Rajinikanth Trolling Netizens: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. గుజరాత్ జామ్ నగర్ వేదికగా జరిగిన ఈ సంబురాల్లో దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక సౌత్, నార్త్ అనే తేడా లేకుండా స్టార్ యాక్టర్లు అంతా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో బాలీవుడ్ అగ్ర హీరోలు షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ వేసిన స్టెప్పులు వచ్చిన అతిథులను ఎంతగానో అలరించాయి. పాప్ సింగర్ రిహన్నా పర్ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రామ్ చరణ్ నాటు స్టెప్పులు అదరహో అనిపించాయి.


సింపుల్ గా ఈ వేడుకకు హాజరైన రజనీకాంత్


అందరు స్టార్ హీరోస్ మాదిరిగానే తమిళ సూపర్ స్టార్ తన సతీమణి లతా రజనీకాంత్, కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తో కలిసి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు హాజరయ్యారు. సూపర్ స్టార్ అయినప్పటికీ ఆయన చాలా సింపుల్ గా ఈ వేడుకకు హాజరయ్యారు. ఓ సాధారణ ఫ్యాంట్, మామూలు టీ షర్ట్ తో భుజానికి ఓ బ్యాగ్ తగిలించుకుని వచ్చారు. సూపర్ స్టార్ ఇలా రావడం ఏంటని పలువురు ఆశ్యర్యపోయారు.


పని మనిషిని పక్కన ఉండమన్న రజనీ, నెటిజన్ల ఆగ్రహం


అనంత్ అంబానీ వేడుక ప్రాంగణంలోకి రజనీ ఫ్యామిలీ అడగు పెట్టగానే ఫోటోగ్రాఫర్లు స్టిల్స్ కోసం ఆగమని రిక్వెస్ట్ చేశారు. అందరిలాగే రజనీ ఫ్యామిలీ కూడా ఫోటోల కోసం పోజులు ఇస్తారు. అయితే, ఈ సమయంలో వారి వెంట వచ్చిన పని మనిషిని కాస్త దూరంగా ఉండాలని రజనీకాంత్ చెప్పడంతో ఆమె పక్కకు వెళ్లింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆమెను పక్కకు వెళ్లమని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. తమతో పాటు వస్తున్న పని మనిషిని పక్కకు వెళ్లమని చెప్పడం ఏం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెర మీదే కాదు, తెర వెనుక కూడా హీరోలాగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకాలం రజనీకాంత్ మీద ఉన్న గౌరవం ఈ వీడియోతో పోయిందని మరికొంత మంది కామెంట్ పెడుతున్నారు. తమతో పాటు పని మనిషిని కూడా ఫోటో దిగేందుకు అనుమతిస్తే ఆయన గౌరవం మరింత పెరిగేదని ఇంకొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.






రజనీకాంత్ కు మద్దతుగా మరికొంత మంది కామెంట్స్


కొంత మంది నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తుంటే, మరికొంత మంది మాత్రం ఆయనకు అనుకూలంగా కామెంట్స్ పెడుతున్నారు. రజనీకాంత్ ఏదో పొరపాటుగా ఆలా చేశారే తప్ప, నిజానికి చాలా మంచి వ్యక్తి తను అంటూ సపోర్టుగా ట్వీట్స్ పెడుతున్నారు. మొత్తంగా ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.  


Read Also: అనంత్ అంబానీయే కాదు, ఈ బాలీవుడ్ స్టార్స్ కూడా పెళ్లికి కోట్లు ఖర్చు చేశారు, జాగ్రత్త.. గుండె ఆగుద్ది!