Symbolism behind form shiva: దేవుళ్లంతా అలంకారాలతో దర్శనమిస్తారు. కానీ పరమేశ్వరుడు నిరాకారుడిగా లింగరూపంలో పూజలందుకుంటాడు. శివుడు ఇలా ఉంటాడని భక్తులు భావించే ఆ రూపం కూడా ప్రత్యేకంగా ఉంటుంది.  తలపై నెలవంక , ఆభరణంగా భస్మం, మెడలో పాము, చేతిలో ఢమరుకం,త్రిశూలం...ఇలా పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్ధం ఉంది... 


పంచభూతాత్మకుడు 


శివుడు ధరించే పులిచర్మం భూతతత్వాతనికి, తలపై గంగ జలతత్వానికి, మూడో నేత్రం అగ్ని తత్వానికి, విభూది వాయుతత్వానికి, శబ్దబ్రహ్మ స్వరూపమైన ఢమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.


త్రయంబకుడు 


శివుని మూడుకళ్లు కాలాలను(భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ప్రత్యేకంగా మూడో నేత్రం జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానంలో ఉండే ఈ  ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.


Also Read: కైలాసంలో శివుడి సన్నిధిలో ఉన్నామా అనిపించే పాటలివి - వింటే పూనకాలే!


మూడు నామాలు


శివ భక్తులు 3 అడ్డగీతలు ధరిస్తారు. ఈ మూడు నామాలు  జాగృతి, స్వప్న, సుషుప్తి అవస్థలకు చిహ్నం. ఈ మూడు రేఖలను త్రిగుణాత్మకమని, మధ్యలో బిందువు గుణాతీతుడవు అవు అని సూచిస్తుంది. అలాగే త్రిమూర్తులకు బేధం లేదనేందుకు సూచన కూడా ఇదే. 


విభూది


సృష్టి ఎప్పటికైనా నశించేదే..చివరకు మిగిలేది బూడిదే. ఈ దేహం కూడా భస్మం కావాల్సిందే. ఇది తెలుసుకుని మసలుకోమని చెప్పడమే భస్మధారణ ఉద్దేశం. భస్మం పరిశుద్ధతకు కూడా సూచన..


త్రిశూలం


సత్వ రజో తమోగుణాలకు, ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తులకు, మానసిక శారీరక, ఆధ్యాత్మిక శక్తులకు, ఇడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం త్రిశూలం


Also Read: అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయ్యారు!


మెడలో పాము


శంకరుడి మెడలో హానికరమైన పాము ప్రాపంచిక విషయాలకు ప్రతీక. ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాలను జయించడం చాలా కష్టం...అవి మనిషిని వీడి వెళ్లేలేవు..అందుకే వాటిని అదుపులో ఉంచాలని చెప్పేందుకు సూచన. మనదేహంలో   వెన్నెముక పాములా, మెదడు పడగలా ఉంటుంది..ఇది కుండలిని సూచిస్తుంది. 


చంద్రవంక


ఇంకా చెప్పుకుంటే...శివుడి శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి ప్రతీక


గంగాదేవి


తలపై ఉండే గంగాదేవి శాశ్వతత్వానికి  ప్రతీక


Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !


పులిచర్మాన్ని శివుడు ఎందుకు ఆసనంగా చేసుకున్నాడు అనే దానిపై శివపురాణంలో ఓ కథ చెబుతారు.. 
శంకరుడు సర్వసంగ పరిత్యాగి. దిగంబరుడిగా అరణ్యాలు,  శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఓ రోజు ఆ మార్గంలో వెళుతున్న శివుడినిని చూసిన మునికాంతలు.. ఆ తేజస్సుకి,సౌందర్యానికి చూపు తిప్పుకోలేకపోయారు. నిత్యం ఆయన్ను చూడాలనే కాంక్ష మునికాంతల్లో పెరిగింది.  దైవ కార్యాలు, నిత్యకృత్యాలు కూడా శివుడుని తలుచుకుంటూనే చేయసాగారు. తమ భార్యల్లో ఎప్పుడేలేని ఈ మార్పునకు కారణం ఏంటా అని ఆలోచనలో పడిన మునులకు పరమేశ్వరుడిని చూడగానే సమాధానం దొరికింది. తమ భార్యల దృష్టి మరిల్చాడన్న కోపం తప్ప..ఆ దిగంబరుడే సదాశివుడని మరిచిపోయి సంహరించే ఆలచోన చేశారు. తాము స్వయంగా హింసకు పాల్పడలేరు కాబట్టి.. తమ తపోశక్తితో ఓ పులిని సృష్టించి  శివుడుపై ఉపిగొల్పారు. ఆ పులిని సంహరించిన మహాదేవుడు  మునుల చర్య వెనుకున్న ఉద్దేశం గ్రహించి పులితోలుని తన దిగంబర శరీరానికి కప్పుకున్నాడని కథనం. పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక, సంహారకారి, భయానకమైనది...అలాంటి పులి కూడా కాల స్వరూపుడి ఎదుట నిలబడలేదని అర్థం. 


Also Read:  చివరకు మిగిలేది బూడిదే - లయకారుడు చెప్పేది ఇదే!