Actress Jayasudha on Husband Suicide: అలనాటి హీరోయిన్‌ జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సహజమైన నటనతో ఎంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా సహజనటిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌, శోభన్‌బాబు వంటి దిగ్గజాలల సరసన హీరోయిన్‌గా నటించిన మెప్పించింది. 80's, 90'sలలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తుంది. తల్లి పాత్రల్లో ఒదిగిపోయి ఎమోషన్‌ పండిస్తుంది. అయితే ఈ మధ్య పెద్దగా వెండితెరపై కనిపించడం లేదు. సెలక్టివ్‌ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తుంది. అదే సమయంలో జయసుధ మూడో పెళ్లంటూ రూమర్స్‌ గుప్పుమన్నాయి.


దానికి కారణంలో ఓ కార్యక్రమంలో అమెరికాకు చెందిన వ్యాపారవేత్తతో ఆమె కనిపించడమే. అప్పటి నుంచి మళ్లీ పెళ్లి చేసుకోబోతోందా? అని అంతా గుసగులాడుకుంటున్నారు. అయితే గతంలోనే ఈ రూమర్స్‌కు ఆమె చెక్‌ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా జయసుధ ఓ యూట్యూబ్ ఛానల్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా తన భర్త సూసైడ్‌, రెండో పెళ్లి రూమర్స్‌పై స్పందించింది. ఈ సందర్భంగా ఇంటర్య్వూలో జయసుధకు తన రెండో భర్త నితిన్‌ ఆత్మహత్యపై షాకింగ్‌ ప్రశ్న ఎదురైంది. అప్పుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, దానికి కారణం మీరే అంటున్నారు.. దీనిపై పేరు ఏం చెప్పాలనుకుంటున్నారని యాంకర్‌ ప్రశ్నించారు. దీనిపై జయసుధ స్పందిస్తూ ఇలా అన్నారు.


మీ భర్త సూసైడ్‌కు మీరే కారణమంటా? 


"నా భర్త ఆత్మహత్య కారణం నేను కాదు. మాకు చనిపోయేంత అప్పులు లేవు. ఆయన నిర్మాతగా విఫలమయ్యారు. దానివల్ల ఇబ్బందులు పడ్డాం. కానీ అప్పులపాలు మాత్రం కాలేదు.   నేను బాగానే సంపాదించేదాన్ని కదా. మాకు ఎప్పుడు అప్పుల భయం ఉండేది కాదు. ఆయన మరణానికి కారణం మా అత్తింటి వాళ్లకు ఉన్న శాపం. మా ఆయన అన్నయ్య కూడా  అలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. వారే కాదు మా అత్తింటికి సంబంధించిన మరో ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకునే చనిపోయారు.


అదీ శాపం వల్ల జరుగుతుంది. ఈ శాపం నా పిల్లలకు రాకుడదని ప్రతిరోజూ ఆ దేవుడికి ప్రార్థిస్తున్నా. చావు-బ్రతుకులు మనిషి నోటి నుంచి వచ్చే మాటలతో ముడిపడి ఉంటుందంటారు. అదీ నిజం. ఒక మనిషి నాశనం కావాలని కోరుకుంటూ శపించారంటే అదీ జరుగుతుంది. చాలా మంది కూడా ఇదే అంటారు. చర్చ్‌ పాస్టర్స్, గుళ్లో పంతులు కూడా అదే చెబుతారు. మనిషి దేనినుంచి అయినా బయటపడగలడు కానీ, శాపం నుంచి మాత్రం బయటపడలేరని.. దానిని నుంచి దేవుడు కూడా తప్పించలేరు.. ఇది నిజమని నేను కూడా నమ్ముతున్నా" అన్నారు.


Also Read: ముఖేష్‌-నీతాలు ఆ కైలాసం, వైకుంఠాన్నే కిందికి దించారు - ప్రీ వెడ్డింగ్‌ ఏర్పాట్లు మెస్మరైజ్‌ చేశాయి


ఆ సినిమా వల్లే ఈ విషాదం నుంచి బయటపడ్డా..


ఇక తన భర్త మరణం తర్వాత కోలుకోవడానికి తనకు చాలా కాలం పట్టిందన్నారు. మూడు నెలల పాటు తనకు ఏం అర్థం కాలేదు, షాక్‌లోనే ఉండిపోయాను. ఆ సమయంలో తన ఫ్యామిలీ తనకు సపోర్టు ఇచ్చారన్నారు. ముంబయిలో ఉంటున్న మా సిస్టర్స్‌ నాకు రోజు ఫోన్‌ చేసి మాట్లాడుతుండేవారు. చాలా ఒంటరిగా అనిపించేది. అదే సమయంలో దిల్‌ రాజు గారు శతమానం భవతి సినిమా కోసం నన్ను సంప్రదించారు. నేను ఇక సినిమాలు చేయొద్దు అనుకున్న. కానీ మీరు చేయాల్సిందే అని పట్టుబట్టారు. అప్పుడే దిల్‌ రాజు భార్య  కూడా చనిపోయారు. సినిమా షూటింగ్‌లో మాట్లాడుకోవడం, వర్క్‌ బిజీ ఉండటం వల్ల ఆ విషాదం నుంచి బయటపడ్డాం.


కానీ షూటింగ్‌ తర్వాత ఇంటికి వెళితే మళ్లీ అదే బాధ వెంటాడేది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ వచ్చింది. ఆ సమయంలో మరింత ఒత్తిడికి గురయ్యా" అంటూ చెప్పుకొచ్చింది. ఇక అమెరికాకు చెందిన వ్యక్తితో మూడో పెళ్లని వార్తలు వచ్చాయి, ఫొటో కూడా బయటకు వచ్చిందనగా దానిపై తాను ఏం మాట్లాడాలనుకోవడం లేదంది. ఎందుకంటే అందులో నిజం లేదని స్పష్టం చేశారు. ఇక సోషల్‌ మీడియా వచ్చాక మంచికంటే చేడునే ఎక్కువగా చూపిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. మనం ఏం చెప్పిన, ఏం మాట్లాడాలిన అందులో నిజం ఉన్న అబద్ధాన్నే చూపిస్తున్నారంటూ జయసుధ పేర్కొన్నారు.