Mahashivratri 2024
పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించిన పర్వదినమే శివరాత్రి. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
భోళాశంకరుడంటే భక్తులు మహాప్రీతి. అందుకే ఆయన్ని ఎంత స్తుతించినా తనివి తీరదంటూ పక్షానికి, మాసానికి, ఏడాదికి ఒక్కో శివరాత్రి పేరుతో శివయ్యను ఆరాధిస్తారు. అన్నటికన్నా విశిష్టమైనది మాఘ బహుళ చతుర్థశి రోజు వచ్చే మహాశివరాత్రి మరింత ప్రత్యేకం. ఈ ఏడాది మహా శివరాత్రి మార్చి 8 శుక్రవారం వచ్చింది...ఈ రోజుకున్న విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకోండి....
దేవుళ్లంతా నిత్య అలంకరణలో కనిపిస్తారు కానీ శివుడు ఎందుకు కనిపించడు అనుకుంటున్నారేమో..శివుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు అలంకార ప్రియుడు కూడా. శంకరుడు కూడా సర్వాలంకార భూషితుడే. అయితే ఒక్కో రూపంలో ఒక్కోలా కనిపిస్తాడు. ఆ రూపాలే తత్పురుషం, అఘోరం, సద్యోజాతం, వామదేవం, ఈశానం...వీటి గురించి వివరణాత్మక కథనం
జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వాళ్లే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ ముగ్గురు సర్వ స్వతంత్రులు. వీరిలో పరమేశ్వరుడు ఎందుకు లయకారుడు అయ్యాడో చెప్పే కథనం...
అర్థనారీశ్వరుడు అనగానే పార్వతీపరమేశ్వరులు ఒకే శరీరంలో కలసి ఉన్న రూపం కళ్లముందు మెదులుతుంది. అంటే శరీరంలో సగభాగం పంచివ్వడమే అర్థనారీశ్వర తత్వమా?
ఎన్నో మంత్రాలుండగా శివుడి మంత్రమే ఎందుకు మృత్యుంజయ మంత్రమైంది, అసలు దోసపండుకి మృత్యువుకి సంబంధం ఏంటి. ఈ మంత్రం నిత్యం జపిస్తే ఏమవుతుంది.
పురుషుడి స్వభావం ఆధారంగా స్త్రీ తన స్వభావాన్ని మార్చుకుంటుంది, మార్చుకోవాలి..అదే అర్థనారీశ్వర తత్వం. అలా ఉండడం వల్లే పార్వతీ పరమేశ్వరులు ఆదిదంపతులు అయ్యారు. పంచభూత క్షేత్రాల్లో అమ్మవారిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయా క్షేత్రాల్లో స్వామివారు ఉగ్రరూపంలో ఉంటే అమ్మవారు శాంత స్వరూపిణిగా కొలువై ఉంటారు.. శంకరుడు శాంత రూపంలో ఉంటే పార్వతీ మాత ఉగ్రరూపంలో ఉంటుంది.
పార్వతీ దేవి పరమేశ్వరుడిని ప్రశ్నించడం ఏంటి? పోనీ ఎవ్వరూ లేని సమయం చూసి ఏకాంతంగా మాట్లాడిందా అంటే అదీ కాదు..నిండు కొలువులో అందరి మధ్యా వరుస ప్రశ్నలు సంధించింది. భోళాశంకరుడు కూడా పార్వతి ప్రశ్నలకు ఏమాత్రం కోపగించుకోకుండా చిరునవ్వుతో సందేహాలన్నీ తీర్చాడు. ఇంతకీ ఏ సందర్భంలో పార్వతీ దేవి పరమేశ్వరుడిని ప్రశ్నించింది.. ఆ సందేహాలకు శివుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి
దేవుళ్లంతా అలంకారాలతో దర్శనమిస్తారు. కానీ పరమేశ్వరుడు నిరాకారుడిగా లింగరూపంలో పూజలందుకుంటాడు. శివుడు ఇలా ఉంటాడని భక్తులు భావించే ఆ రూపం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తలపై నెలవంక , ఆభరణంగా భస్మం, మెడలో పాము, చేతిలో ఢమరుకం,త్రిశూలం...ఇలా పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది...ఈ కథనంలో చూడండి...
మారేడు దళాలు లేనిదే శివపూజ సంపూర్ణం కాదు. భోళా శంకరుడికి ఈ దళాలంటే అంత ప్రీతి. త్రిశూలానికి సంకేతం అయిన ఈ దళాలంటే శివుడికి ఎందుకంత మక్కువ?
మహాశివరాత్రి రోజు భక్తులంతా జాగరణ, ఉపవాసం చేస్తారు. అయితే జాగరణ అంటే మేల్కొని ఉంటే చాలనుకుంటారు. కానీ జాగరణ అంటే మేల్కొని ఉండడం కాదు...భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండటం. మహా శివరాత్రి ఈ సందర్భంగా ఉపవాసం, జాగరణ చేసేవారు కొన్ని నియమాలు పాటించాలి..అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మార్చి 08 శివరాత్రి. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి అభిషేకం చేయాలనే ఆశ ప్రతి భక్తుడిలో ఉంటుంది. అయితే రుద్రం రానివారు, నేర్చుకోలేనివారు అభిషేకం ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తారు..వారికోసమే ఈ విధానం...
మహాశివరాత్రి పర్వదినాన శైవ ఆలయాలు భక్తులతో కళకళలాడుతాయి...అభిషేకాల జరుగుతాయి. శివరాత్రి సందర్భంగా ఏపీలో దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలు ఇవే
పరమేశ్వరుడు ఎలా పిలిచినా పలుకుతాడు,పరమేశ్వర అనుగ్రహం అందరిపైనా ఉంటుంది కానీ..మీ రాశిని బట్టి మంత్రం స్మరిస్తే మంచి ఫలితాలు పొందుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి మీ రాశి ప్రకారం ఏం పఠించాలంటే...
మీరు శివరాత్రి రోజున ఉపవాసం ఉంటున్నారా? అయితే మీరు ఉపవాస సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి, పూజకు రెండు రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
అయితే పండుగరోజు శివయ్యకు కొన్ని ఆహారాలను నైవేద్యంగా పెట్టవచ్చు. వాటిని ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శివనిందను భరించలేక సతీదేవి ప్రాణత్యాగం, అమ్మవారి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు ఇవే!
2024 మార్చి 08 మహా శివరాత్రి. ఈ సందర్భంగా బతుకు చిత్రాన్ని కళ్లముందు సాక్షాత్కరించే శివుడి పాటలు మీకోసం. ప్రశాంతంగా ఈ పాటలు వింటే శివుడి సన్నిధిలో ఉన్నట్టే అనిపిస్తుంది భక్తులకు...