Rajinkanth About Anant - Radhika Pre Weddimng: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంబానీ పెళ్లి వేడుక సందడే కనిపిస్తుంది. భారత అపర కుబేరుడు,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(28) త్వరలో పెళ్లీ పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలై 12న పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్-శైలాల కుమార్తె రాధిక మార్చంట్ మెడలో అనంత్ మూడుమూళ్లు వేయనున్నాడు.
ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిరథమహారథులు హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ వీడియోలు, ఫొటోలే సందడి చేశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుక నిన్నటితో ముగిసింది. దీంతో ఈ వెడ్డింగ్‌కు హాజరైన వారంత తిరుగుపయనం అవుతున్నారు.
కైలాసం, వైకుంఠాన్నే కిందికి దించారు
అనంత్ రాధికల ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‌కు సౌత్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యామిలీ హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో రజనీ మీడియాతో మాట్లాడిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో ఆయన అనంత్-రాధికలను శుభాకాంక్షలు తెలుపుతూ ముఖేష్ - నీతా అంబాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన రజనీ ఇలా అన్నారు. ముఖేష్-నీతా అంబానీలు ఈ ప్రీవెడ్డింగ్ ఈవెంట్‌ను కనుల పండుగా నిర్వహించారు. ఈవెంట్ ఏర్పాట్లు అందరిన మెస్మరైజ్ చేశాయి. ఈ వేడుకతో వారు కైలాసం, వైకుంఠాన్నే ప్రపంచాలనే వారు భూమికి తీసుకువచ్చరాఉ. అనంత్-రాధికలకు నా శుభాకాంక్షలకు. వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా" అని అన్నారు. ప్రస్తుతం రజనీ కామెంట్స్ వైరల్‌గా మారాయి. కాగా ముఖేష్-నీతా అంబానీ ఈ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ కోసం సుమారుగా రూ. 1000 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కనుల పండుగగా జరిగిన ఈ వేడుకలో గెస్ట్స్ కోసం వారు ప్రత్యేకంగా దాదాపు 2500 రకాల వంటాలకు చేయించిన సంగతి తెలిసిందే.
భారతీయ సంప్రదాయాలకు పెద్దపీట
వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా భారతీయ సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న సంబరాలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలను, ఫొటోలను అంతా షేర్ చేస్తున్నారు. మొదటి రోజు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మెహందీ ఫంక్షన్ నుంచి ప్రధాన వేడుక వరకు అన్నింటినీ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. భారతీయ వివాహాలు, అక్కడ చేపట్టే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ వివిధ ఆచారాలను కలిగి ఉంటాయి. వాటన్నింటినీ అంబానీ ఫ్యామిలీ పాటించిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి. భారీగా విదేశీయులు కొలువుదీరి ఉన్న వేదికపై అచ్చమైన భారతీయ సంప్రదాయపద్దతిలో ముందస్తు పెళ్లి వేడుక జరగడం అభినందనీయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నృత్యంతో కొడుకు-కోడలికి నీతా ఆశీస్సులు
ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ చివరి రోజు స్టార్స్ నుంచి అంబానీ కుటుంబ సభ్యుల వరకు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ సతీమణి, అనంత్ తల్లి నీతా అంబాని నృత్యం ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసింది. సంప్రదాయం, ఆధ్యాత్మికతకు మేళవిస్తూ సాగిన నీతా నృత్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. శక్తి, సహనానికి ప్రతిరూపమైన దుర్గాదేవిని స్తుతిస్తూ సాగిన పాటకు నీతా అంబానీ చేసన నృత్యం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులను చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.