Family Star Teaser Out: గతేగాది 'ఖుషి' మూవీతో అలరించిన రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఈ సారి ఫ్యామిలీ స్టార్‌గా రాబోతున్నాడు. విజయ్ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’  ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను నెల ముందే ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. అందులో భాగంగా మూవీ టీజర్ లాంచ్‌కు నేడు ముహుర్తం ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు నిన్న అప్‌డేట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం(మార్చి 4) ఫ్యామిలీ స్టార్‌ టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు నిన్న విజయ్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దానికంటే రెండు రోజుల ముందే ‘టీజర్ వస్తుంది’ అంటూ ట్వీట్ వదిలి ఫ్యాన్స్‌లో క్యూరియాసిటి పెంచాడు. విజయ్‌ చెప్పినట్టుగానే తాజాగా ఫ్యామిలీ స్టార్‌ టీజర్‌ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే విడుదలైన టీజన్‌ మూవీపై అంచాలు పెంచేస్తోంది. 


టీజర్‌ ఎలా ఉందటే..


టీజర్‌లో విజయ్‌ దేవరకొండ చాలా కూల్‌ లుక్‌లో కనిపించాడు. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలా ఫ్యామిలీ కోసం పరితపించే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. అదే ఫ్యామిలీకి ఆపద వస్తే రౌడీలా కూడా కనిపించాడు. టీజర్‌లో మృణాల్ ఠాకూర్, విజయ్‌ దేవరకొండ మధ్య సంభాషణ ఆసక్తిగా ఉంది. బస్టాప్‌లో ఉన్న మృణాల్ ఠాకూర్ విజయ్‌ని 'ఏవండి.. కాలేజ్‌కి వెళ్లాలి.. కాస్తా దించేస్తారా? అని అడగ్గా లీటర్‌ ప్రెట్రోల్‌ కొట్టించు దించేస్తా' అనడం కొత్తగా ఉంది. ఇది టీజర్‌కి హైలెట్‌ అని చెప్పాలి. మొత్తానికి టీజర్‌ చూస్తుంటే మిడిల్‌ క్లాస్‌ ఆడియన్స్‌ని మెప్పించడం పక్కా అనే అభిప్రాయం వస్తుంది. 



ఈసారైనా రౌడీ హీరో హిట్‌ కొడతాడా?


ఏడాదిన్నర క్రితం పాన్‌ ఇండియా అంటూ లైగర్‌తో వచ్చాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. మేకర్స్‌ను నష్టాల్లో పడేసింది. దాంతో కాస్తా గ్యాప్‌ తీసుకున్న విజయ్‌ తన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ‘ఖుషి’ అనే ప్రేమకథతో వచ్చాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంతతో జోడీకట్టాడు విజయ్. సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారనే అంశం చాలామంది ఆడియన్స్‌ను ఎగ్జైట్ చేసింది. అందుకే ఈ మూవీని థియేటర్లలో చూడడానికి బయల్దేరారు. కానీ ‘ఖుషి’కి అంతగా పాజిటివ్ టాక్ లభించలేదు. మిక్స్‌డ్ టాక్‌తో యావరేజ్ హిట్‌గా నిలిచింది. ‘లైగర్’ వల్ల విజయ్ దేవరకొండ తిన్న ఎదురుదెబ్బను ‘ఖుషి’ కవర్ చేయలేకపోయింది. అందుకే ఇక ఆశలన్నీ ‘ఫ్యామిలీ స్టార్’పైనే పెట్టుకున్నాడు. 


మృణాల్ కోసం ఎదురుచూపులు..


‘ఫ్యామిలీ స్టార్’ కోసం మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే మృణాల్ స్టోరీ సెలక్షన్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ‘సీతారామం’లో సీతగా, ‘హాయ్ నాన్న’లో యశ్నగా పక్కింటమ్మాయి పాత్రల్లోనే కనిపించి అలరించింది ఈ భామ. ఇక ‘ఫ్యామిలీ స్టార్’లో కూడా తన పాత్ర మిడిల్ క్లాస్ అమ్మాయిలకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని గ్లింప్స్, పాట చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికీ ఈ మూవీలో విజయ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో గ్లింప్స్ ద్వారా కాస్త ఐడియా వచ్చినా.. మృణాల్ క్యారెక్టరైజేషన్ గురించి మాత్రం దర్శకుడు ఎక్కువగా రివీల్ చేయలేదు. అందుకే టీజర్‌లో మృణాల్‌ను చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.