే పౌర్ణమి మరుసటి రోజు నుంచి పితృపక్షం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సూర్యుడు ఉత్తరార్ధగోళం నుంచి దక్షిణార్ధగోళానికి మారుతాడు. వేద సంప్రదాయం ప్రకారం దక్షిణ దిశను పితామహులతో సంబంధం ఉన్నదిగా పరిగణిస్తారు. 

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వివాహిత స్త్రీలు పాటించే 4 ముఖ్యమైన ఉపవాసాల తేదీలు ఇవే!

2026లో పితృపక్షాలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 10 వరకు...ఈ రెండు వారాలు పెద్దలను పూజించేందుకు అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు. సంయమనం పాటించాల్సి సమయంగా..మాంసం, మద్యం, మత్తు పదార్థాలు, అధిక తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. పితృదేవతలకు నైవేద్యంగా సమర్పించే ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఉపయోగించకూడదు. గరుడ పురాణం ప్రకారం, పితృ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడవడం, పిండ ప్రదానం చేయడం ఆ కుటుంబానికి మంచి చేస్తుందని, దోషాలు తొలగిస్తుందని నమ్మకం. అయితే ఈ సమయంలో చేయకూడని కొన్ని పనులున్నాయి. అవేంటో తెలుసుకుందాం

పెద్దలను గౌరవించండి

పితృదేవతలకు చేసే కర్మకాండలను పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయడం పితృదోషాన్ని ఆహ్వానించడంతో సమానం. పితృ పక్షం కేవలం దివంగత పూర్వీకులను స్మరించుకునే సమయం మాత్రమే కాదు, కుటుంబ పూర్వీకుల సంప్రదాయాలను గౌరవించే అవకాశం కూడా. అందువల్ల, జీవించి ఉన్న తల్లిదండ్రులను, పెద్దలను అవమానించడం లేదా కఠినమైన మాటలతో లేదా చేతలతో వారిని బాధపెట్టడం చేయవద్దు. అటువంటి అగౌరవం పితృ దోషానికి సంకేతంగా పరిగణిస్తారు.
 
పవిత్రతకు ప్రాధాన్యం

పితృ పక్షంలో, పూజకే కాకుండా ప్రవర్తనా పవిత్రతకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. మోసం, హింస, దూషణలు లేదా అనైతిక కార్యకలాపాలలో పాల్గొనడం వంటివి పితృదేవతలకు కోపం తెప్పిస్తాయి, అందువల్ల శ్రాద్ధ కర్మలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు.

Dussehra 2026: నవరాత్రిలో అద్దెకు 'గర్బా భాగస్వామి'! ప్యాకేజీలు, నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు!

మూగజీవాలను హింసించవద్దు

పితృదేవతలు పక్షులు,  జంతువులలో నివసిస్తారని నమ్ముతారు, కాబట్టి కాకులు, ఆవులు లేదా కుక్కలను తరుమడం లేదా వేధించడం వంటివి చేయకూడదు. పితృ పక్షంలో శ్రాద్ధ కర్మలు చేసేవారు ఆ 15 రోజుల పాటు జుట్టు లేదా గోళ్లను కత్తిరించుకోకూడదు. అంతేకాకుండా పితృ కర్మలు ఆచరించేవారు బ్రహ్మచర్యం కూడా పాటించాలి.

పితృదేవతల ఆగ్రహానికి గురికావొద్దు
 
పితృదేవతలు ఆగ్రహించినట్టైతే  కుటుంబంలో శుభకార్యాలకు ఆటంకం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. వంశ వృద్ధి ఉండదు. కుటుంబ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. కుటుంబంలోని ఏడు తరాలు ఆర్థిక, మానసిక పరిణామాలతో బాధపడతారని నమ్ముతారు.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

 

Frequently Asked Questions

పితృపక్ష కర్మకాండలను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి?

కర్మకాండలను నిర్లక్ష్యం చేయడం పితృదోషాన్ని ఆహ్వానించడంతో సమానం. దీనివల్ల శుభకార్యాలకు ఆటంకం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ అభివృద్ధికి అవరోధాలు ఏర్పడతాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sarva Pitru Amavasya 2026 : అక్టోబర్ 10 అమావాస్య రోజు చేసే ఈ ప్రత్యేక ఈ దానాలతో అదృష్టం మీ సొంతం!
2026 అక్టోబర్ 10 అమావాస్య రోజు చేసే ఈ ప్రత్యేక ఈ దానాలతో అదృష్టం మీ సొంతం!
ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వెనక్కు పిలవొద్దు: రాహువు, వాస్తు రహస్యాలు
ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వెనక్కు పిలవొద్దు: రాహువు, వాస్తు రహస్యాలు
ఈ దసరాకి కొత్త వాహనాలు వద్దా? శుక్ర మూఢమి, పంచకాలు, మంగళవారం ప్రభావం!
ఈ దసరాకి కొత్త వాహనాలు వద్దా? శుక్ర మూఢమి, పంచకాలు, మంగళవారం ప్రభావం!
08-10-2026 గురువారం రాశిఫలం: మకర, కుంభ, మీన రాశుల వారికి ఆర్థిక లాభాలు, అద్భుత అవకాశాలు!
08-10-2026 గురువారం రాశిఫలం: మకర, కుంభ, మీన రాశుల వారికి ఆర్థిక లాభాలు, అద్భుత అవకాశాలు!
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget