Shah Rukh Calls Ram Charan as Idly Vada: రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేష్‌-నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మార్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నిన్నటితో కనుల పండుగా ముగిశాయి. గుజరాత్ జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, దిగ్గజ కంపెనీల సీఈవోలు, వరల్డ్‌ వైడ్‌గా ఉన్న సినీ ప్రముఖులు, బాలీవుడ్‌ ఇండస్ట్రీ వేడుకలో పాల్గొన్ని సందడి చేశారు. ఇక ఈ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌కి సౌత్‌ నుంచి కేవలం సూపర్‌ రజనీకాంత్‌, టాలీవుడ్‌ ఇండస్ట్రీ నుంచి రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలో చరణ్‌కు అవమానం జరిగిందంటూ ప్రస్తుతం టాలీవుడ్‌, మెగా ఫ్యాన్స్‌ బాలీవుడ్‌పై గుర్రుమంటున్నారు.


సౌత్‌ స్టార్‌ అలా పిలవడం నచ్చలేదు.. 


ప్రీవెడ్డింగ్‌ వేడులో రామ్‌ చరణ్‌ స్టేజ్‌పై సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, అమిర్‌ ఖాన్‌లతో కలిసి నాటూ నాటూ పాటకు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే దీనికి ముందు జరిగిన ఓ సంఘటనను తాజాగా ఉపాసన మేకప్‌ ఆర్టిస్ట్‌ జెబా హాసన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. అంబానీ ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో చరణ్‌ను అవమానించారని, ఇది ఎలా జరిగిన ఓ సౌత్‌ స్టార్‌ని అలా పిలవడం నచ్చలేదంటూ పోస్ట్‌ షేర్‌ చేసింది. ఈ ఈవెంట్‌లో అప్పటికే స్టేజ్‌పై అంబానీ కుటుంబంతో పాటు షారుక్‌, సల్మాన్‌, అమిర్‌లు ఆస్కార్‌ విన్నింగ్‌ సాంగ్‌ నాటు నాటు పాటకు డ్యాన్స్‌ చేశారు. ఈ క్రమంలో నీతా అంబానీ రామ్ చరణ్ కూడా అక్కడే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 






సౌత్‌ ఇండస్ట్రీ అంటే అంత చిన్న చూపా?


దీంతో వెంటనే షారుక్‌ రామ్‌ చరణ్‌ ఎక్కడా? అని అడుగుతూనే వెంటనే తమిళ్‌ భాషలో మాట్లాడుతూ.. ఇడ్లీ, వడా సాంబార్ తినేసి కూర్చున్నావా? రామ్ చరణ్ ఎక్కడున్నావ్? అంటూ పిలిచాడు. ఆ తర్వాత రామ్ చరణ్ స్టేజ్ మీదకు వచ్చాడు. ఖాన్ లతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేశాడు. గ్లోబల్‌ స్టార్‌ అయిన చరణ్‌ను ఇడ్లీ, సాంబార్‌ అని పిలవడం ఏమాత్రం బాలేదంటున్నారు. టాలీవుడ్‌పై ఉన్న అక్కసును షారుక్ ఇలా బయటపెట్టాడంటూ మెగా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని జెబా కూడా ప్రస్తావిస్తూ విచారం వ్యక్తం చేశారు. "ఆ టైంలో నేను కూడా స్టేజ్‌పై ఉన్నాను. రామ్‌ చరణ్‌ను ఇడ్లీ-వడా అని పిలవడంతో నాకు కోపం వచ్చింది. ఆయనను అలా పిలవడం నాకు నచ్చలేదు. దీంతో వెంటనే స్టేజ్‌ దిగి కిందకువెళ్లిపోయాను. బాలీవుడ్‌కు టాలీవుడ్‌, సౌత్‌ ఇండస్ట్రీ అంటే చిన్నచూపు అనేది ఈ తాజా సంఘటనతో మరోసారి రుజువైంది" అంటే  జెబా హాసన్‌ తన పోస్ట్‌లో పేర్కొంది. 






ఆ మంటను షారుక్‌ ఇలా చూపించాడు..


షారుక్ ఖాన్  ఏదో సరదాకి అలా పిలిచినా..ఎంతోమంది అతిథులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు అక్కడ ఉన్నారు. వారి ముందు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ని ఆహ్వీనించే తీరు మాత్రం సరైనది కాదు. షారుక్‌ తీరు చూస్తుంటే ఇంకా బాలీవుడ్‌కు టాలీవుడ్‌పై ఉన్న చిన్నచూపు అలాగే ఉందనిపిస్తుంది. ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్‌ అనేవారు. కానీ దానికి టాలీవుడ్‌ చెరిపేసింది. ఇప్పుడు ఇండియన్‌ మూవీ అంటే టాలీవుడ్‌ అంటున్నారు. బాహుబలి తర్వాత తెలుగు సినిమా, టాలీవుడ్‌ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు పొందింది. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోన నాటు నాటు పాట ఆస్కార్‌ గెలవడంతో చరణ్‌ ఇంటర్నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు పొందారు.. అదే ఇప్పుడు బాలీవుడ్‌కు గిట్టడం లేదనుకుంటా.. తెలుగు సినిమా హీరోలు గ్లోబల్‌ రేంజ్‌లో క్రేజ్‌ సంపాదించుకోవడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారేమో.. అదే మంటతో షారుక్‌ ఇలా వ్యవహరించాడంటూ తెలుగు ఆడియన్స్‌, మెగా ఫ్యాన్స్‌ చురకలు అంటిస్తున్నారు.