Upendra UI Movie Troll Song: క‌న్న‌డ సూప‌ర్ స్టార్ ఉపేంద్ర‌.. నా రూటే స‌ప‌రేటు.. అన్న‌ట్లుగా ఉంటాడు. అలా డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటాడు. ఇక గ‌త కొంత‌కాలంగా వెండితెర‌కు దూరంగా ఉన్న ఆయ‌న‌.. స‌రికొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. 'యూఐ (UI)' పేరుతో కొత్త సినిమాలో న‌టించ‌డంతో పాటు.. డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించి.. గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఇటీవ‌ల టీజ‌ర్ కూడా రిలీజ్ చేశారు. రీసెంట్ గా విడుదలైన ‘చీప్ సాంగ్’ ఓ రేంజిలో సంచలనం కలిగించింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరో పాటను విడుదల చేశారు.


సెలబ్రిటీలపై సటైర్లు, ఆకట్టుకుంటున్న ట్రోల్ సాంగ్  


నిజానికి చిత్ర విచిత్రమైన సినిమాలు చేయడంలో ఉపేంద్ర దిట్ట. అలాంటి సినిమాలతోనే కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా కథలే చాలా వింతగా ఉంటాయి. ఆయన తప్ప మరొకరు ఆ సినిమాలు చేయలేరు అనేలా ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్ తోనే ఆయన లేటెస్ట్ మూవీ 'యూఐ' రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న 'యూఐ' నుంచి ట్రోల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో ఏకంగా తెలుగు సెలబ్రిటీలపై సటైర్లు వేశారు. అంతేకాదు, ప్రస్తుతం సోషల్ మీడియా సొసైటీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అనే విషయాన్ని ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు. ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మారేందుకు ఎలా దిగజారిపోతున్నారు? ఇన్ స్టా రీల్స్, లైక్స్ కోసం ఎలాంటి పనులు చేస్తున్నారు? ఎలాంటి విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి? అనేది ఈ పాటలో చూపించారు. మనుషులు సమాజం, సామాజిక బాధ్యతలను వదిలేసి, టైం పాస్ కోసం సోషల్ మీడియాలో ఎలా గడుపుతున్నారు? అని చెప్పడంతో పాటు రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిన విషయాలను గుర్తు చేశారు. రాజకీయ నాయకుల నుంచి బర్రెలక్క దాకా, అర్జున్ రెడ్డి నుంచి కుమారీ ఆంటీ దాకా అందరిపైనా సెటైర్లు విసిరారు. ‘ట్రోలవుతుందే.. నీది ట్రోలవుతుందే’ అంటూ సాగిన ఈ పాట వినడానికి కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  



‘ఉప్పి 2’ తర్వాత 'యూఐ'కి దర్శకత్వం


2015లో ‘ఉప్పి 2’ అనే మూవీని డైరెక్ట్ చేసి నటించారు ఉపేంద్ర. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన మళ్లీ మైక్రోఫోన్ పట్టలేదు. ఇక ఇప్పుడు 'యూఐ'ని దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. లహరీ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పీతో పాటు వీనస్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు ఈ సిన‌మాని నిర్మిస్తున్నాయి. వర్చువల్ రియాలిటీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది.   ఇందులో ఉపేంద్రతో పాటు సన్నీ లియోన్, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, ఇంద్రజీత్ లంకేశ్, మురళీ కృష్ణలాంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Read Also: అనంత్ అంబానీ వాచ్ ధర అన్ని కోట్లా? ఆశ్చర్యపోయిన జుకర్‌‌బర్గ్ దంపతులు