తెలుగు చిత్రసీమకు కథానాయికగా పరిచయం అవుతున్న పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి సుమయా రెడ్డి. 'డియర్ ఉమ' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు ఆమె రానున్నారు. అందులో కథానాయికగా నటించడమే కాదు... ఆ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం కానున్నారు. తన తొలి సినిమాకు నిర్మాణ బాధ్యతలు సైతం ఆమె చూసుకుంటున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన సుమయా రెడ్డి... ఆ బ్యానర్ మీద 'డియర్ ఉమ' నిర్మిస్తున్నారు. ఈ మధ్య విడుదలైన టీజర్ వన్ మిలియన్ వ్యూస్ సాధించింది. సినిమా విడుదలకు ముందు పుణ్య క్షేత్రాలకు వెళ్లి వస్తున్నారు సుమయా రెడ్డి. 


తిరుమలలో సుమయా రెడ్డి
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సుమయా రెడ్డి... స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. 'డియర్ ఉమ' టీజర్ (Dear Uma Teaser)కు వచ్చిన స్పందన తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, సినిమా సైతం మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామని సుమయా రెడ్డి పేర్కొన్నారు.


తిరుమల కంటే ముందు సింహాద్రి పురంలోని వెంకటేశ్వర స్వామిని సుమయా రెడ్డి దర్శించుకున్నారు. అక్కడ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ ఆలయ నిర్మాణానికి రూ. 1.70 లక్షలు విరాళంగా అందజేశారు.


Also Read: అమ్ము రోల్ పూజా హెగ్డే చేస్తే - 'గుంటూరు కారం' సెట్స్‌లో మహేష్, పూజ ఫోటోలు చూశారా?

 
'డియర్ ఉమ'లో 'దియా' ఫేమ్ పృథ్వీ అంబర్
'డియర్ ఉమ'లో సుమయా రెడ్డి, 'దియ' సినిమా ఫేమ్ పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా గురించి సుమయ రెడ్డి మాట్లాడుతూ ''ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అందమైన ప్రేమకథతో పాటు చక్కని సందేశాన్ని కూడా ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. లవ్, ఫ్యామిలీ, యాక్షన్, డ్రామా మేళవించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించాం'' అని చెప్పారు.


Also Read: వ్యూహం రివ్యూ: ఓడిపోతాడని వైఎస్ జగన్‌కు తెలుసు - రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా ఎలా ఉందంటే?






సుమయ రెడ్డి విషయానికి వస్తే... ఆమె మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటంతో తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేశారు. మొదటి సినిమాతో తనకు మంచి పేరు, విజయం వస్తుందని ఆశిస్తున్నారు. సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్న 'డియర్ ఉమ' సినిమాలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, సీనియర్ హీరోయిన్ ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), రూప లక్ష్మీ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: సత్య గిడుతూరి, ఛాయాగ్రహణం: రాజ్ తోట, సంగీతం: రధన్, నిర్మాణ సంస్థ: సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత: సుమయ రెడ్డి